ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు
విశ్వాసం, సరియైన ఆహార పానాలు
ఉత్తరం 5, 1904 CDTel 314.3
455. వ్యాధి బాధితులు అన్నపానాలు, వస్త్రధారణ, యుక్తమైన వ్యాయామం విషయాల్లో తమ అభ్యాసాల్ని సరిదిద్దుకోటం ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోటానికి శాయశక్తులా కృషిచెయ్యాలి. ఆరోగ్యం కోసం మన ఆసుపత్రులకి వచ్చే రోగులకి దేవునితో సహకరించటం నేర్పించాలి. “మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.” దేవుడు కండరాల్ని నరాల్ని ఉపయోగించటానికి చేశాడు.. మానవ దేహ యంత్రాంగం నిష్కియగా ఉండటం వల్ల బాధ వ్యాధులు కలుగుతాయి. CDTel 314.4
(1867) 1T 561 CDTel 314.5
456. రోగులకి చికిత్స చేసేవారు, ఆయన కృపతో అనుగ్రహించిన, ఓ జనంగా మన గమనానికి వేటిని తెస్తున్నాడో ఆ స్వచ్ఛమైన గాలి, పారిశుధ్యం, ఆరోగ్యకరమైన ఆహారం, పనికి, విశ్రాంతికి సరియైన కాలావధులు, నీటి వినియోగం వంటి సాధనాలని దీవించటానికి ఆయన మీద బలంగా ఆనుకుని, ప్రాముఖ్యంగల తమ సేవలో ముందుకి సాగాలి. CDTel 314.6