ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

178/475

విభాగం XIII—బాల్యదశలో ఆహారం

దైవోపదేశంపై ఆధారితమైన సలహా

సైన్స్. సెప్టె.13, 1910 CDTel 230.1

339. “మాకు జన్మించబోయే బిడ్డకు మేం ఏంచెయ్యాల్సిఉంది?” అని తండ్రులు తల్లులు ఆలోచన చేసుకోవాలి. తన బిడ్డల జననానికి ముందు తల్లి నడవడిని గూర్చి దేవుడు ఏమి చెబుతున్నాడో పాఠకుడి ముందు పెట్టాం. అంతేకాదు. తల్లిదండ్రులు తమ విధిని పూర్తిగా అవగాహన చేసుకునేందుకు, పిల్లల జననానికి ముందే తల్లిదండ్రులకి పిల్లల్ని ఎలా పెంచాలో సూచనలివ్వటానికి గబ్రియేలు దూతను దేవుడు పరలోకం నుంచి పంపాడు. CDTel 230.2

దాదాపు క్రీస్తు మొదటి రాక సమయంలో మనోహకు వచ్చిన వర్తమానం వంటి వర్తమానంతో గబ్రియేలు దూత జెకర్యా వద్దకు వచ్చాడు. తన భార్య ఓ కుమారుణ్ని కంటుందని, అతడికి యోహానని పేరు పెట్టాలని ఆ వృద్ధ యాజకుడితో చెప్పాడు. “అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై” ఉంటాడు అని దూత అన్నాడు. ఈ వాగ్దత్త పుత్రుడు ఖచ్చితమైన మితానుభవ అలవాట్లతో పెరగాల్సి ఉంది. క్రీస్తు మార్గాన్ని సిద్ధం చెయ్యటానికి ప్రాముఖ్యమైన సంస్కరణ కార్యం అతడు నిర్వహించాల్సి ఉంది. CDTel 230.3

ప్రజల నడుమ మిత రహిత జీవితం ప్రబలుతున్నది. మద్యపానం, విలాసవంతమైన భోజనం శారీరక శక్తిని క్షీణింపజేసి, నైతికతను ఎంతగా దిగజార్చాయంటే ఎంత గొప్ప నేరమైనా పాపంగా కనిపించలేదు. యోహాను స్వరం పాప జీవితాలు జీవిస్తున్న ప్రజల్ని కఠినంగా మందలిస్తూ అరణ్యంలో నుంచి వినిపించాల్సి ఉంది. అతడి మితజీవనం ఆ కాలంలోని ఆధిక్యాలకి దుబారాకి గుద్దింపు. CDTel 230.4