పితరులు ప్రవక్తలు

73/75

71—దావీదు పాపం, పశ్చాత్తాపం

బైబిలులో మనుషులు స్తుతి లేదు. ఉత్తమ పురుషుల సుగుణాల ప్రస్తావనకు సైతం ఎక్కువ స్థలం కేటాయింపు జరుగలేదు. ఇది అకారణంగా జరిగినపని కాదు. అందులో నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. మనుషుల్లోని సద్గుణాలన్నీ దేవుని వరమే. వారు చేసే మంచి పనులు దేవుని కృప వలన క్రీస్తు ద్వారా జరుగుతున్నవే. తమకున్న స్వరం దేవుని వల్ల కలిగిందే గనుక వారి ఉనికి క్రియల ఘనత ఆయనకే చెందుతుంది. వారు ఆయన చేతిలో పనిముట్లు మాత్రమే. ఇంకా చెప్పాలంటే బైబిలు చరిత్ర బోధిస్తున్న పాఠాల్ని బట్టి మనుషుల్ని స్తుతించటం లేదా మనుషుల్ని అత్యున్నత స్థాయికి హెచ్చించటం ప్రమాదకరం. ఎందుకంటే వ్యక్తి తాను దేవుని పై ఆధారపడి ఉన్నానన్న సంగతి విస్మరించి స్వశక్తినే నమ్ముకుంటే అతడికి పతనం తప్పదు. మానవుడు తనకన్నా బలమైన శత్రువులతో పోరాడుతున్నాడు. “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాధులతోను, ఆకాశమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” ఎఫెసీయులకు 6:1 సొంత శక్తితో మనం ఈ పోరాటాన్ని కొనసాగించలేం. మన మనుసుల్ని దేవుని మీదనుంచి ఏదైతే మళ్లిస్తుందో ఏదైతే స్వీయ ఔన్యత్యానికి దారి తీస్తుందో లేదా స్వయం సమృద్ధికి నడుపుతొందో అది నిశ్చయంగా మన నాశనానికి హేతువవుతుంది. మనం మానవ శక్తి పై అవిశ్వాసం దైవ శక్తి పై విశ్వాసం పెంచుకోవాలన్నదే బైబిలు ఉద్బోధ. PPTel 729.1

దావీదు పతనానికి ఆత్మ విశ్వాసం ఆత్మ ఔన్నత్య స్వభావమే కారణం. పొగడ్త అధికారం పట్ల ఆకర్షణ, సుఖభోగాల వాంఛ వీటి ప్రభావం అతడి పై లేకపోలేదు. చుట్టు ఉన్న రాజ్యాలతో సాన్నిహిత్యం అతడి పై దుష్ప్రభావాన్ని ప్రసరిచింది. తూర్పు రాజులు అనుసరించిన ఆచారాల ప్రకారం పాలితుల్లో సహించరాని నేరాలు పాలకుల్లో ఖండనార్తాలుకావు. పాపం అతి నీచమైందన్న స్పృహ దావీదులో కొరవడటానికి ఇదంతా తోడ్పడింది. వినయ మనసు కలిగిదేవుని మీద ఆధారపడే బదులు దావీదు తన సొంత విజ్ఞతను శక్తిని నమ్ముకొన్నాడు. ఆత్మను దేవునినుంచి విడదీయగలిగిన వెంటనే సాతాను మానవుడిలో పాప స్వభావానికి సంబంధించిన అపవిత్ర కోర్కెల్ని రెచ్చగొడ్తాడు. సాతాను పని ఆనాలోచితంగా అప్పటికప్పుడు ప్రారంభమయ్యేది కాదు. ఆరంభంలో అది హఠాత్తుగా ఒళ్ళు పులకరించే విధంగా ఉండదు. అది గోప్యంగా వ్యవహరించి బలీయమైన నియమాల్ని దెబ్బతీస్తుంది. అది పైకి చిన్నవిగా కనపించేవాటితో మొదలవుతుంది. దేవునికి నమ్మకంగా ఉంటం ఆయన పై సంపూర్తిగా ఆధారపడటం, లోకాచారాల్ని అలవాట్లను అనుసరించటం వంటి వాటిలో మొదలవుతుంది. PPTel 729.2

