పితరులు ప్రవక్తలు

69/75

67—పాచీన, నవీన గారడీ

ఎనొరు స్త్రీని సౌలు సందర్శించటాన్ని గూర్చిన లేఖన ఉదంతం అనేకమంది బైబిలు విద్యార్ధుల్ని గాభరా పరుస్తున్నది. సౌలుతో జరిగిన సమావేశంలో సమూయేలు నిజంగా ఉన్నాడని భావించేవారు. కొందరున్నారు. అయితే దీనికి విరుద్దుమైన వాదనకు చాలినంత సమాచారాన్ని బైబిలే సమర్పిస్తున్నది. కొందరు భావిస్తున్నట్లు సమూయేలు పరలోకంలో ఉంటే అక్కడ నుండి రావలసిందిగా అతడికి ఆజ్ఞ జారీ అయి వుండేది. అది దేవుని శక్తిమూలంగానో సాతాను శక్తిమూలంగానో జరిగి ఉండేది. ఒక అపవిత్ర స్త్రీ మంత్ర వల్లింపును గౌరవిచంటానికి, పరలోకం నుంచి ఒక పరిశుద్ధ ప్రవక్తను రప్పించటానికి సాతానుకి శక్తి ఉన్నదని ఎవరూ నమ్మరు. లేదా ఆ మాంత్రికురాలి గుహకు దేవుడే సమూయేలుని పిలిచాడని చెప్పలేం. ఎందుకంటే కలలద్వారాగాని, ఊరీము ద్వారాగాని, ప్రవక్తల ద్వారాగాని అతడితో మాట్లాడటానికి దేవుడు నిరాకరించాడు. 1 సమూ 28:6 ఇది దేవుడు ఏర్పాటు చేసుకొన్న సాధనాలు. సాతాను ప్రతినిధి ద్వారా వర్తమానాన్ని అందించటానికి గాను ఆయన ఈ సాధనాల్ని పక్కన పెట్టలేదు. PPTel 690.1

ఈ వర్తమానమే ఈ వర్తమాన మూలానికి చాలినంత నిదర్శనం. సౌలుకి పశ్చాత్తాపం పుట్టించటం. దాని ధ్యేయం కాదు. అతణ్ణి నాశన దిశగా నడిపించటమే. ఇది దేవుని పనికాదు. సాతాను పని చెప్పాలంటే, సౌలు మాంత్రికురాలిని సంప్రదించటం సౌలుని దేవుడు విసర్జించటానికి అతణ్ణి తన నాశనానికి విడిచి పెటట్టానికి ఒక హేతువుగా లేఖనం పేర్కొంటున్నది. “ఈ ప్రకారము యెహోవా ఆ గైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యెద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసెను”. 1 దిన వృత్తాం 10:13, 14 సౌలు కర్ణ పిశాచాల వద్ద విచారణ చేసాడుగాని దేవుణ్ణి సంప్రదించలేదని ఇక్కడ స్పష్టంగా ఉంది. దేవుని ప్రవక్త సమూయేలుతో సంప్రదించలేదు. కాని ఒక మాంత్రికురాలి ద్వారా సాతానుతో సంబంధము పెట్టుకున్నాడు. నిజమైన సమూయేలుని సాతాను తీసుకురాలేకపోయాడు. తన మోసానికి సరిపోయే నకిలీ సమూయేలును అతడి ముందుకి తెచ్చాడు. దాదాపు అన్నిరకాల ప్రాచీన గారడీ విద్య మంత్రి విద్య మృతులతో మాట్లాడగలమన్న నమ్మిక పై స్థాపితమైనదే. ప్రేత విద్యను ఆచరించినవారు మరణించిన వారి ఆత్మలతో మాట్లాడి వారి ద్వారా భావి సంఘటల్ని గూర్చి తెలుసుకున్నామని చెప్పారు. మృతులతో సంప్రదించే ఆచారాన్ని గూర్చిన ప్రస్తావన యెషయా ప్రవచనంలో ఉంది : “వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దకు విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చినవారి యొద్దకు వెళ్ళదగునా ”? యెషయా 8:19 PPTel 690.2

