ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

3/475

విభాగం I—సంస్కరణకు కారణాలు

దైవ మహిమ కోసం

[C.T.B.H.41,42] (1890) C.H. 107, 108 CDTel 2.1

1. జీవించడానికి మనకు ఒక జీవితమే ఉంది. ” నా శక్తులవల్ల గొప్ప మేలు పొందేందుకోసం వాటిని ఎలా వినియోగించుకోగలను?” దేవుని మహిమ కోసం సాటి మనుషుల శ్రేయస్సు కోసం ఎలా కృషి చేయగలను? అంటూ ప్రతీవారూ తమను తాము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ లక్ష్యాల సాధనకు పాటుపడ్డప్పుడే జీవితం విలువను సంతరించుకుంటుంది. CDTel 2.2

మనల్ని మనం వృద్ధి పర్చుకోటమే దేవునిపట్ల సాటి మనుషుల పట్ల మన ప్రథమ కర్తవ్యం. సృష్టికర్త మనకనుగ్రహించిన ప్రతీ మానసిక శక్తిని మనం చెయ్యగలిగి ఉన్న మేలు చెయ్యటానికి సంపూర్ణంగా వృద్ధిపర్చుకోవాల్సి ఉన్నాం. కనుక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సంపాదించుకోటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి వినియోగించే సమయం లాభదాయక మౌతుంది. శారీరక విధినిగాని లేక మానసిక విధినిగాని కుంటుపర్చటం మనకు మంచిదికాదు. ఇది మనం చేస్తే దాని పర్యవసానాల్ని అనుభవించక తప్పదు. CDTel 2.3