ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
ఆహార పదార్థాల సంయోగం
ఉత్తరం 213, 1902 CDTel 106.1
176. సరి అయిన ఆహార పదార్థాల సంయోగం గురించిన జ్ఞానం చాలా విలువైంది. దాన్ని దేవుడు అనుగ్రహిస్తున్న వివేకంగా స్వీకరించాలి. CDTel 106.2
(R.&.H. జూలై 29,1884) CDTel 106.3
177. ఒకే భోజనంలో ఎన్నోరకాల వంటకాలు తినవద్దు. మూడు నాలుగు రకాలు చాలు. తర్వాతి భోజనంలో మార్పు చేసుకోవచ్చు. కుటుంబానికి తాను తయారుచేసే వంటకాల మార్పు విషయంలో గృహిణి తవ ఆలోచనకు సృజనాత్మతకు పని చెప్పాలి. ఒకే రకమైన ఆహారం పూట తర్వాత పూట తినటానికి కడుపును బలవంతం చెయ్యకూడదు. CDTel 106.4
(1868) 2T 63 CDTel 106.5
178. ఏ ఒక్క భోజనంలోను పలు రకాల వంటకాలు తినకూడదు. కాని అన్ని పూట్లా మార్పు లేకుండా ఒకే రకమైన భోజనం ఉండకూడదు. ఆహారాన్ని పామాన్యంగా తయారుచెయ్యాలి. అయినా దాన్ని ఇంపుగా రుచిగా తయారు చెయ్యాలి. CDTel 106.6
ఉత్తరం 73a, 1896 CDTel 106.7
179. కడుపును పలురకాల వంటకాలతో నింపటం కన్నా ఒకే భోజనంలో రెండు మూడు వంటకాలు తినటం ఎంతో మేలు. CDTel 106.8
MS86, 1897 CDTel 106.9
180. అనేకులు అమిత తిండి మూలంగా వ్యాధి గ్రస్తులవుతున్నారు... అనేక రకాల వంటలతో కడుపు నింపటం ఫలితంగా కడుపు పులియటం జరుగుతుంది. ఈ పరిస్థితి ప్రమాదకరమైన వ్యాధికి దారి తీస్తుంది. పర్యవసానంగా మరణం సంభవిస్తుంది. CDTel 106.10
ఉత్తరం 54, 1896 CDTel 107.1
181. ఒక భోజనంలోనే అనేక రకాల వంటకాలు తినటం అసౌకర్యాన్ని కలిగించి, వాటిని విడివిడిగా తింటే అవి శరీరానికి చేసి వుండే మేలుని నాశనం చేస్తుంది. ఈ రకమైన తిండి ఎల్లప్పుడూ బాధను తరచు మరణాన్ని కలిగిస్తుంది. CDTel 107.2
ఉత్తరం 73a, 1896 CDTel 107.3
182. మీరు చేసేది ఆఫీసు పని అయితే ప్రతీరోజు వ్యాయామంచేసి, ప్రతీపూట భోజనంలో రెండు మూడు సామాన్య వంటకాల్ని మాత్రమే, అదికూడా ఆకలి తీర్చటానికి అవసరమైనంత మాత్రమే, తీసుకోవాలి. అంతకు మించి తినకూడదు. CDTel 107.4
[ఆఫీసుల్లో పనిచేసేవారికి అదనపు సూచనలు-225] CDTel 107.5
(1802) 7T 257 CDTel 107.6
183. అనుచిత ఆహారపదార్థాల కలయిక వల్ల కడుపులో గందరగోళం ఏర్పడుతుంది. ఆహారం పులియటం మొదలవుతుంది. రక్తం మలిన మౌతుంది. మెదడు తికమకపడుతుంది. CDTel 107.7
అతి తిండి అలవాటు లేదా ఒకే పూట భోజనంలో అనేక రకాల వంటకాలు ఆరగించటం తరచు అజీర్తి వ్యాధి కలిగిస్తుంది. సున్నితమైన జీర్ణమండల అవయవాలకి ఈ రకంగా లీగ్రహాని జరుగుతుంది. కడుపు వ్యర్థంగా ప్రతిఘటించి, కార్యకారణ సూత్రానుగుణంగా ఆలోచించమని మెదడుకి విజ్ఞప్తి చేస్తుంది. తిన్న అమితాహారం లేదా అనుచిత వంటక సంయోగం దాని కీడును అది చేసి తీరుతుంది. వ్యర్థంగా అనంగీకారాన్ని సూచిస్తూ ముందస్తు హెచ్చరికలు వస్తాయి. పర్యవసానంగా బాధ సంభవిస్తుంది. ఆరోగ్యం బదులు బాధ వస్తుంది. CDTel 107.8