మృతులతో సంప్రదించటం పై గల ఈ నమ్మకమే అన్యుల విగ్రహారాధనకు పునాది రాయి. మరణించిన వీరు ఆత్మలకు దేవత్వం ఆపాదించి వారే దేవుళ్ళని అన్యులు నమ్ముతారు ఈరకంగా అన్యుల మతం మృతుల పూజ మాత్రమే. దీన్ని లేఖనాలు నిరూపిస్తున్నాయి. బేత్పయోరు వద్ద ఇశ్రాయేలీయుల పాపాన్ని గూర్చిన ఉదంతంలో ఇలా ఉన్నది. “ఇశ్రాయేలీయులు షిలీములో దిగి యుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను”. సంఖ్యా 25:1-3 ఈ బలుల్ని ఎలాంటి దేవతలకు అర్పించేవారో కీర్తనకారుడు వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల్లో ప్రబలిన అలాంటి భ్రష్టత్వం గురించే ప్రస్తావిస్తూ అతడిలా అంటున్నాడు. “వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చినవారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి”. (కీర్తనలు 106:28) అనగా మృతులకు అర్పించిన బలలు. PPTel 691.1

ప్రతీ అన్యమత వ్యవస్థలోను మృతుల్ని దేవుళ్ళుగా పూజించంటం మృతులతో సంప్రదిస్తున్నామని నమ్మటం ముఖ్య స్థానాన్ని అక్రమిస్తున్నాయి. దేవతలు తమ చిత్తాన్ని మనుషులకు తెలియపర్చుతారని, మనుషులు తమను సంప్రదించినప్పుడు సలహాలు చెబుతారని మనుషుల్లో ఒక నమ్మకం ఉన్నది. గ్రీకు దివ్యవాణి, రోము దివ్యవాణి ఈ కోవకు చెందినవే. PPTel 691.2

క్రైస్తవ దేశాలుగా చెలామణి అవుతున్న దేశాల్లో సయితం మృతులతో సంప్రదింపుల పై ప్రజలు నమ్మకం కనపర్చుతున్నారు. మరణించినవారి ఆత్మలుగా ప్రచారమవుతున్న ఆత్మలతో భూత మతం పేరుతో సంప్రదింపులు జరపటం ప్రబలమౌతున్నది. ప్రియులను కోల్పోయి సమాధి చేసినవారి సానుభూతి సహకారాల్ని సంపాదించటమే దీని ఉద్దేశం. ఆధ్మాత్మిక వ్యక్తులు కొన్నిసార్లు మృతులైన తమ మిత్రుల రూపంలో కొందరు వ్యక్తులికి కనిపించి, తమ జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పి, తాము జీవించి ఉన్న కాలంలో చేసిన కార్యాలు చేస్తారు. మృతులైన తమ మిత్రులు దేవదూతలని, వారు తమ చుట్టు ఉండి తమను కాపాడూ తమతో మాట్లాడూ ఉంటారని ఈ విధంగా నమ్మకం పుట్టిస్తారు. మరణించినవారి ఆత్మలుగా చెప్పుకొంటూ నటించేవారిని ఇలా పూజించటం జరుగుతుంది. పలువురు దేవుని మాటలకన్నా వారి మాటలకే ఎక్కువ విలువనిస్తారు. PPTel 691.3

భూతమతాన్ని కేవలం వంచనగా పరిగణించేవారు చాలామంది ఉన్నారు. మానవతీత స్వభావానికి నిదర్శనంగా భూతమతం చేసే ప్రదర్శనలు, మాధ్యమం చేతివాటం వల్ల చోటు చేసుకొనే మోసాలు మాత్రమే. ఇలాగుండగా మోసాల్నే యధార్ధ ప్రదర్శనలని అంగీకరించటం తరుచు నిజమే అయినా మానవాతీత శక్తికి స్పష్టమైన నిదర్శనలు కూడా లేకపోలేదు. మానవుడి నైపుణ్యం. చాతుర్యం పర్యవసానమే భూతమతం అన్నవాదనను తోసిపుచ్చే అనేకమంది ఈ ఆధారంపై తాము వివరించలేని ప్రదర్శనలకు తిలకించినప్పుడు వాటిని అంగీకరించటానికి సిద్ధమౌతారు. PPTel 692.1

