ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

282/475

బ్రెడ్, ఇతర కఠిన ఆహారపదార్థాల్ని వినియోగించటం వల్ల ఉపకారం

MS 3, 1897 CDTel 330.1

499. మాంసాహారం నుంచి శాఖాహారానికి మారేటప్పుడు భోజనబల్లని చక్కగా తయారుచేసిన, బాగా వండిన ఆహారపదార్థాలతో నింపటానికి శ్రద్ధ తీసుకోవాలి. జావ ఎక్కువగా తినటం పొరపాటు. నమలటం అవసరమయ్యే పొడి ఆహారం ఎంతో మేలు. ఈ విషయంలో ఆరోగ్యాహార ఉత్పత్తులు గొప్ప దీవెన. సామాన్యంగా తయారు చేసిన, గోధుమ రంగుగల మంచి బ్రెడ్, రోల్సు, ఆరోగ్యదాయకంగా ఉంటాయి. బ్రెడ్ కొంచెం కూడా పుల్లగా ఉండకూడదు. అదంతా చక్కగా ఉడకాలి - ఈరకంగా మెత్తదనం, జిగటదనం ఉండవు. CDTel 330.2

ఉపయోగించగలిగిన వారికి మెత్తని జావ లేక గంజికన్నా ఆరోగ్యకరంగా తయారుచేసిన కూరగాయలు మెరుగు. చక్కగా ఉడికిన, రెండు మూడు రోజులు పాతదైన బ్రెడ్లో పండ్లు ఉపయోగించటం తాజా బ్రెడ్ ఉపయోగించటం కన్నా ఎక్కువ ఆరోగ్యదాయకం. దీన్ని నెమ్మదిగా, బాగా నమలటం వల్ల శరీర వ్యవస్థకు అవసరమైనదంతా లభిస్తుంది. CDTel 330.3

[నిలాస ఆహారపదార్థాలకు మారుగా మంచి ట్రేడ్-312] CDTel 330.4