అమ్మోనీయులతో యుద్ధం ముగియకముందు సైనిక నేతృత్వాన్ని యోవాబుకి విడిచి పెట్టి దావీదు యెరూషలేముకి తిరిగి వచ్చాడు. సిరియనులు అప్పుడే ఇశ్రాయేలీయులికి లొంగిపోయారు. ఆమ్మోనీయుల ఓటమి నిశ్చితంగా కనిపించింది. విజయ ఫలాలు,సమర్ధమైన తన పరిపాలన, పేరు ప్రతిష్టలుతను చుట్టు ఉన్నాయి. దావీదు విశ్రాంతిగా ఒకింత అశ్రద్ధగా వున్న ఈ సమయంలో శోధకుడు అతడి మనసును అదుపు చేయటానికి పూనుకున్నాడు.దేవుడు దావీదు తన ప్రవర్తనను నిందారహితంగా కాపాడుకోవటానికి గొప్ప ప్రోత్సాహకం కావలసింది. అయితే జీవితం సుఖ సంతోషాలతో భద్రతా భావంతో సాగుతున్న తరుణంలో అతడు దేవుని పై పట్టు విడిచి పెట్టాడు. సాతానుకు లొంగిపోయిన తన ఆత్మపై అపరాధ ముద్ర వేసుకున్నాడు. దేశ నేతగా దేవునిచే ఎంపికైన తాను, దైవ ధర్మశాస్త్ర ఆచరణ నాయకత్వానికి దేవునిచే ఎంపికైన తాను ఆ ధర్మశాస్త్ర సూత్రాల్నే కాలరాశాడు. దుష్టుల గుండెల్లో దడ పుట్టించాల్సిన తానే తన క్రియ వల్ల దుష్టులికి బలం చేకూర్చాడు. PPTel 730.1

తన గత జీవితంలోని శ్రమలనడుమ భక్తి పూర్వకంగా విశ్వాసంతో తన భారాన్ని దేవుని మీద మో పేవాడు. తనను బంధించటానికి శత్రువు పన్నిన అనేక ఉచ్చుల నంచి అతణ్ణి దేవుని హస్తం తప్పించింది. అయితే ఇప్పుడు అపరాధి అయి పశ్చాత్తాపం లేకుండా, దేవుని సహాయాన్ని మార్గదర్శకత్వాన్ని కోరకుండా తాను చేసిన పాపం తెచ్చి పెట్టిన ప్రమాదం నుంచి బయటపడటానికి అపసోపాలు పడున్నాడు. బఱిబ సౌందర్యం రాజుకి ఒక ఉచ్చుగా పరిణమించింది. ఆమె దావీదు నమ్మకమైన సాహసవంతుడైన అధికారి ఊరియా భార్య. ఆ నేరం వెల్లడి అయితే దాని పర్యవసానం ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. వ్యభిచారి మరణానికి పాత్రుడని ధర్మశాస్త్రం శాసిస్తుంది. అంతటి అన్యాయానికి గురి అయిన ఆత్మాభిమానం గల ఆ సైనికుడు రాజు ప్రాణం తీయటం ద్వారా గాని లేదా ప్రజల్ని తిరుగుబాటకు రెచ్చ గొట్టం ద్వారా గాని తన పగ చల్లార్చుకోవానికి ప్రయత్నించవచ్చు. PPTel 730.2

తన దోషిత్వాన్ని దాచటానికి దావీదు చేసిన ప్రతీ ప్రయత్నం వ్యర్థమయ్యింది. అతడు సాతాను శక్తికి తన్ను తాను అప్పగించుకొన్నాడు. అపాయం అతణ్ణి చుట్టుముట్టింది. మరణం కన్నా భయంకరమైన అవమానం అతడికి ఎదురుగా నలిచింది. తప్పించకోవటానికి ఒకే ఒక మార్గం కనిపించింది. తన విషమ పరిస్తితిలో వ్యభిచారంతో పాటు హత్యకు పూనుకున్నాడు. సౌలు నాశనాన్ని కలిగించినవాడు దావీదును కూడా నాశనానికి నడిపించటానికి ప్రయత్నిస్తున్నాడు. శోధనల్లో భేదం ఉన్నప్పటికి ధర్మశాస్త్ర ఉల్లంఘనకు దారి తీయట్యంలో అవి ఒకటే. ఊరియా శత్రువు చేతిలో మరణిస్తు అతడి హత్యనేరం రాజుమీదికి రాదు. బెల్జిబ దావీదు భార్య కావాటానికి మార్గం సుగమవుతుంది. రాచరికపు గౌరవం దెబ్బతినదు. PPTel 730.3

ఊరియా తన మరణ శాసనాన్ని తానే తీసుకు వెళ్ళటానికి ఏర్పాట్లు జరిగాయి. అతడి ద్వారా యోవాబుకి పంపిన ఉత్తరంలో రాజిచ్చిన ఆజ్ఞ ఇలా ఉంది. “యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపొమ్ము”. ఇంతకుముందే ఒక హత్యకు పాల్పడ్డ యోవాబు రాజు ఆదేశాన్ని నెరవేర్చటానికి వెనకాడలేదు. ఊరియా ఆమ్మోనీయుల ఖడ్గానికి బలి అయ్యాడు. PPTel 731.1

