ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

42/475

విభాగం III—ఆరోగ్య సంస్కరణ, మూడోదూత వర్తమానం

శరీరానికి హస్తంలాగ

(1873) 3T 161, 162 CDTel 63.1

97. డిసెంబర్ 10,1871. ప్రభువు రాకకోసం ఓ ప్రజను సిద్ధం చేసే గొప్ప పరిచర్యలో ఆరోగ్య సంస్కరణ ఓ భాగమని నాకు మళ్లీ దర్శనంలో చూపించబడింది. శరీరంతో హస్తానికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో మూడోదూత వర్తమానంతో ఆరోగ్య సంస్కరణకు అంత దగ్గర సంబంధం ఉంది. పది ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని మానవుడు చాలా చులకనగా చూస్తున్నాడు. అయితే ఆ ధర్మశాస్త్ర అతిక్రమించే వారికి ముందస్తు హెచ్చరిక పంపించకుండా వారిని శిక్షించటానికి ప్రభువు రాడు. ఆ వర్తమానాల్ని మూడో దూత ప్రకటిస్తున్నాడు. జనులు పది ఆజ్ఞల ధర్మశాస్త్రానికి విధేయులై వాటి నియమాన్ని తమ జీవితాల్లో నెరవేర్చితే ప్రస్తుతం లోకాన్ని వరదలా ముంచుతున్న వ్యాధి ఉండేది కాదు. CDTel 63.2