ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
ఉల్లంఘనకు గురి అయిన ప్రాకృతిక ఆధ్యాత్మిక చట్టాలు
(1898) D.A.824 CDTel 117.4
197. స్వస్తత పొందిన అనేకమంది వ్యాధి గ్రస్తులతో క్రీస్తు అన్నాడు, “మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము.” వ్యాధి దేవుని ప్రకృతి చట్టాలు, ఆధ్యాత్మిక చట్టాల అతిక్రమ పర్యవసానం అని ఆయన ఇలా బోధించాడు. మనుషులు సృష్టికర్త ప్రణాళిక ప్రకారం నివసిస్తే నేడు లోకంలో ఉన్న అపార దుఃఖం ఉండేది కాదు. CDTel 117.5
ప్రాచీన ఇశ్రాయేలుకి క్రీస్తు మార్గదర్శకుడు, ఉపాధ్యాయుడు. ఆరోగ్యం దేవుని చట్టాలకు విధేయంగా నివసించినందుకు ప్రతిఫలం అని ఆయన బోధించాడు. పాలస్తీనాలో వ్యాధి గ్రస్తుల్ని స్వస్తపర్చిన మహావైద్యుడు మేఘస్తంభం నుంచి తన ప్రజలతో మాట్లాడి వారు ఏమి చెయ్యాలో దేవుడు వారికి ఏమి చేస్తాడో వివరించాడు. ఆయన ఇలా అన్నాడు, “మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టకడలన్నిటిని అనుసరించి నడచినయెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.” తమ అలవాట్ల విషయంలో క్రీస్తు ఖచ్చితమైన ఉపదేశం ఇచ్చి, వారికి ఈ హామీ ఇచ్చాడు. “యెహోవా నీ యొద్దనుండి సర్వరోగములను తొలగించును” వారు షరతుల్ని నెరవేర్చినప్పుడు, ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. “వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను.” CDTel 118.1
ఇవి మనకు ఉద్దేశించిన పాఠాలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకునే వారందరూ పాటించాల్సిన షరతులున్నాయి. ఈ షరతులేంటో అందరూ తెలుసుకోవాలి. తన చట్టాల విషయంలో - అవి ప్రకృతి చట్టాలేగాని ఆధ్యాత్మిక చట్టాలేగాని - దేవుడు అజ్ఞానాన్ని సహించడు. శరీరారోగ్యాన్ని ఆధ్యాత్మికారోగ్యాన్ని పునరుద్ధరించటంలో మనం దేవుని తోటి కార్యకర్తలం. CDTel 118.2