పరిపాలకుడుగా దావీదుకున్న ఘన చరిత్ర గల రాజులు ఇప్పటి వరకు ఎవరూ లేరు. అతడు “జనులందరిని నీతి న్యాయములనుబట్టి యేలు చుండెను”. (2 సమూయేలు 8:15) అని దావీదును గూర్చి రాయటం జరిగింది. అతడి చిత్తశుద్ది ఆతి విశ్వాసాన్ని స్వామిభక్తిని సంపాదించి పెట్టాయి. కాని అతడు దేవునికి దూరంగా వెళ్లిపోయి సాతానుకి లోబడటంతో కొంతకాలం సాతాను ప్రతినిధి అయ్యాడు. అయినా అతడు దేవుడు తనకిచ్చిన హోదాను అధికారాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నాడు. అతడు ఈ అధికారాన్ని పురస్కరించుకొని ప్రజల విధేయతను కోరాడు. ఆ విధేయత చూపేవారు తమ ఆత్మకు హాని చేసుకొంటున్న వారవుతారు. దేవుని పట్ల గాక దావీదు పట్ల ప్రభుభక్తి కనపర్చిన యోవాబు దేవుని ధర్మశాసనాన్ని ఉల్లంఘించాడు.ఆ ఉల్లంఘన రాజు ఆజ్ఞ ప్రకారమే జరిగింది. PPTel 731.2

దావీదుకున్న అధికారం దేవుడిచ్చిందే. దైవధర్మశాస్త్రానుగుణంగా ఉప యోగించిటానికి దాన్నిచ్చాడు. దైవ ధర్మశాసననాకి విరుద్ధంగా అతడు ఒక ఆదేశాన్నిచ్చినప్పుడు ఆ దేశానికి లోబడటం పాపం. “ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడియున్నవి”. (రోమా 13:1) అయితే అవి దైవ ధర్మ శాస్త్రానికి విరుద్ధంగా ఉపయుక్తమౌతున్నప్పుడు మనం వాటికి లోబాడాల్సిన అవసరంలేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మనం ఆచరించాల్సిన నియమాన్ని వివరిస్తున్నాడు. పౌలిలా అంటున్నాడు. “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకరాము మీరును నన్ను పోలి నడుచుకనుడి.” 1 కొరింథీ 11:1 PPTel 731.3

తన ఆదేశం అమలు నివేదకను యోవాబు దావీదుకు పంపాడు. అయితే తన మీదకు గాని దావీదు మీదకు గాని నిందరాకుండా ఉండేవిధముగా దాన్ని తయారు చేసాడు. “యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత... తమరి సేవకుడగు ఊరియాయు హతమాయె నని చెప్పుమని దూతను” యోవాబు ఆదేశించాడు. దూతపోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదుకు తెలియజేసెను. PPTel 732.1

బల్పెబ తన భర్తకోసం ఆచార నిర్దేశిత దినాలు సంతాపపడింది. ఆ కాలం పూర్తి అయిన తరువాత ” దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య”అయ్యింది. తాను ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నప్పుడు సైతం ఎవరి సున్నిత మనస్సాక్షి, గౌరవ ప్రతిష్టల్ని గూర్చి ఎవరి ఉన్నత భావాలు దేవునిచే అభిషేకం పొందిన నాయకుని పై చెయ్యి ఎత్తటానికి సమ్మతించలేదో ఆ వ్యక్తి ఎంతగా దిగజారిపోయాడంటే మిక్కిలి నమ్మకమైన బహు సాహసవంతుడైన ఒక సైనికుడికి అన్యాయం చేసి తన పాపం ఇచ్చే బహుమతిని నిరాటంకముగా అనుభవించేటందుకు ఆ సైనికుణ్ని హతమర్చాడు. అయ్యో! మేలిమి బంగారం ఎలా కళాహీనమయ్యింది! అతి శ్రేష్టమైన బంగారం ఎలా మారిపోయింది! PPTel 732.2

ఉల్లంఘన వలన కలిగే లబ్దిని గూర్చి సాతాను అది నుంచి మనుషులకు వర్ణిస్తూ వచ్చాడు. పరలోక దూతల్ని సయితం ఇలాగే తప్పుదారి పట్టించాడు. పాపం చెయ్యటానికి అదామవ్వల్ని ఇలాగే శోధించాడు. దేవునికి విధేయులు కాకుండా వేల ప్రజల్ని ఇంకా ఇలాగే నడిపిస్తున్నాడు. అతిక్రమ మార్గాన్ని కంటికి ఇంపుగా చేస్తున్నాడు. “అయితే తుదకు అది మరణమును త్రోవ తీయును”. సామెతలు 14:12 ఈ రకంగా దారి తప్పినవారు తమ పాప ఫలాలు బాధాకారాలు దు:ఖపూరితాలు అవి గుర్తించి సకాలంలో తిరిగి వస్తే వారు ధన్యులు, కృపామయుడైన దేవుడు దావీదును మోసకరమైన పాప ఫలాల ఆకర్షణీలో పడి పూర్తిగా నాశనమవ్వటానికి విడిచి పెట్టలేదు. PPTel 732.3