నవీన భూతమతం, పూర్వపు వివిధ రకాల మంత్ర విద్య, విగ్రహారాధన వీటన్నింటి మూల సూత్రం మృతులతో సంప్రదింపులు సాగించటమన్నదే. “మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిన్న దినమున... దేవుతల వలె ఉందురని దేవునికి తెలియును” (అది 3:4,5) అని ఏదెనులో అదామవ్వలతో సాతాను చెప్పిన మొట్టమొదటి అబద్దం పునాది మీద ఇవన్నీ స్థాపితమయ్యా యి. PPTel 692.2

మృతులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నట్లు ఏరకంగాను నటించకూడదన్న ఖచ్చితమైన నిషేధాన్ని హెబ్రీయుల పై దేవుడు విధించాడు. ఈ మాటలతో దేవుడు ఈ తలుపును గట్టిగా మూసివేశాడు. “బ్రతికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు, వారి పేరు మరువబడి యున్నది. వారికి ఏ లాభమును కలుగదు... సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికి ఎన్నటికిని వంతులేదు”. ప్రసంగి 9:5,6. “వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును “. కీర్తనలు 146:4 ఇశ్రాయేలీయులికి దేవుడి హెచ్చరిక చేసాడు. “కర్ణ పిశాచి గలవారితోను, సోదె గాండ్రతోను వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును”. లేవికాండము 20:6. PPTel 692.3

“కర్ణ పిశాచి గలవారు ” మృతుల ఆత్మల కారు. వారు దుష్టదూతలు, సాతాను దూతలు. మనం తెలుసుకున్న విధముగా పురాతన విగ్రహారాధన నిజానికి మృతల పూజే, వారితో నిర్వహించే టక్కరి సంప్రదింపులే, బైబిలు ఈ తతంగం మొత్తాన్ని దయ్యాల పూజగా అభివర్ణిస్తుంది. విగ్రహారాధికులు అన్యులు అయిన తమ పొరుగువారి విగ్రహరాధనలో పాలు పొందవద్దని సహోదరుల్ని హెచ్చరిస్తూ అపొస్తలుడు పౌలిలా అంటున్నాడు. “అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకిష్టము లేదు” 1 కొరింథీ 10:20 ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడూ కీర్తన రచయిత ఇలా అంటున్నాడు. “వారు తమకుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి.” “కనాను దేశపు వారి బొమ్మలకు ” వారిని అర్పించారని తర్వాతి వచనంలో వివరంగా చెబుతున్నాడు. కీర్తనలు 106:37,38 మృతుల పూజగా వారు భావించి చేసే పూజలో వారు నిజానికి దయ్యాల్ని పూజిస్తున్నారు. PPTel 693.1

అదే పునాది మీద అనుకొని ఉన్న నేటి భూతమతం పూర్వం దేవుడు ఖండించి నిషేధించిన శకను విద్య దయ్యల పూజ పునరజ్జీవమే అని చెప్పాలి. దాన్ని గురించి లేఖనం ముందే ఇలా చెప్పింది. “కడపరి దినములలో కొందరు అబద్దికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు.” 1 తిమోతి 4:1 థెస్సలోనీకయులకు రాసిన రెండో ఉత్తరంలో క్రీస్తు రెండో రాకడ గురించి ప్రస్తావిస్తూ సాతాను “అబద్ద విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను” పనిచేసిన తరువాత అది వస్తుందంటున్నాడు 2 థెస్స 2:9 చివరి దినాల్లో సంఘం ఎదుర్కొవాల్సి ఉన్న విపత్కర పరిస్తితుల్ని వర్ణిస్తూ ఇశ్రాయేలీయుల్ని పాపంలోకి నడిపించిన అబద్ద ప్రవక్తలున్నట్లే అబద్ధ బోధకలు బయలుదేరారు అంటున్నాడు. “వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు... నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు... అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడతురు”. 2 పతురు 2:1,2 భూత మతతత్వ బోధకుల ప్రముఖ గుణ లక్షణాల్ని అపొస్తలుడు ఇక్కడ సూచిస్తున్నాడు. వారు క్రీస్తుని దేవుని కుమారుడుగా అంగీకరించరు.అలాంటి బోధకుల్ని గూర్చి యోహాను ఇలా అంటున్నాడు: “యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్దికుడు ” ? తండ్రిని కుమారుని ఒప్పుకొనినవాడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు”. 1 యోహాను 2:22, 23 క్రీస్తును ఒప్పుకోవటం ద్వారా తండ్రిని కుమారుణ్ణి ఇద్దర్నీ బూతమతత్వం అంగీకరించదు. బైబిలు దీన్ని క్రీస్తు విరోధి ప్రత్యక్షతగా ప్రకటిస్తున్నది. PPTel 693.2

