ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

378/475

విభాగం XXIV—పానీయాలు

భాగం I - నీళ్లు తాగటం స్వచ్ఛమైన నీరు ఓ దీవెన

(1905) M.H.237 CDTel 436.1

726. స్వచ్ఛమైన నీరు ఆరోగ్యంలోను అనారోగ్యంలోను దేవుడిచ్చిన గొప్ప దీవెనల్లో ఒకటి. నీటి సరియైన వినియోగం ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. అది జంతువులు, మానవుల దాహాన్ని తీర్చటానికి దేవుడిచ్చిన పానీయం. సమృద్ధిగా తాగితే అది శరీర వ్యవస్థ అవసరాల్ని సరఫరా చేసి వ్యా ధిని నిరోధించటానికి ప్రకృతికి తోడ్పడుతుంది. CDTel 436.2

హెల్త్ రిఫార్మర్, జనవరి, 1871 CDTel 436.3

727. మితంగా తిని తద్వారా నా వ్యవస్థపై అనవసర భారాన్ని తొలగించి, సంతోషాన్ని ప్రోత్సహించి ఆరుబయట వ్యాయామం ద్వారా నేను ఉపకారం పొందాలి. నేను తరచుగా స్నానం చెయ్యాలి. స్వచ్ఛమైన నీరు సమృద్ధిగా తాగాలి. CDTel 436.4