ఇశ్రాయేలీయుల్ని దృష్టిలో ఉంచుకొని కూడా దేవుడు జోక్యం చేసుకోవలసి వచ్చింది. కాలం గడిచేకొద్ది బలైబతో దావీదు పాపం బయట పడింది. ఊరియా మరణాన్ని దావీదు పథకం పన్ని ఏర్పాటు చేశాడన్న అనుమానం ప్రబలమయ్యింది. దేవునికి అగౌరవం కలిగింది. దేవుడు దావీదుపట్ల అభిమానం చూపి అతణ్ణి హెచ్చించాడు. అయితే దావీదు చేసిన పాపం దేవుని శీలాన్ని తప్పుడు కోణంలో చూపించి ఆయన నామానికి నింద తెచ్చింది. అది ఇశ్రాయేలీయుల భక్తి ప్రమాణాన్ని దిగజార్జింది. అనేకుల మనసుల్లో పాపం పట్ల ద్వేషాన్ని తగ్గించింది. దేవుని పట్ల ప్రేమ, భయంలేని వారు పాపంలో మరింత ధైర్యంగా కొనసాగేందుకు అది ప్రోత్సహించింది. PPTel 732.4

ప్రవక్త అయిన నాతానును మందలింపు వర్తమానంతో దేవుడు దావీదు వద్దకు పంపాడు. అది బహు కటువైన వర్తమానం. అలాంటి మందలింపును రాజులికి ఇచ్చేటప్పుడు ఇచ్చే వక్తికి మరణం తథ్యం. దేవుని వర్తమానాన్ని నాతాను జంకుకొంకు లేకుండా అందించాడు. అయితే రాజు సానుభూతిని పొందే రీతిగాను అతడి అంతరాత్మను మేల్కొలిపి అతడి నోటి నుంచే తన మరణ శాసనాన్ని పలికించేటట్లు గాక పరలోక జ్ఞానంతో నాతాను ఆ వర్తమనాన్ని అందించాడు. తన ప్రజల హక్కుల పరిరక్షణకు దేవుడు నియమంచిన వ్యక్తిగా దావీదును అభివర్ణించి అన్యాయానికి హింసకు గురి అయి న్యాయం కోరుతున్న ఒక బాధితుణ్ని గూర్చి ఒక కథ చెప్పాడు. PPTel 733.1

“ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యమంతునికి విస్తారమైన గొట్టెలను గొడ్డును కలిగి యుండెను. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కొనిన యొక చిన్నవాడు గొట్టెపిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్టునికి అయత్తము చేయుటకు తన గొట్టెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొట్టెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను”. PPTel 733.2

రాజు అగ్రహోదగ్రుడై ఇలా స్పందించాడు. ” యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణ పాత్రుడు. వాడు కనికరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ రొట్టె పిల్లకు ప్రతిగా నాలుగు గొట్టె పిల్లల నియ్యవలెను”. PPTel 733.3

నాతాను రాజు కళ్ళల్లోకి చూసాడు. అనంతరము కుడిచెయ్యి ఆకాశం వైపుకు ఎత్తి గంభీర స్వరంతో ఇలా అన్నాడు. “ఆ మనుష్యుడు నీవే, నీవు యెహోవా నా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి”? అపరాధులు దావీదులాగ తమ నేరం మనుషులికి తెలియకుండా దాచి ఉంచటం సాధ్యమే. “మనమెవనికి లెక్క యోప్పజెప్పవలసి యున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ” హెబ్రీ 4:13 “మరుగైనదేదియు బయలు పర్చకపోదు. రహస్యమైన దేదియు తెలియబడకపోదు”. మత్తయి 10:26 PPTel 733.4

నాతాను ఇలా అన్నాడు. ‘ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా- ఇశ్రాయేలీయుల మీదనేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి(తిని).. నీవు యెహోవా నా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హితీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు”. ఆమ్మోనీయుల చేత నీవతని చంపించితివి గదా?... నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును... నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచండగానే నీ భార్యలను తీసి నీ చేరువ వాని కప్పగించెదను.. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి. ఆని ఇశ్రాయేలయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును”. PPTel 734.1

ప్రవక్త మందలింపు దావీదు హృదయాన్ని చలింపజేసింది. అతడి మనస్సాక్షి మేల్కొంది. తన దోష స్వభావ స్వరూపాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. అతడి ఆత్మ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ దేవుని ముందు వంగింది. గద్గద స్వరంతో “నేను పాపము చేసితిని” అన్నాడు. ఇతరుల పట్ల చేసిన దోషమంతా బాధితుడి వద్ద నుండి దేవుని వద్దకు వెళ్తుంది. ఊరియా బెల్జిబల పట్ల దావీదు ఘోర పాపం చేసాడు. దీన్ని గూర్చి వేదన చెందాడు. అయితే దేవుని పట్ల అతడు చేసిన పాపం ఇంకెంత ఘోరమైన పాపం. PPTel 734.2

