పితరులు ప్రవక్తలు

1/75

పితరులు ప్రవక్తలు

తొలిపలుకు

అతి ప్రాముఖ్యమైన అంశం. విశ్వవ్యాప్త ఆసక్తి రగిలించే అంశం. తెలుసుకోవాలని ఎందరో ఎంతగానో ఆశించే అంశం పైన, అంతగా తెలియని సత్యాలు లేదా ఎక్కువగా నిర్లక్ష్యం అవుతున్న సత్యాల పైన వెలుగు విరజిమ్ముతుందున్న ధృడ విశ్వాసంతో ఈ పుస్తకాన్ని ప్రకాశకులు ప్రచురించటం జరుగుతున్నది. సత్యానికి అసత్యానికి, వెలుగుకి, చీకటికి, దైవశక్తికి, సాతాను ఆక్రమంగా సంపాదించిన శక్తికి మధ్య సాగుతున్న మహాసంఘర్షణ సర్వ ప్రపంచాల దృష్టిని ఆకర్షించాలని భావించటం సమంజసం. పాప ఫలితంగా అలాంటి సంఘర్షణ జరుగుతున్నదన్నది, అది వివిధ దశల్లో ఉదృతమైన తుదకు దేవునికి మహిమ తెచ్చే విధముగాను, ఆయనకు నమ్మకంగా నిలిచే ప్రజలకు ఉన్నత స్థితి కూర్చే విధంగాను. సమాప్తమవుతుందన్నది నిజం. బైబిలు మానవులకు దేవుని గూర్చిన అవిష్కరణ అన్నది ఎంత నిజమో ఆ సంఘర్షణ అంతే నిజం. వాక్యం ఈ మహా సంఘర్షణ లక్షణాన్ని బయలు పర్చుతున్నది. ఇది విమోచన పొందాల్సిన లోకానికి సంబంధించిన సంఘర్షణ. ఈ సమస్యల పై ఆసాధారణమైన ఆసక్తి చూపాల్సిన ప్రత్యేక యుగాలు కొన్ని ఉన్నాయి. ఈ సమస్యతో మనకున్న సంబంధాన్ని అవగతం చేసుకోవటం మన ప్రథమ ప్రాధాన్యం. PPTel 3.1

ఇప్పుడు మనం నివసిస్తున్న యుగం అలాంటి ప్రత్యేక యుగం. ఎందుచేతనంటే సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ సంఘర్షణ సమాప్తం కావస్తున్నదని నిరీక్షించటానికి నిదర్శనాలెన్నో కనిపిస్తున్నాయి. అయినా, ఈ సమస్యలో మన లోకం కూరుకు పోవటానికి దారి తీసిన అంశాల్ని ప్రస్తావించే దైవ వాక్యాన్ని అనేకమంది కట్టుకథగా కొట్టిపారేస్తున్నారు. ఇతరులు, ఈ విపరీత భావాన్ని వ్యక్తం చేయకపోయినా బైబిలు కాలం చెల్లినగ్రంథమని అందుచేత అది ఏమంత ప్రాముఖ్యమైంది కాదని దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. PPTel 3.2

పోతే ఆ సాధారణమైన పిరాయింపు వెనుక ఉన్న రహస్య కారణాల్ని పరిశీలించాలన్న కోరిక లేనివారు ఎవరంటారు ? దాని స్వభావాన్ని తెలుసుకొని దాని పర్యవసానాలు గుర్తించి వాటి నుంచి తప్పించుకోవటం ఎలాగో PPTel 3.3

తెలుసుకోవాలనుకోనివారు ఎవరుంటారు ? ఈ పుస్తకం అలాంటి అంశాల్ని పరిశీలిస్తుంది. తరుచుగా ఆలక్ష్యానికి గురైన దైవ వాక్య భాగాలపై ఆసక్తిని ప్రోత్సహించటం ఈ పుస్తకం లక్ష్యం. పరిశుద్ధ లేఖనాల్లోని వాగ్దానాలకు ప్రవచనాలకు ఈ పుస్తకం కొత్త ఆర్ధాన్నిస్తుంది. తిరుగుబాటును ఎదుర్కోటంలో దేవుని మార్గాల న్యాయబద్దతను నిరూపిస్తుంది. పాప మానవుడి రక్షణ నిమిత్తం కృప గల దేవుడు సంకల్పించిన రక్షణ మార్గాన్ని బహిర్గతం చేస్తుంది. ఇలా ఈ సేవ తాలూకు చరిత్రలో తన ప్రణాళికల్ని ఉద్దేశాల్ని దేవుడు ఎంపిక చేసుకొన్న ప్రజలకు విశదపర్చే సమయానికి మనల్ని ఈ పుస్తకం తీసుకువస్తున్నది. PPTel 4.1

సమున్నతమైన అంశాలపై హృదయాల్ని కదిలించే ప్రగాఢమైన భావోద్వేగాల్ని పుట్టించిన, శైలి, భాష విషయాల్లో ఈ పుస్తకం సరళంగా, సూటిగా ఉంటుంది. మానవ విమోచన నిమిత్తం దేవుని ప్రణాళికను అధ్యయనం చేయగోరేవారు. క్రీస్తు చేస్తున్న ప్రాయాశ్చితార్ధ పరిచర్యకు తమ జీవితాలకు మధ్య గల సంబంధాల్ని అవగాహన చేసుకోగోరేవారు ఈ పుస్తకం చదవాల్సిందిగా మా సిఫార్సు, ఈ విషయాల పట్ల తమలో ఆసక్తి పుట్టిచంటానికి ఈ పుస్తకం పఠించవలసినదని తక్కినవారందరికి మా వినతి. PPTel 4.2

ఈ పుస్తకం చదివే వారికి మేలు కలగాలని, జీవ మార్గంలో నడిచేందుకు ఈ పుస్తకం అనేకులకు సహాయపడాలని మా హృదయపూర్వక ప్రార్థన. PPTel 4.3

- ప్రకాశకులు