పితరులు ప్రవక్తలు

51/75

49—యెహోషువ చివరి మాటలు

యుద్దాలు విజయాలు సమాప్తమయ్యాయి. పని విరమించి విశ్రాంతి తీసుకోవటానికి యెహోషువ తిమ్మత్సెరహులోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. “చుట్టునున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములనైన తరువాత యెహోషువ .. ఇశ్రాయేలీయులందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించాడు. PPTel 518.1

ప్రజలు తమకు స్వాస్థ్యంగా వచ్చిన భూముల్లో స్థిరపడి కొన్ని సంవత్సరాలు గతించాయి. ఇశ్రాయేలీయుల మీదికి దేవుని తీర్పులు రావటానికి హేతువైన అవే దుష్కార్యాలు దుర్మార్గాలు తలెత్తటం ప్రారంభించాయి. పైబడ్తున్న సంవత్సరాల వల్ల శక్తి క్షీణించిన యెహోషువ తన ప్రజల భవిష్యత్తును గురించి ఆందోళన చెందాడు. ఆ వృద్ధ నేత పిలవగా మరోసారి ప్రజలు సమావేశమైనప్పుడు, పితృవాత్సల్యంతో వారితో ఈ మాటలన్నాడు, “మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు యెహోవాయే”. ఇశ్రాయేలీయులు కనానీయుల్ని ఓడించి లొంగదీసుకొన్నప్పటికీ వారికి దేవుడు వాగ్దానం చేసిన దేశంలో చాలా భాగం ఇంకా కనానీయుల చేతుల్లోనే ఉండటంలో విగ్రహారాధకులైన ఆ ప్రజల్ని పూర్తిగా నాశనం చేయాల్సిందిగా దేవుడిచ్చిన ఆదేశాన్ని మర్చిపోయి సుఖజీవనంలో తల మనకులు కావద్దని యెహోషువ హెచ్చరించాడు. PPTel 518.2

అన్యుల్ని తరిమి వేసే కర్తవ్యాన్ని పూర్తి చేయటంలో ప్రజలు మందకొడిగా ఉన్నారు. గోత్రాలు తమ తమ స్థలాలకు చెదిరిపోయారు. సైన్యం విచ్చిత్తి చెంది సైనికులు తమతమ ఇళ్ళకు వెళ్లిపోయారు. యుద్ధం చేయటమన్నది ఒక జరగనట్లు కనిపించింది. అయితే యెహోషువ ఇలా ఉద్బోధించాడు, “మీ దేవుడైన యెహోవాయే వారిని మీ యెదుట నిలువకుండ వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసికొని, యెడమకుని గాని కుడికి గాని దాని నుండి తొలగి”పోకండి. PPTel 518.3

తన ప్రజలపట్ల దేవుని ప్రేమ అపధులు లేనిది గనుక ఆయన వారిలోని పాపాన్ని ఉపేక్షిస్తాడన్న సిద్ధాంతంతో సాతాను అనేకమందిని మోసం చేస్తున్నాడు. దైవ వాక్యంలోని బెదిరింపులు దేవుని నీతి పరిపాలనలో ఒక ఉద్దేశం నెవేర్యేందుకు ఏర్పాటయినే తప్ప అవి అమలు కావటానికి ఉద్దేశించినవి కావని అతడు ప్రచారం చేస్తున్నాడు. అయితే, మానవులతో తన సంబంధాలన్నిటిలోను పాపం నిజస్వరూపం ముసుగు తీయటం ద్వారా పాపం పర్యవసానం దు:ఖ మరణాలని ప్రయోగాత్మకంగా చూపించటం ద్వారా దేవుడు నీతి సూత్రాలకు పెద్ద పీట వేస్తున్నాడు. బేషరతు పాపక్షమాపణ నభూతో నభవిష్యతి. అట్టి క్షమాపణ దైవ పరిపాలనకు పునాది అయిన నీతి సూత్రాల పరిత్యాగాన్ని సూచిస్తుంది. నీతివంతమైన విశ్వానికి అది దిగ్ర్భాంతి కలిగిస్తుంది. పాప ఫలితాల్ని గురించి దేవుడు నిత్యం జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాడు. ఈ హెచ్చరికలు వాస్తవం కాకపోతే ఆయన చేసి వాగ్దానాలు నెరవేరాయన్న భరోసా ఏంటి? న్యాయాన్ని పక్కన పెట్టే ఆ ఔదార్యం ఔదార్యంకాదు, బలహీనత. PPTel 519.1