దేవుని వల్ల అభిషేకం పొందని వ్యక్తి విషయంలో మరణదండన అమలుపర్చే వారెవరూ ఇశ్రాయేలు దేశంలో ఉండకపోయినా క్షమాపణ పొందకుండా అపరాధిగా ఉన్న తాను దేవుని తక్షణ తీర్పు వల్ల మరణిస్తానేమోనని దావీదు భయకంపితుడయ్యాడు. కాగా దేవుడు ప్రకవ ద్వారా ఈ వర్తమనాం పంపాడు. “నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించెను”. అయినా న్యాయం కొనసాగాల్సి ఉంది. ఈ మరణ శాసనసం దావీదు పై నుంచి అతడి పాపం వలన కలిగిన బిడ్డ పైకి బదిలీ అయ్యింది. పశ్చాత్తాపం పొందటానికి దావీదుకి ఈ విధముగా అవకాశం కలిగింది. తన శిక్షణలో భాగంగా బిడ్డ మరణం దావీదుకి తన సొంత మరణం కన్నా ఎక్కువ బాధాకరంగా ఉంది. ప్రవక్త ఇలా అన్నాడు. “ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులక నీవు గొప్ప హేతువ కలుగజేసితిని గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా వచ్చును.” PPTel 734.3

తన బిడ్డ జబ్బు పడగా దావీదు ఉపవాసము నుండి దీన మనసుతో ఆ బిడ్డ ప్రాణం కోసం ప్రార్ధించాడు. తన రాజ వస్త్రాలు తీసి పక్క పెట్టాడు. కిరీటాన్ని తీసివేసాడు. ప్రతీరాత్రి నేల పై పడి ఉండి పుట్టెడు దు:ఖంతో తన పాపం నిమిత్తం బాధననుభవిస్తున్న నిరపరాధి అయిన తన బిడ్డ ప్రాణం కోసం విజ్ఞాపన చేసాడు. “ఇంటిలో ఎన్నికైనవారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక.. యుండెను”. వ్యక్తుల మీదకు గాని పట్టణాల మీదకు గాని తీర్పులు వచ్చినప్పుడు వినయ మనసుతో కూడిన పశ్చాత్తాపం దాన్ని తప్పించటం తరుచు జరిగేది. క్షమించేందుకు తక్షణమే ముందుకు వచ్చే కరుణామయుడు శాంతి దూతల్ని పంపించేవాడు. ఇద మనసులో ఉంచుకొని బిడ్డ జీవించి ఉన్నంత సేపు ఆ బిడ్డ ప్రాణం కోసం దావీదు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. బిడ్డ మరణించినట్లు విన్న వెంటనే అతడు దేవుని తీర్పును అంగీకరించాడు. తానే న్యాయమైందని ప్రకటించిన శిక్ష మొదటి వేటు పడింది. అయినా దైవ కృపను నమ్ముకొన్న దావీదు అదరణ లేకుండా లేడు. PPTel 735.1

దావీదు పతనాన్ని గూర్చిన చరిత్ర చదివిన పలువురు ఇలా ప్రశ్నిస్తున్నారు. “ఈ రికార్డును బహిర్గతం చేయటం ఎందుకు ? పరలోకం బహుగా ఆదరిస్తున్న వ్యక్తి జీవితంలోని చీకటి కోణాల్ని లోకానికి బహిర్గతం చేయటం సమంజమని దేవుడు ఎందుకు భావించాడు?” ప్రవక్త దావీదు కిచ్చిన మందలింపులో దావీదు పాపాన్ని గురించి ఇలా అన్నాడు. ” ఈ కార్యము వలన యెహోవా దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుజేసితివి”. ఆ తర్వాతి తరాలన్నటి లోను నాస్తికులు దావీదు ప్రవర్తనను ఎత్తి చూపి “దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు ఇతనే ”! అని ఎగతాళి చేసారు. మతం మీదికి ఇలా నిందవచ్చింది. దేవుని దూషించటం ఆయన వాక్యాన్ని దూషించటం జరిగింది. ఆత్మల అవిశ్వాసంతో నిండాయి. అనేకులు భక్తలుగా నటించిన ఘోర పాపాల్లో కూరుకుపోయారు. దేవుడు పాపాన్ని సహించడని దావీదు చరిత్ర ఘోషిస్తుంది. PPTel 735.2

