ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

90/475

ప్రశాంత అన్నకోశం, ప్రశాంత చిత్తవృత్తి

MS 41, 1908 CDTel 108.7

187. మనం జీర్ణమండల అవయవాల్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. అనేక రకాల వంటకాలు భుజించటం ద్వారా వాటికి భారం కలిగించకూడదు. ఒకే పూట రకరకాల వంటకాల్ని ఆరగించే వ్యక్తి తనకు హాని చేసుకుంటున్నాడు. మన ముందు పెట్టిన రకరకాల వంటకాలన్నింటిని రుచి చూడటం కన్నా మనకు పడే ఆహారాన్ని తినటం ఎక్కువ ప్రాముఖ్యం. అన్నకోశంలో ఏమి జరుగుతున్నదో చూసేందుకు దానికి ద్వారం లేదు. కనుక మనం కార్యకారణ సంబంధాన్ని గ్రహించటానికి మన మనసుని తెలివిని ఉపయోగించాలి. ఒంట్లో బాగాలేనట్లు, అంతా సవ్యంగా లేనట్లు మీరు భావిస్తే, బహుశా అది అనేక రకాల వంటకాల్ని తినటం వల్ల కలిగిన పర్యవసానమేమో. CDTel 108.8

మన జీవితానందంలో జీర్ణక్రియ అవయవాల పాత్ర ప్రాముఖ్యమైంది. ఆహారంగా ఏమి తినాలి అన్నది తెలుసుకోటానికి దేవుడు మనకు తెలివి ఇచ్చాడు. మనం తినే ఆహార పదార్థాలు మనకు సరిపడతాయో లేక సమస్యలు సృష్టిస్తాయో విజ్ఞతగల స్త్రీలు పురుషులుగా మనం అధ్యయనం చెయ్యవద్దా? పులిసిన అన్నకోశం గలవారు తరచుగా చిటపటలాడే మనః ప్రవృత్తి కలిగి వుంటారు. వారికి అంతా వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది. త్వరగా కోపపడే మనస్తత్వం ఉంటుంది. ప్రజల నడుమ సమాధానంగా నివసించాలనుకుంటే కడుపుని ప్రశాంతంగా ఉంచుకోటానికి మనం ఎక్కువ ఆలోచించాలి. CDTel 109.1

[ఎక్కువ రకాల వంటకాలు, తప్పుడు ఆహారపదార్థాల సంయోగాల వల్ల హానికరమైన పర్యవసానాలు-141, 225,226,227,264,387, 546,551,722] CDTel 109.2

[మన భోజన హోటళ్లలో ఆహార పదార్థాల సంయోగం-415] CDTel 109.3

[రోగులికి ఆహార పదార్థాల సంయోగంలో తీసుకోవలసిన శ్రద్ధ - అపెండిక్స్ 1:19,23,25] CDTel 109.4