ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
ఖండితమైన ఆశా నిగ్రహం వ్యాధికి ముందు
(1905) M.H.114 CDTel 317.1
462. వక్ర ఆహార పానాల వల్ల లేక ఇతర తప్పుడు అలవాట్ల వల్ల బాధడుతున్న రోగిని చూసినా దాన్ని గురించి అతడికి తెలపటం నిర్లక్ష్యం చేసే వైద్యుడు సాటి మనిషికి హాని కలిగిస్తున్న వాడవుతాడు. తాగుబోతులు, ఉన్మాదులు, నైతికంగా స్వేచ్ఛావిహారం చేసేవారు బాధ పాప పర్యవసానంగా వస్తుందని స్పష్టంగా ప్రకటిస్తారు. నిత్యం బాధతో పోరాటం చేస్తూ బాధని నివారించటానికి నిత్యం పాటుపడే వైద్యుడు ఎలా మౌనంగా ఉండగలడు? వ్యాధి నివారణకి ఖచ్చితమైన మిత భోజన పానాల అవసరమని బోధించని వైద్యుడు ఉదారుడు, దయగలవాడు ఎలా అవుతాడు? CDTel 317.2