ప్రాణం అనుగ్రహించేవాడు దేవుడే. ఆదినుంచి ఆయన చట్టాలన్నీ ప్రాణం కొనసాగించటానికి ఏర్పాటయ్యాయి. అయితే పాపం దేవుడు స్థాపించిన క్రమానికి ప్రతిబంధకం కలిగించింది. అసమ్మతి మొదలయ్యింది. పాపమున్నంత కాలం బాధ మరణం తప్పవు. రక్షకుడు మన తరపున పాపశాపాన్ని భరించాడు గనుక మానవుడు వ్యక్తిగతంగా దాని భయంకర వర్యవసానాల్ని తప్పించుకోటానికి అవకాశం కలుగుతుంది. PPTel 519.2

యెహోషువ మరణానికి ముందు అతని పిలపు మేరకు గోత్రాల ప్రధానులు ప్రతినిధులు మళ్ళీ షెకెములో సమావేశమయ్యారు. అన్ని పరిశు జ్ఞాపకాలకి నెలవైన స్థలం ఆ దేశమంతటిలోనూ ఇంకొకటి లేదు. వెనుక అబ్రాహారముతోను యాకోబు తోను దేవుడు చేసిన నిబంధన మొదలు కొని కనానులో అడుగు పెట్టిన వేళ తాము చేసిన గంభీర ప్రమాణాలు వారి స్మృతి పథకంలో మెదిలాయి. ఆ ప్రమాణాలకు మూగ సాక్షులుగా ఏబాలు గెరిజీము కొండలు నిలిచి ఉన్నాయి. వాటిని నవీకరించుకొనేందుకు మరణిస్తున్న తమ నాయకుడి సమక్షంలో ఇప్పుడు సమావేశమయ్యారు. దేవుడు వారికి చేసిన ఉపకారాలు ఘన కార్యాలకు నిదర్శనాలు అన్ని పక్కలా కోకొల్లలుగా ఉన్నాయి. వారు శ్రమపడకుండా వారికి ఒక దేశం వారు నిర్మించని పట్టణాలు, నాటని ద్రాక్షతోటలు ఒలీవ వనాలు ఎలాగిచ్చాడో అన్నదానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. యెహోషువ ఇశ్రాయేలీయుల చరిత్రను మరోసారి సమీక్షించాడు. ఆయన ప్రేమను కృపను అందరు గ్రహించి “చిత్తశుద్ధితోను యధరాతతోను” ఆయనను సేవించే నిమిత్తం దేవుడు చేసిన అద్భుత కార్యాల్ని వారికి మళ్ళీ వివరించాడు. PPTel 519.3

యెహోషువ ఆదేశం ప్రకారం షిలోహు నుంచి మందసాన్ని తెచ్చారు. అది అతి గంభీర సమయం. దైవ సన్నిధికి సూచన అయిన మందసం దేవుడు తన ప్రజల్లో కలిగించగోరుతున్న ఉద్దేశాన్ని పటిష్ఠం చేస్తుంది. తమ పట్ల దేవుని కృప కనికరాల్ని గూర్చి వివరించిన దరిమిల తాము ఎవరిని సేవించాలో ఎన్నుకోవాల్సిందిగా యెహోవా పేరిట యెహోషువా వారిని ఆహ్వానించాడు. కొంత మేరకు విగ్రహారాధన రహస్యంగా కొనసాగుతూనే ఉంది. ఈ పాపాన్ని ఇశ్రాయేలీ యుల సమాజంలో నుంచి తుడిచి వేయాలన్న ఉద్దేశ్యంతో వారిని ఒక తీర్మానానికి నడిపించాలని ఇప్పుడు యెహోషువ కృషి చేశాడు. “యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో.. కోరుకొనుడి” అన్నాడు. దేవుని సేవించటానికి వారిని నడిపించాలన్నది యెహోషువ కోరిక. ఒత్తిడి చేయటం ద్వారా కాదు. ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకోటానికి వారిని నడపించటం ద్వారా దేవుని పట్ల ప్రేమే మతానికి పునాది. ఏదో లబ్దిని ఆశించో లేదా శిక్షకు భయపడో దేవుని సేవించటం నిరుపయోగం. కపట వర్తన, నామమాత్రపు ఆరాధన కన్నా బహిరంగ భ్రష్టతే దేవునికి తక్కువ జుగుప్సాకరం. PPTel 520.1