ఎన్డరు స్త్రీ నోట సౌలు నాశనాన్ని ప్రవచించటం ద్వారా సాతాను ఇశ్రాయేలు ప్రజలికి ఉచ్చు వేయటానికి సంకల్పించాడు. టక్కుటమార విద్య పై వారికి నమ్మకం కలుగుతుందని తద్వారా వారు ఆ మాంత్రికురాలుని సంప్రదిస్తారని అతడు ఆశించాడు. అలా వారు తమ ఆలోచనకర్త అయిన దేవుణ్ణి విడిచి పెట్టి తన దర్శకత్వంలో నడుస్తారని భావించాడు. భూతమతం పట్ల విశేష జనాలు ఆకర్షితులు కావటానికి కారణం భవిష్యతు యవనికను తొలగించి మానవులకు దేవుడు మరుగు పర్చుతున్న విషయాల్ని చూపించంటానికి దానికి శక్తి ఉన్నదని ప్రజలు తప్పుగా ఊహించటమే. తన వాక్యంలో భవిష్యత్తును గూర్చిన విషయాల్ని దేవుడు మన ముందు తెరచి వుంచాడు. మనం తెలుసుకోవలసినదంతా అందులో నిక్షిప్తం చేసి ఉంచాడు. అందులోని అపాయాల నడుమ మన మార్గం సుగమం చేసేందుకు గాను విశ్వసనీయమైన మార్గదర్శిని మనకు ఇచ్చాడు. అయితే మానువుల తమ జీవితంలో అసంతృప్తి చెందటానికి దేవుడు మరుగుపర్చాలని ఉద్దేశించిన జ్ఞానాన్ని సంపాదించగోరటానికి, తన పరిశుద్ద వాక్యంలో ఆయన బయలుపర్చిన సత్యాన్ని తృణీకరించటానికి మనుషుల్ని నడిపించి దేవుని పై వారికి నమ్మకం లేకుండా చేసి వారిని నాశనం చేయటమే సాతాను ముఖ్యోద్దేశం. PPTel 694.1

విషయ పరిణామాలు నిర్దిష్టంగా తెలుసుకోలేనప్పుడు ఆందోళన చెందేవారు చాలామంది వారు అనిశ్చితిని సహించలేరు. సహనం కోల్పోయి దేవుని రక్షణను చూడటానికి వేచి ఉండలేరు. ఊహించుకొని భయపడే చెడుగు వారి గమనాన్ని భంగపరుస్తుంది. వారు తిరుగుబాటు భావాలకు చోటిచ్చి దు:ఖాక్రాంతులై మర్మ విషయాల్ని గూర్చి తెలుసుకోవటానికి ఇటూ అటూ పరుగెడ్డారు. వారు దేవుని పై నమ్మకంముంచి మెళకువగా ఉండి ప్రార్ధిస్తే వారికి దేవుని వద్ద నుండి ఓదార్పు లభిస్తుంది. దేవునితో ఏర్పడే సంబంధము ద్వారా వారికి అంతరంగిక ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో అలసిపోయి భారాలతో కునారిల్లుతున్న వారు యేసు వద్దకు వెళ్లితే వారి ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది. కాగా వారికి ఓదార్పునిచ్చే నిమిత్తం దేవుడు నియమించిన సాధనాల్ని వారు నిర్లక్ష్యం చేసి దేవుడు మర్మంగా ఉంచిన జ్ఞానాన్ని సంపాదించటానికి ఇతరత్రా అన్వేషణలు జరిపినప్పుడు వారు సౌలు పాల్పడ్డ పాపానికి పాల్పడినవారవుతారు. పాపాన్ని గూర్చిన జ్ఞానాన్ని మాత్రమే వారు సంపాదిస్తారు. PPTel 694.2