దావీదు దేవుని చిత్తానన్నసరించి నివసించిన ఆకాలంలో అతడు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడనిపించుకున్నాడు. అతడు పాపం చేసినప్పుడు ఈ స్థితి మారి పశ్చాత్తాపం ద్వారా ప్రభువునద్దకు తిరిగి వచ్చేవరకు కొనసాగింది. దైవ వాక్యం స్పష్టంగా ఇలా అంఉటుంది. ‘దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను”. 2 సమూయేలు 11:7 ప్రవక్త ముఖంగా దావీదుతో ప్రభువిలా అన్నాడు, “నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి”? నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. “తాను చేసిన పాపానికి దావీదు పశ్చాత్తాపపడి క్షమాపణ పొందినప్పుడు దేవుడు అతణ్ణి అంగీకరించినా తాను విత్తిన విత్తనం తాలూకు హానికరమైన అవాంఛనీయమైన పంటను కోశాడు. అతడి మీదికి అతడి కుటుంబం మీదికి దేవుడు పంపిన తీర్పులు పాపం పట్ల దేవుని అసహ్యతకు అద్దం పడుతున్నాయి. PPTel 735.3

లోగడ శత్రువుల కుతంత్రాలు కుట్రలనుంచి దావీదును దేవుడు కాపాడాడు. సౌలును నిరోధించటానికి ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాడు. అయితే దావీదు అతిక్రమం దేవునితో అతడి సంబంధాన్ని మార్చివేసింది. ఏ పరిస్థితుల్లోను ప్రభువు పాపాన్ని అనుమతించడు. సౌలు తలపెట్టన కీడు నుంచి కాపాడినట్లు పాప పర్యవసానాల్నుంచి దావీదును కాపాడటానికి దేవుడు తన శక్తిని ఉపయోగించ లేకపోయాడు. PPTel 736.1

దావీదులో కూడా పెద్ద మార్పు వచ్చింది. తన పాపాన్ని గురించి దాని దీర్ఘకాలిక పర్యవసానాల గురించి లవాగహన కలిగినప్పుడు దావీదు హృదయ బద్దలయ్యింది. తన ప్రజల దృష్టిలో దిగజారిపోయాడు. అతడి పులకుబడి తగ్గింది. అతడి అభివృద్ధి దైవాజ్ఞల్ని నమ్మకంగా ఆచరించటం వల్లనే సాధ్యపడిందన్న అభిప్రాయం లోగడ ఉండేది. కాని ఇప్పుడు అతడి పాపం గురించి అందరికి తెలియంలో ప్రజలు మరింత విచ్చలవడిగా పాపం చేసారు. స్వగృహంలోనే అతడి అధికారానికి అంతంతమాత్రపు విలువ ఉంది. అతడిపట్ల తన కుమారుల గౌరవం విధేయత తగ్గిపోయయాయి. పాపాన్ని ఖండించాల్సి వచ్చినప్పుడు తన పాపం స్పృహ అతడి నోరు నొక్కేసింది. తన గృహంలో న్యాయాన్ని చేయటానికి వచ్చే సరికి అతడి హస్తం బలహీనమయ్యేది. తన అనైతికాదర్శం తన కుమారులను ప్రభావితం చేసింది. ఆ దుష్పలితాల్ని మార్చటానికి దేవుడు కలుగజేసుకోలేదు. దేవుడు పరిస్థితుల్ని యధావిధిగా సాగనిస్తాడు. దావీదు ఇలా కఠినమైన మందలింపుకు గురి అయ్యాడు. PPTel 736.2

తన పతనం జరిగిన ఒక సంవత్సరకాలం దావీదు భద్రతా ఏర్పాట్ల నడుమ నివసించాడు. దేవుని అగ్రహానికి బాహ్య నిధర్శనలేవి లేవు. కాని దేవుని తీర్పు అతడికి భయం పుట్టిస్తుంది. తీర్పు శిక్షావిది దినం వడివడిగా వస్తున్నది. పశ్చాత్తాపం దాన్ని ఆపలేదు. ఈ లోకంలో తనకు కలిగే హృదయ వేదనను పరాభవాన్ని అది తొలగించలేదు. తమ పాపాలు ఏమంత పెద్దవి కావంటూ దావీదు జీవితాన్ని వేలేత్తి చూ పేవారు అతిక్రమ మార్గం కష్టమైన మార్గమని బైబిలు చరిత్ర పుటల్నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వారు దావీదుకుమల్లే తమ దుర్మార్గం నుంచి తప్పుకోవాల్సి ఉండగా ఈ బతుకులోనూ పాప పర్యవసానాలు దుర్బరంగా ఉంటాయి. PPTel 736.3