తమముందు తాను పెట్టిన అంశాన్ని అన్ని కోణాల్లో నుంచి పరిగణించిన మీదట తమ చుట్టూ నివసిస్తున్న విగ్రహారధకుల స్థాయికి దిగజారి నివసించాలన్నది తమ వాంఛ ఏమో తామే నిశ్చయించుకోవలసిందంటూ ఆ వృద్ధ నాయకుడు ఇశ్రాయేలు ప్రజల్ని కోరాడు. శక్తికి మూలం ఆశీర్వాదాల ఊట అయిన యెహోవాను సేవించటం తమకు కీడుగా కనిపించినట్లయితే తాము ఎవరిని సేవించదలచు కొన్నారో.. అనగా ఎవరి మధ్య నుంచి తమ పితరుడు అబ్రాహాముని దేవుడు బయటికి పిలిచాడో ఆ “మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో” లేదా “అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో” ఆ రోజే తేల్చుకోవాల్సిందిగా వారిని యెహోషువ కోరాడు. ఇశ్రాయేలీయులికి ఈ చివరి మాటలు తీవ్ర మందలింపు.అమోరీయుల దేవతలు తమ భక్తుల్ని కాపాడలేక పోయారు. తమ హేయమైన నీచమైన పాపల వలన ఆ దుర్మార్గ ప్రజలు నశన మయ్యారు. ఒకప్పుడు వారిదైన ఆ మంచి దేశం దైవ ప్రజలకు లభించింది. ఎవరిని సేవించినందుకు అమోరీయులు నాశనమయ్యారో ఆ దేవతల్ని సేవించటం ఎంత. పెద్ద పొరపాటు! “నేనును నాయింటి వారును యెహోవాను సేవించెదము” అన్నాడు యెహోషువ కరాఖండిగా. ఆ నాయకుడి హృదయాన్ని నింపిన పరిశుద్ధ స్ఫూర్తె ప్రజలకు పాకి వారిని ఉత్తేజపర్చింది. ప్రజలు వెంటనే ఇలా స్పందించారు, “యెహోవాను విసర్జించి యితర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తుల మగుదముగాక”. PPTel 520.2

అందుకు యెహోషువ ఇలా అన్నాడు, “యెహోవా పరిశుద్ధ దేవుడు... ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు మీరాయనను సేవింపలేరు”, స్థిరమైన దిద్దుబాటు చోటుచేసుకోకముందు తమంతట తాము దేవునికి విధేయులు కావటం సాధ్యం కాదన్న గుర్తింపు ప్రజలకు కలిగించింది. వారు దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. అందుచేత శిక్షార్హులయ్యారు. తప్పించుకొనే మార్గం లేదు. తమ శక్తి మీద తమ నీతిమీద ఆధారపడినంతకాలం వారి పాపాలకి క్షమాపణ అసాధ్యం . పరిపూర్ణమైన దైవ ధర్మశాస్త్ర విధుల్ని వారు నెరవేర్చలేకపోయారు. దేవుని సేవిస్తామని వారు ప్రమాణం చేయటం నిరర్థకం. క్రీస్తు పై విశ్వాసమూలంగా మాత్రమే వారు పాప క్షమాపణ పొంది దైవాజ్ఞలు కాపాడటానికి శక్తిని పొందగలుగు తారు. రక్షణ పొందటానికి స్వీయ ప్రయత్నాలు మానుకోవాలి. దేవుడు తమను స్వీకరించాలంటే వారు వాగ్దత్త రక్షకుని నీతి పై సంపూర్ణ విశ్వాసముంచాలి. PPTel 521.1

శ్రోతలు ఆచితూచి మాట్లాడేందుకు నెరవేర్చలేని ప్రమాణాలు చేయకుండా ఉండేందుకు వారిని నడిపించటానికి యెహోషువ కృషి చేశాడు. “అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదము” అంటూ ప్రజలు చిత్త శుద్దితో పునరుద్ఘాటించారు. యెహోవాను సేవించటానికే ఎంపిక చేసుకొన్నాము గనుక తమ గంభీర సాక్ష్యానికి మద్దతుగా” మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుము” అంటూ తమ దృఢసంకల్పాన్ని వాగ్దానం చేశారు. PPTel 521.2

“అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని” నియమించాడు. ఈ పవిత్ర అంశాన్ని గూర్చిన సంగతుల్ని రచించిన మందంసంలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథం పక్క దాన్ని ఉంచాడు. జ్ఞాపకార్థ చిహ్నంగా అక్కడ ఒక స్తంభాన్ని నిలబెట్టి ఇలా అన్నాడు, “ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ నాటికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీమీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనం పెను”. PPTel 521.3

ఇశ్రాయేలీయుల విషయంలో యెహోషువ సేవ ముగిసింది. అతడు “యెహోవాను నిండు మనస్సుతో అనుసరిం”చాడు. దేవుని గ్రంథంలో అతడు యెహోవా సేవకుడు”గా నమోదయ్యాడు. ప్రజానేతగా అతడి ప్రవర్తనను గూర్చిన విశిష్ట సాక్ష్యం . అతడి సేవల లబ్ది పొందిన తరం ప్రజల చరిత్రేనని చెప్పాలి. “యెహోషువ దినములన్నిటను యెహోషువ తరము తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినముల్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి” PPTel 522.1