ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

328/475

విభాగం XXII—మాంసకృత్తులు

భాగం I - పప్పులు, పప్పు ఆహారపదార్థాలు

తగిన ఆహారంలో భాగం

(1905) M.H.296 CDTel 375.1

617. మన సృష్టికర్త మనకు ఎంపికచేసిన ఆహారం గింజలు, పండ్లు, పప్పులు, కూరగాయలు. ఈ ఆహారపదార్ధాల్ని సాధ్యమైనంత సామాన్యంగా సహజంగా తయారుచేసినప్పుడు అవి ఆరోగ్యదాయకంగాను బలవర్ధకంగాను ఉంటాయి. మరింత క్లిష్టమైన, ఉద్రేకం పుట్టించే ఆహారం ఇవ్వలేని బలాన్ని సహనశక్తిని మానసిక ఉత్సాహాన్ని అవి ఇస్తాయి. CDTel 375.2

MS 27, 1906 CDTel 375.3

618. గింజలు, పండ్లు, కూరగాయలు పప్పుల్లో మనకు అగత్యమైన ఆహార మూలపదార్థాలున్నాయి. మనం సరళమైన, దీనమైన మనసుతో ప్రభువు వద్దకు వస్తే, మాంసకళంకం లేకుండా ఆరోగ్యవంతమైన ఆహారం తయారు చెయ్యటం ప్రభువు మనకు నేర్పిస్తాడు. CDTel 375.4

[తగిన ఆహారంలో-483] CDTel 375.5

[దేవుడిచ్చిన ఆహారంలో-404] CDTel 375.6

[ఆసుపత్రి రోగులకి వినియోగం నేర్పించాలి-767] CDTel 375.7