తాను ఎవరిని బహుగా దీవించి ఎవరికి తన ప్రసన్నతను కనపర్చాడో వారు సయితం మేము భద్రంగా ఉన్నామనుకొని మెలుకువ కలిగి ప్రార్ధించటం ఆశ్రద్ధ చేయకుండా ఉండేందుకు దావీదు పతన ఉదంతం ఒక హెచ్చరికగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. దేవుడు ఉద్దేశించిన ఈ పాఠాన్ని వినయమనసుతో నేర్చుకోవటానికి పూనిక వహించిన వారికి ఇది ఆవిధంగానే తోడ్పడుతుంది. శక్తిమంతుడైన శోధకుడి వలన కలిగే ప్రమాదాన్ని వేలమంది ప్రతీ తరంలోను ఇలా గుర్తించటం జరుగుతున్నది. దేవుని ఆదరాన్ని అమితంగా పొందిన దావీదు పతనం స్వశక్తిని నమ్ముకోకూడదన్న స్పృహను వారిలో మేల్కొల్పుతుంది. దేవుడే తమను తమ విశ్వాసం ద్వారా కాపాడగలడనిగుర్తిస్తారు. తమ బలం క్షేమం ఆయనలోనే ఉన్నాయని గుర్తించి సాతాను భూబాగంలో పాదం మోపటా నికి వారు భయపడ్డారు. PPTel 737.1

దావీదు విషయంలో దేవుని తీర్పు అమలుకు ముందే అతడు తన అతిక్రమ పర్యవసానాన్ని అనుభవించటం ప్రారంభించాడు. అతడి అంతర్మాతకు విశ్రాంతి లేదు. ఆ తరుణంలో అతడు భరించిన హృదయ వేదనను ముప్పయి రెండో కీర్తన మన కళ్ళకు కడుతున్నది. దావీదు ఇలా అంటున్నాడు. PPTel 737.2

“తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు
తన పాపముకు ప్రాయశ్చిత్తము నొందినవాడు
యెహోవాచేత నిర్దోష అని యెంచబడినవాడు
ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు
నేను మౌనినైయుండగా దినమంతయు నేను చేసిన
నా ఆర ధ్వని వలన
నా యెముకలు క్షీణించినవి
దివారాత్రులు నీ చెయ్యి నా మీద బహుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను”
PPTel 737.3

కీర్తనలు 32: 1-4

దేవుని వద్ద నుంచి తనకు మందలింపు వర్తమానం వచ్చినప్పుడు దావీదులో చోటుచేసుకున్న పశ్చాత్తాపానికి ఏబయి ఒకటో కీర్తన నిదర్శనం PPTel 738.1

“దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము
నీ వాత్సల్య బహాళ్యము చొప్పున
నా అతిక్రమములను తుడిచివేయుము
నా దోషము పోవునట్లు నన్ను పవిత్ర పరుచుము
నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి
నా పాపమెల్లప్పుడు నా యెదుట నున్నది
నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసియున్నాను.
నీ దృష్టి యెదుట నేను చెడుతనము చేసియున్నాను
కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడువుగా ఆగపడుదువు
తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా ఆగపడుదువు
నేను పాపములో పుట్టినవాడను
పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను
నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు
అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు
నేను పవిత్రుడనగునట్లు
హిస్పోపుతో నా పాపము పరిహరింపుము
హిమము కంటెను నేను తెల్లగానుండునట్లు
నీవు నన్న కడుగుము
ఉత్సాహసంతోషములు నాకు వినిపింపుము
అప్పుడు నీవు విరిచన యెముకలు హర్షించును
నా పాపములకు విముఖడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచవేయును
దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము
నా అంతరంగములో స్థిరమైన మనస్సును
నూతనముగా పుట్టించుము
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయుకుము
నీ పరిశుద్దాత్మను నా యొద్దనుండి తీసివేయకుము
నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము
సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను ధృడపర్చుము
అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను
పాపులును నీ తట్టు తిరుగుదురు
దేవా, నా రక్షణ కర్తయగు దేవా
రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము”
PPTel 738.2

కీర్తనలు 51:1-14

తన ప్రజలు బహిరంగ సమావేశాల్లోను, యాజకులు, న్యాయాధి పతులు, ప్రధానులు, సేనాదిపతులతో కూడిన రాజాస్థానంలోను పాడేందుకు తరతరాల ప్రజలు తన పతన జ్ఞానాన్ని కలిగి ఉండేందుకు ఇశ్రాయేలీయుల రాజైన దావీదు తన పాపం గురించి తన పశ్చాత్తాపం గురించి దేవుని కృప ద్వారా తాను ఆశతో ఎదురు చూస్తున్న పాపక్షమాపణను గురించి ఈ విధముగా ఈ పవిత్ర కీర్తనలో అభివర్ణించాడు. PPTel 739.1

