ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

44/475

ఆదాము వైఫల్యం - క్రీస్తు విజయం

ఆదామవ్వలు నిగ్రహంలేని తిండివలన పతనమయ్యారు. క్రీస్తు వచ్చి సాతాను భీకర శోధనను తట్టుకుని, మానవజాతి పక్షంగా ఆహార వాంఛను అధిగమించి, మానవుడు జయించటం సాధ్యమని చూపించాడు. ఆదాము ఆహారవాంఛ మూలంగా పడిపోయినట్లు, ఆదాము పిల్లలు క్రీస్తు ద్వారా ఆహార వాంఛను అధిగమించి అన్ని విషయాల్లో ఆశా నిగ్రహం పాటించటం ద్వారా ఏదెనును తిరిగి సంపాదించవచ్చు. CDTel 64.1