ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

265/475

క్కాన్ చెయ్యటం, ఎండ బెట్టటం

(1905) M.H.299 CDTel 322.5

476. పండ్లు సమృద్ధిగా పండే స్థలాల్లో చలికాలానికి దాచుకోటానికి వాటిని క్వాన్ చేసి లేక ఎండబెట్టి ఉంచుకోవచ్చు. ద్రాక్ష, గూస్ బెరీ, స్ట్రాబెరీ, రేస్ మిరీ, బ్లేక్ బెరీ వంటి చిన్న పండ్లని ఎక్కడ వాటిని ఎక్కువగా ఉపయోగించరో, ఎక్కడ వాటి సాగు నిర్లక్ష్యమౌతుందో ఆ స్థలాల్లో వాటిని పెంచి, లాభం పొందవచ్చు. CDTel 322.6

ఇంట్లో వినియోగం కోసం క్యాన్ చేసేటప్పుడు టిన్ను పాత్రల కన్నా గాజు పాత్రల్ని సాధ్యమైనంత మేరకు ఉపయోగించాలి. క్యానింగ్ కి ఉపయోగించే పండ్లు మంచి పరిస్థితిలో ఉండాలి. తక్కువ పంచదార వేసి దాన్ని చెడిపోకుండా ఉంచటానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం దాన్ని ఉడకబెట్టాలి. ఇలా తయారు చేసినవి తాజా పండ్లకి మంచి ప్రత్యామ్నాయమౌతాయి. CDTel 322.7

కిస్మిన్లు, ఫ్రూన్లు, ఏపిల్లు, పేర్లు, పీచు, ఏప్రికాట్ల వంటి ఎండబెట్టిన పండ్లు తక్కువ ధరలకు ఎక్కడ దొరుకుతాయో అక్కడ వాటిని ప్రధాన ఆహారంగా స్వేఛ్చగా ఉపయోగించవచ్చు. ఇది అన్ని తరగతుల ప్రజలకి ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చే ఆహారం. CDTel 322.8

ఉత్తరం 195, 1905 CDTel 322.9

477. గాజు పాత్రల్లో భద్రపరచిన ఏపిల్సస్ ఆరోగ్యదాయకంగా, రుచిగా ఉంటుంది. పేర్లు, బెర్రీలతో చేసిన సాస్ చలికాలం ఉపయోగించుకోటానికి బాగుంటుంది. CDTel 322.10

ఉత్తరం 5, 1870 CDTel 322.11

478. మీకు ఏపిల్లు దొరుకుతుంటే పండ్లకు సంబంధించినంత వరకూ ఇంకేమీ దొరక్కపోయినా పర్వాలేదు. మీరు మంచి పరిస్థితిలోనే ఉన్నారు..... ఎక్కువ రకాల పండ్లు అవసరమని నేను అనుకోను. అయినా వాటి కాలాల్లో వాటిని పోగు చేసి భద్రపర్చుకుని ఏపిల్లు దొరకనప్పుడు వాడుకోవాలి. వాటికి బదులుగా ఉపయోగించగల ఏ పండ్లకన్నా ఏపిల్లు శ్రేష్ఠమైనవి. CDTel 322.12