ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

28/475

విభాగం II—ఆహారం, ఆధ్యాత్మికత

అవితానుభవం పాపం

[R&H., జన. 25] (1881)C.H.67 CDTel 35.1

47. దేవునికి భయపడున్నామని చెప్పుకునేవారు శరీరారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, అమితానుభవం పాపం కాదని, ఆధ్యాత్మికతకు అది విఘాతం కలిగించదని భావించకుందురుగాక. భౌతిక నైతిక స్వభావాల మధ్య సన్నిహిత సానుభూతి ఉంటుంది. CDTel 35.2

(1905) M.H.129 CDTel 35.3

48. మన ఆది తలిదండ్రుల విషయంలో అమిత వాంఛ ఏదెనును పోగొట్టుకోటానికి దారితీసింది. అన్ని విషయాలలో మితం పాటించటానికి మన ఏదెను పునరుద్ధరణకూ దగ్గర సంబంధం -మనుషులు గుర్తించేదాని కన్నా ఎంతో దగ్గర సంబంధం - ఉంది. CDTel 35.4

M.S.49.1897 CDTel 35.5

49. భౌతిక చట్ట ఉల్లంఘన దేవుని ధర్మశాస్త్ర ఉల్లంఘనే. మన సృష్టికర్త ఏసుక్రీస్తు. ఆయనే మనకు కర్త. ఆయన మానవ దేహాన్ని సృజించాడు. ఆయన నైతిక చట్టానికి కర్త అయినట్లే. భౌతిక చట్టానికి కర్త. తన భౌతిక జీవితానికి ఆరోగ్యానికి సంబంధించిన అలవాట్ల విషయంలో అజాగ్రత్తగా, లక్ష్యం లేకుండా ఉండే వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. క్రీస్తును ప్రేమిస్తున్నట్లు చెప్పుకునే అనేక మంది తమను రక్షించటానికి మరణించిన ఆయన పట్ల భక్తి గౌరవాలు ప్రదర్శించరు. ఆయన్ని పూజించరు లేక గౌరవించరు లేక గుర్తించరు. తమ దేహానికి సంబంధించిన చట్టాల్ని అతిక్రమించటంలో వాటికి హాని కలిగించటం ద్వారా దీన్ని చూపిస్తారు. CDTel 35.6

(1876) 47.30 CDTel 35.7

50. ప్రకృతి చట్టాల్ని అతిక్రమిస్తూ పోటం దైవధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూ పోటమే. మనకు అన్నిచోట్ల కనిపించే బాధ, వేదన లోకాన్ని వరదలా ముంచుతున్న అంగవైకల్యం, వ్యాధి, మానసిక దుర్భలత దేవుడు ఉద్దేశించిన ఆనందదాయక స్థితితో పోల్చినప్పుడు మన లోకాన్ని వ్యాధిగ్రస్తుల గృహంగా మార్చుతున్నాయి. ఈ తరంలోని ప్రజలు మానసికంగా, నైతికంగా శారీరకంగా బలహీనులయ్యారు. పడిపోయిన మానవుడు దైవ ధర్మస్త్రాన్ని అతిక్రమిస్తాడు. కనుక ఈ దుఃఖం దుర్దశ తరం నుంచి తరానికి వస్తున్నాయి. వక్రభోజన పానాలవల్ల నికృష్ట పాపాలు చోటుచేసుకుంటున్నాయి. CDTel 35.8

(1880) 4T417 CDTel 36.1

51. తినటం, తాగటం, నిద్రపోటం లేక చూడటం, అతిగా చేయటం పాపం. శరీరం మనసుల సమరస, ఆరోగ్యకర కార్యాచరణ సంతోషం కలిగిస్తుంది. ఆ శక్తులు ఎంత సమున్నతం పరిశుద్ధం అయితే ఆ ఆనందం అంత పవిత్రం అంత నిష్కళంకం అవుతుంది. దేవుడు అతిలాలసత్వపాపాన్ని గుర్తిస్తాడు-246) CDTel 36.2