ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

95/475

జీవిత చట్టాల తాలూకు ఇష్ట పూర్వక అజ్ఞానం

(1872) 3T 140, 141 CDTel 116.1

195. జీవిత చట్టాలు ఆరోగ్య చట్టాల నిర్లక్ష్యంలో కనిపిస్తూ, ఈ తరాన్ని ప్రత్యేకంగా సూచిస్తున్న నియమరాహిత్యత విభ్రాంతి కలిగిస్తున్నది. ప్రజల చుట్టూ వెలుగు ప్రకాశిస్తున్నా, ఈ అంశం పై అజ్ఞానం ప్రబలుతున్నది. అధిక సంఖ్యాకుల విషయంలో ఏమి తింటాను? ఏమి తాగుతాను? ఏమి ధరించుకుంటాను? అన్న విషయాలే ఆందోళన కలిగిస్తున్నాయి. మన శరీరాన్ని మనం ఎలా పరిగణించాలన్న విషయమై ఎంతో చెప్పటం ఎంతో రాయటం జరిగినా, సామాన్యంగా పురుషుల్ని స్త్రీలని శాసిస్తున్న చట్టం తిండి. CDTel 116.2

మనుషులు ఆరోగ్య చట్టాలికి విధేయులై నివసించటానికి ఈ అంశాన్ని తమ వ్యక్తిగత విధిగా చేసుకోటానికి సంసిద్ధంగా లేరు గనుక నైతిక శక్తులు బలహీనపడుతున్నాయి. తల్లిదండ్రులు తమ సంతానానికి తమ సొంత దురలవాట్లను, రక్తాన్ని చెడు రక్తంగా మార్చి మెదడును బలహీనపర్చే హేయమైన వ్యాధుల్ని సంక్రమింపజేస్తారు. స్త్రీలు పురుషుల్లో అధిక సంఖ్యాకులు తమ శరీరానికి సంబంధించిన చట్టాల విషయంలో అజ్ఞానులుగా మిగిలిపోయి, తిండి వాంఛకు ఉద్రేకాలకు లోనై తమ ప్రతిభకు నైతికతకు హాని చేసుకుంటూ ప్రకృతి చట్టాల అతిక్రమ పర్యవసానాల్ని గూర్చిన అజ్ఞానంలో కొనసాగటానికి సమ్మతంగా ఉన్నట్లు కనిపిస్తారు. వారు నెమ్మదిగా పనిచేసే విషాలు గల భ్రష్టమైన తిండి తింటారు. ఆ విషాలు రక్తాన్ని కలుషితం చేసి, నరాల శక్తిని దెబ్బతీస్తాయి. పర్యవసానంగా వ్యాధి, మరణం సంభవిస్తాయి. వారి మిత్రులు ఈ జీవన విధాన పర్యవసానాన్ని దైవ సంకల్పం నెరవేర్పు అని అంటారు. అలాగనటంలో వారు దేవున్ని అగౌరవపర్చుతారు. వారు ప్రకృతి చట్టాలకి ఎదురుతిరిగారు. వాటి పై తమ తిరుగుబాటుకి శిక్ష అనుభవించారు. ఇప్పుడు బాధ, మరణం ముఖ్యంగా చిన్నపిల్లల నడుమ అన్నిచోట్ల ప్రబలుతున్నాయి. ఈ తరం వారికీ మొదటి రెండువేలల్లో నివసించిన వారికీ మధ్య ఎంత భేదం ఉన్నది! CDTel 116.3