ఇది దేవుని సంతోషపర్చే కార్యంకాదు. ఆ విషయాన్ని దేవుడు విస్పష్టం చేసాడు. భవిష్యత్తును మరుగుపర్చే తెరను లేపటానికి జరిగే ఈ తొందరపాటు పని దేవుని పై విశ్వాసరాహిత్యతను బయులపర్చి ఆత్మను సాతాను మోసాలకు విడిచి పెడుంది. సోదెగాళ్ళు మంత్రాగాళ్లును సంప్రదించటానికి సాతాను వారిని నడిపిస్తాడు. గతంలోని రహస్యాల్ని బయలుపర్చం ద్వారా జరగనున్నవాటిని తెలిపే శక్తి తనకున్నదన్న నమ్మకాన్ని పుట్టిస్తాడు. అనేక యుగాల అనుభవాన్ని పురస్కరించుకొని కార్యకారణ సూత్రం ఆధారంగా మానవ జీవితంలోని భావి సంఘటనల్ని చాలావరకు దోషరహితంగా చెప్పగలుగుతాడు. తప్పుదారి పట్టిన అభాగ్యుల్ని ఈ విధంగా వంచించి తన నియంత్రణ కిందకి తెచ్చుకొని తన బందీలుగా ఉంచుకుంటాడు. PPTel 695.1

తన ప్రవక్త ముఖంగా దేవుడు మనకీ హెచ్చరిక చేస్తున్నాడు. : “వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడు గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనలు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చినవారి యొద్దకు వెళ్లదగునా;? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు భోదించని యెడల వారికి అరుణోదయము కలుగదు”. యెషయా 8:19,20 PPTel 695.2

పరిశుద్దుడు అపరిమిత వివేకం అనంతశక్తి గల దేవుడున్న ప్రజలు సాతానుతో సాన్నిహిత్యం మూలంగా జ్ఞానం పొందే మాంత్రికులు తాంత్రికుల వద్దకు వెళ్లటం దేనికి ? దేవుడే తన ప్రజలకు వెలుగు. మానవ దృష్టికి అదృశ్యమై ఉన్న మహిమలను విశ్వాస నేత్రంతో వీక్షించాల్సిందిగా ఆయన వారిని కోర్తున్నాడు. నీతి సూర్యుడు తన ప్రచండ కాంతి కిరణాల్ని వారి హృదయాల్లోకి ప్రసరింపజేస్తున్నాడు. దైవ సిహాసనం నుంచి వారికి వెలుగు వస్తుంది. ఆ కాంతి నిలయాన్ని విడిచి పెట్టి సాతాను దూతల వద్దకు వెళ్ళాలన్న కోరిక వారికి లేదు. PPTel 695.3

