ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
“మంచి భోజనం” ఖరీదు
దుర్వినియోగాన్ని ప్రతిఘటించకుండా భరించగలిగినంత కాలం ప్రకృతి భరిస్తుంది. అప్పుడు మేల్కొని తనపై ఉన్న భారాన్ని, తనకు జరిగిన అపకారాన్ని తొలగించుకోటానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. అప్పుడు తలనొప్పి, చలి, జ్వరం, భయం, పక్షవాతం, మొదలైన అనేక కీడులు సంభవిస్తాయి. అనుచిత ఆహారపానాల సరళి ఆరోగ్యాన్ని దానితోపాటు జీవితంలోని ఆనందాన్ని నాశనం చేస్తుంది. మంచి ఆహారంగా మీరు వ్యవహరించే భోజనాన్ని ఎన్నిసార్లు కొనుక్కొని తిని మీ శరీరానికి జ్వరం, ఆకలిలేమి, నిద్రలేమి తెచ్చుకున్నారు! ఆహారం ఇష్టం లేకపోవటం, రాత్రంతా నిద్రలేకపోటం, గంటల కొద్దీ బాధకు గురి అవ్వటం- ఇవన్నీ రుచిని తృప్తిపర్చే ఒక్క భోజనం కోసం! CDTel 123.1
వేలమంది వక్రతిండిని ప్రేమిస్తున్నారు. మంచి ఆహారం అని తామంటున్న భోజనం తింటున్నారు. ఫలితంగా వారికి జ్వరం లేదా మరో తీవ్ర వ్యాధి, మరణం వస్తాయి. గొప్ప మూల్యం చెల్లించి వారు కొనుక్కునే ఆనందం అది. అయినా అనేకమంది చేస్తున్నది అదే. ఈ ఆత్మహత్యల్ని స్నేహితులు, బోధకులు కొనియాడి మరణించినప్పుడు వారు నేరుగా పరలోకానికి వెళ్తారని చెబుతారు. ఇది ఎంత గొప్ప తలంపు! తిండిబోతులు పరలోకానికి వెళ్ళటమా! అసంభవం. అలాంటివారు దేవుని బంగారు పట్టణంలో ప్రవేశించలేరు. ఎవరి జీవితం నిత్యం ఆత్మోపేక్ష, ఆత్మ త్యాగంతో నిండి ఉన్నదో ఆ ప్రశస్త రక్షకుడు, కల్వరిలో శ్రమలనుభవించిన త్యాగమూర్తి అయిన యేసు కుడిచేతి పక్క నిలవటానికి అట్టివారు అర్హులు కారు. అలాంటి వారికి ఓ స్థలం నియమితమయి వుంది. అది నిత్యస్వాస్థ్యమైన నిత్యజీవంలో పాలుపంచుకోటానికి అనర్హులుగా పరిగణించబడే వారి మధ్య. CDTel 123.2