దావీదు పశ్చాత్తాపం యధారమైంది, ప్రగాఢమైంది, తన నేరాన్ని సమర్ధించుకోవటానికి ప్రయత్నించలేదు. అతడి ప్రార్ధన తనకు రానున్ను తీర్పుల్ని తప్పించుకోవటానికి చేసింది కాదు. కాని దేవునికి వ్యతిరేకంగా తాను చేసిన పాపం తీవ్రతను గుర్తించాడు. పాపక్షమాపణ కోసము కాదు. శుద్ధ హృదయంకోసం ప్రార్ధించాడు. దావీదు నిస్పృహ చెందలేదు. పోరాటాన్ని విడిచి పెట్టలేదు. పశ్చాత్తాపం పొందిన పాపులకు దేవుని వాగ్దానాల్లో తన పాప క్షమాపణకు దేవుని చేత తన అంగీకారినికి నిదర్శనాన్ని దావీదు చూశాడు. PPTel 739.2

“నీవు బలిని కోరువాడవుకావు కోరిన యెడల నేను
అర్పించుదును
దహన బలి నీకిష్టమైనది కాదు
విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు
దేవా, విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము
చేయవు”
PPTel 740.1

కీర్తనలు 51:16,17

పడిపోయిన దావీదుని దేవుడు లేవనెత్తాడు. దేవునితో ఇప్పుడతడు సంపూర్ణ సామరస్యం కలిగి ఉన్నాడు. సహ మానవుల పట్ల తన పతనానికి ముందుకన్న మరింత సానుభూతి కనపర్చాడు. తన విడుదల విషయంలో కలిగిన ఆనందాన్ని ఈ కీర్తనలో వ్యక్తం చేసాడు : PPTel 740.2

“నా దోషమును కప్పుకొనక
నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని
యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు
కొందుననుకొంటిని
నీవు నా పాప దోషమును పరిహరించియున్నావు....
నా దాగుచోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను
రక్షించెదవు
విమోచన గానములతో నీవు నన్ను ఆదరించెదవు”.
PPTel 740.3

కీర్తనలు 32:5-78

తమ దృష్టికి కనిపించిన పాపాలు చేసిన సౌలుని విసర్జించి గొప్ప పాపానికి పాల్పడ్డ దావీదుని కాపడటంతో దేవుడు చేసినట్లు తాము భావించిన అన్యాయం గురించి అనేకమంది గొణిగారు. దీన మనసుతో దావీదు తన పాపాన్ని ఒప్పుకోగా సౌలు దేవుడు పంపిన గద్దింపును తృణీకరించి పశ్చాత్తాపం పొందకుండా తన హృదయాన్ని కఠినపర్చుకొన్నాడు. PPTel 740.4

దావీదు చరిత్రలోని ఈ ఘట్టం పశ్చాత్తాప పేడే పాపికి గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది. మానవాళి ఎదుర్కొనే పోరాటాలకు శోథనలకు,దేవుని ముందు యదార్ధ పశ్చాత్తాపానికి మన ప్రభువైన క్రీస్తు పై మన విశ్వాసానికి శక్తిమంతమైన సాదృశ్యాల్లో ఇది ఒకటి. పాపంలో పడి దోషిత్వభారం కింద సతమత మౌతున్న ఆత్మలకు అన్నియుగాల్లోను ప్రోత్సాహనాకి ఇది మూలంగా ఉన్నట్లు రుజువయ్యింది. పాపంలో పడ్డ వేలాది దైవ ప్రజలు నిరాశ నిస్పృహలకు ఆహుతి కావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు దావీదు తన అతిక్రమానికి శిక్ష అనుభవించినప్పటికి అతడి యధార్ధ పశ్చాత్తాపాన్ని ఒప్పుకోలును దేవుడు అంగీకరించటాన్ని విజ్ఞప్తికి తెచ్చుకున్నారు. వారు కూడా పశ్చాత్తాపం పొంది మళ్ళీ దేవుని ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవటానికి ధైర్యం తెచ్చుకున్నారు. PPTel 741.1

గద్దింపు పొందినప్పుడు దావీదుకుమల్లే ఎవరైతే దీన మనస్కులై తమ పాపాల్ని ఒప్పుకొని పశ్చాత్తాప పడ్డారో వారికి నిశ్చయంగా నిరీక్షణ ఉంటుంది. విశ్వాసమూలంగా ఎవరైతే దేవుని వాగ్దానాన్ని అంగీకరిస్తారో వారు క్షమాపణ పొందుతారు. నిజంగా పశ్చాత్తాపం పొందిన ఒక్క ఆత్మను కూడా దేవుడు తోసిపుచ్చుడు. ఆయన ఈ వాగ్దానం చేస్తున్నాడు. “ఈలాగున జరగుకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. నాతో సమాధానపడవలెను. వారు నాతో సమాధానపడవలెను”. యెషయా 27:5 “భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవునివైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును” యెషయా 55:7 PPTel 741.2