సౌలుకి దయ్యం అందించిన వర్తమానం పాపాన్ని గ్రహిస్తున్నది. శిక్షను ప్రవచిస్తున్నది. అయినా అది అతణ్ణి సంస్కరించేందుకు గాక అతణ్ణి నిస్పృహకు నాశనానికి నడిపేందుకు ఉద్దేశించింది. పొగడ్త ద్వారా మనుషుల్ని ఆకట్టుకొని వారిని నాశనానికి నడపటం శోధకుడు తరుచు సమర్ధంగా ఉపయోగించే పద్ధతి. పూర్వకాలం భూత దేవుళ్లు బోధన నికృష్టమైన అనైతికతను పెంచి పోషించింది. పాపన్ని ఖండించి నీతిని అములు పర్చిన దైవ నిబంధనల్ని తోసిపుచ్చటం జరిగింది. సత్యాన్ని చులకనగా చూసారు. అపవిత్రతను అనుమతించటమే గాక దాన్ని చేసి ఆనందించారు. భూతమతం, పాపం లేదు మరణం లేదు, తీర్పులేదు. శిక్ష లేదు అని బోధిస్తుంది. “మనుషులు పతనమొందని అర్థదేవుళ్ళు”. కోరికే అత్యున్నత నిబంధన, మానవుడు తనకు తానే జవాబుదారి అని బోధిస్తున్నది. సత్యాన్ని, అపవిత్రను, దైవ భీతిని పరిరక్షించటానికి దేవుడు నియమించిన నీతి విధుల్ని తోసిపుచ్చుటంలో అనేకులు నిర్భయంగా పాపం చేస్తున్నారు. అట్టి బోధన మూలం భూత పూజ మూలం ఒకేలాంటి వన్న ఆలోచన రావటంలేదా? దురాత్మలతో సంప్రదించటం వల్ల కలిగే పర్యవసానాల్ని కనానీయులు హేయ క్రియల రూపంలో దేవుడు ఇశ్రాయేలీయుల ముందు పెట్టాడు. వారు స్వాభావిక ప్రేమ లేనివారు. విగ్రహారాధకులు, వ్యభిచారులు, నరహంతుకులు, దుర్మార్గపు తలంపులు జుగుప్సాకరమైన ఆచారాలు కలవారు. తమ హృదయ పరిస్తితి ఎలాంటిదో మనుషులు ఎరుగరు. ఎందుకంటే “హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది”. యర్మీయా 17:9 అయితే మానవుడి భ్రష్ట హృదయ ధోరణి ప్రభువుకు విధితమే. ఇప్పటిలాగే అప్పుడు కూడా కనానీయులవల్లే ఇశ్రాయేలీయులు కూడా దేవుని దృష్టిలో హేయ ప్రజలై ఉండేందుకు ఆయన పై తిరుగుబాటుకి అనువైన పరిస్థితుల్ని సృష్టించేందుకు సాతాను కనిపెట్టుకొని ఉన్నాడు. దుర్మార్గత అడ్డు ఆపు లేకుండా మన పై విరుచుకు పడేందుకు ఆత్మల బద్ద విరోధి అయిన సాతాను అన్ని మార్గాల్ని తెరవటానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. నశించి శిక్షార్హులైన జనులుగా మనం నిలబడాలన్నది అతడి ధ్యేయం. PPTel 695.4

కనాను దేశం పై తన పట్టును కొనసాగించాలన్నది సాతాను ధృడ నిశ్చయం. కాని అది ఇశ్రాయేలీయులికి నివాసస్థలంగాను దైవ ధర్మశాస్త్రం అ దేశ చట్టంగాను ఏర్పాటయినప్పుడు సాతాను ఇశ్రాయేలీయుల్ని ద్వేషించి వారి నాశనానికి కుట్రపన్నాడు. దురాత్మ మధ్యవర్తిత్వం ద్వారా అన్య దేవతల ప్రవేశం జరిగింది. అతిక్రమం కారణంగా దేవుడు ఎన్నుకున్న జనులు తుదకు వాగ్దాత్త దేశంలో నుంచి చెదిరిపోయారు. మనకాలంలో ఈ చరిత్రను పునరావృతం చేయటానికి సాతాను కృషి చేస్తున్నాడు. తన ప్రజలు తన ధర్మశాస్త్రాన్ని ఆచరించేందుకు వారిని ఈలోకంలోని హేయ కార్యాల నుండి దేవుడు బయటకి నడిపిస్తున్నాడు. ఈ కారణాన్ని బట్టి ” సహోదరుల మీద నేరము మోపవాడైన” సాతాను అగ్రహాం అతిశయిస్తుంది. ‘అపవాది తనకుసమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి యున్నాడు.” ప్రకటన 12:10,12. ఛాయా రూపకంగాని అసలు వాగ్దత్త కనాను మన ముందే ఉన్నది. దైవ ప్రజల్ని నాశనం చేసి తమ స్వాస్థ్యాన్నుంచి వారిని దూరం చేయటానికి సాతాను ధృడ సంకల్పంతో ఉన్నాడు. “మెలకువగా నుండి ప్రార్ధన చేయుడి”. (మార్కు 14:38) అన్న హితవు ఇప్పుడెంతో అవసరం. PPTel 696.1

ప్రాచీన ఇశ్రాయేలీయులికి ప్రభువు అందజేసిన హెచ్చరికను ఈ యుగంలోని తన ప్రజలకు కూడా అందిస్తున్నాడు. “కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు”.“వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు”. లేవీకాండము 19:31; ద్వితీ 18:12 PPTel 697.1