ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

93/475

పంచదార, పాలు

(1905) M.H.302 CDTel 110.7

191. ఆహారంలో చాలా ఎక్కువ పంచదార ఉపయోగించటం జరుగుతున్నది. కేకులు, తీపి ఫుడ్డింగులు, పేస్త్రీలు, జెల్లీలు, జెమ్ లు అజీర్తికి ప్రధాన కారణాలు. పాలు, గుడ్లు, పంచదార ప్రధాన దినుసులుగా ఉన్న కసలు, ఫుడ్డింగులు మరింత హానికరం. పాలు పంచదార కలిపి విరివిగా ఉపయోగించటాన్ని నివారించాలి. CDTel 110.8

[C.T.B.H.57] (1890) C.H.154 CDTel 111.1

192. కొందరు జావలో పాలు, ఎక్కువ పంచదార వేసుకుని తింటారు. తాము ఆరోగ్యసంస్కరణను అనుసరిస్తున్నామని భావిస్తారు. కాని పంచదార పాల సంయోగం వల్ల కడుపులో కిణ్వ ప్రక్రియ (పులియటం) చోటు చేసుకునే అవకాశం ఉంది కనుక అవి హానికరం. (పాలు పంచదార చూడండి-533,534,535,536) CDTel 111.2

కొవ్వు పదార్థాలు. క్లిష్ట మిశ్రమాలు CDTel 111.3

ఉత్తరం 72, 1896 CDTel 111.4

193. పోపులు, ఐస్ క్రీమ్ వగైరా తీపి పదార్థాలు ఎంత తక్కువ తింటే అంత మంచిది. మిశ్రమాలు, సంక్లిష్ట ఆహారపదార్థాలు మనుషుల ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. మానవుడి కడుపులోకి తరచుగా వెళ్ళే మిశ్రమాలు మూగ జంతువులు ఎన్నడూ తినవు. CDTel 111.5

కొవ్వు పదార్థాలు, క్లిష్టమైన మిశ్రమాలతో కూడిన ఆహారం ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. CDTel 111.6

[క్రొవ్వుతో కూడిన ఆహారం, రకరకాల వంటకాలు శిబిర సమావేశాలకి ఉత్తమాహారం కాదు-74] CDTel 111.7

[విభాగం XIX, డిసర్లు చూడండి] CDTel 111.8