ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

40/475

సాధారణ ఆహార ప్రభావం

(1869) 2T 352 CDTel 59.5

94. దైవ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నట్లు చెప్పుకునే వారందరు దుష్టతకు అధర్మానికి పాల్పడకుండా ఉంటే నాకెంతో ఉపశమనం కలుగుతుంది. కాని అలా జరగటంలేదు. ఆజ్ఞలన్నింటిని ఆచరిస్తున్నట్లు చెప్పుకునే కొందరు సైతం వ్యభిచారం చేస్తున్నారు. మొద్దుబారిన వారి మనోభావాల్ని తెప్పరిల్ల జెయ్యటానికి నేను ఏమి చెప్పగలను? నిక్కచ్చిగా అమలయిన నైతిక నియమం ఒక్కటే ఆత్మకు పరిరక్షణ. ఆహారం మిక్కిలి సామాన్యంగా ఉండాల్సిన సమయం ఏదైనా వుంటే అది ఇప్పుడే. మన పిల్లల ముందు మాంసాహారం ఉంచకూడదు. దాని ప్రభావం తుచ్చమైన ఉద్రేకాల్ని రెచ్చగొట్టి బలపరుస్తుంది. అది నైతిక శక్తుల్ని నాశనం చేస్తుంది. నూనె గాని కరిగించిన కొవ్వుగాని లేకుండా సాధ్యమైనంత స్వాభావికంగా తయారు చేసిన గింజలు పండ్ల ఆహారం పరలోకానికి ఎత్తబడటానికి సిద్ధపడుతున్నామని చెప్పుకునే వారి ఆహారం కావలసి వుంది. ఆహారం ఎంత తక్కువ ఉత్తేజకమైతే ఉద్రేకాల్ని అంత సులువుగా అదుపుచేయగలుగుతాం. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా రుచిని మాత్రమే పరిగణించకూడదు. CDTel 59.6

క్షుద్ర ఆవేశాల ఆచరణ వెలుగు చూడకుండా అనేకులకి అంధత్వం కలిగిస్తుంది. ఎందుకంటే విడిచి పెట్టటానికి తాము అయిష్టంగా ఉన్న పాపాల్ని చూడవలసి వస్తుందని వారి భయం. తమకిష్టమైతే అందరూ చూడవచ్చు. వారు వెలుగుకి బదులు చీకటిని ఎంపిక చేసుకుంటే వారి నేరం ఏమీ తగ్గదు. తమ శారీరక, మానసిక, నైతిక బలం పై అంతగా ప్రభావం చూపే ఈ విషయాల్ని అధ్యయనం చేసి, స్త్రీలు పురుషులు ఎందుకు జ్ఞానం సంపాదించరు? జాగ్రత్తగా చూసుకుని, తనను మహిమ పర్చేందుకు ఉత్తమ స్థితిలో కాపాడుకోటానికి దేవుడు మీకో నివాసస్థలాన్ని ఇచ్చాడు. CDTel 60.1