ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
తప్పుడు ఆహారం ద్వారా కాలేయం వ్యాధి గ్రస్తమౌతుంది
(1869) 2T 67-70 CDTel 121.1
204. పోయిన సబ్బాతునాడు ప్రసంగం చేస్తున్నప్పుడు పాలిపోయిన మీ ముఖాలు నాకు స్పష్టంగా కనిపించాయి. మీ ముఖాల్ని దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. మీ ఆరోగ్య పరిస్థితిని చూశాను. మీరు చాలా కాలంగా ఏ వ్యాధులతో బాధపడున్నారో వాటిని చూశాను. మీరు ఆరోగ్యవంతంగా నివసించటం లేదని దర్శనంలో చూశాను. మీ తిండి ఆరోగ్యదాయకంగా లేదు. మీ కడుపుకి హాని కలిగే విధంగా మీరు తిండి తింటున్నారు. రుచిని తృప్తిపర్చుకుంటున్నారు. మీరు తీసుకుంటున్న వివిధ ఆహారపదార్థాలు మంచి రక్తాన్ని ఉత్పత్తి చెయ్యటం అసాధ్యం. ఇది మీ కాలేయం పై పెద్ద భారాన్ని మోపుతుంది. ఎందుకంటే జీర్ణమండల అవయవాలు అస్తవ్యస్తమౌతున్నాయి. మీ ఇద్దరి కాలేయాలూ వ్యాధి గ్రస్తమయ్యాయి. ఆరోగ్య సంస్కరణను ఖచ్చితంగా ఆచరిస్తే అది మీ ఇరువురికీ మేలు చేస్తుంది. ఇది చెయ్యటంలో మీరు విఫలమౌతున్నారు. మీ ఆహారం అనారోగ్యకరంగా ఉంది. మసాలాలు, నూనె వాడకుండా సంపూర్ణ గోధుమపిండి, కూరగాయలు, పండ్లతో తయారుచేసిన సామాన్యాహారాన్ని ఇష్టపడకపోటం ద్వారా మీరు మీ శరీరంలో దేవుడు స్థాపించిన వ్యవస్థకు సంబంధించిన చట్టాల్ని నిత్యం అతిక్రమిస్తున్నారు. ఇది చేస్తుండగా దానికి శిక్షను మీరు అనుభవించాల్సిందే. అయినా మీ ఆరోగ్యం బాగాలేదెందుకా అని మనసులో బాధపడుతుంటారు. మీ CDTel 121.2
స్వయంకృత దోషాల పర్యవసానాలనుంచి మిమ్మల్ని కాపాడటానికి దేవుడు అద్భుతాలు చెయ్యడని గుర్తుంచుకోండి....... CDTel 122.1