ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

144/475

బ్రేక్ ఫాస్ట్ గట్టిగా తినండి

ఉత్తరం 3, 1884 CDTel 175.3

268. బ్రేక్ఫాస్ట్ అంతంత మాత్రమే తీసుకోటం సమాజానికి ఆచారంగా మారింది. అయితే కడుపుని సంరక్షించటంలో ఇది ఉత్తమ మార్గం కాదు. దినంలో రెండోభోజనం లేదా మూడో భోజనం సమయంలో కన్నా బ్రేక్ ఫాస్ట్ సమయంలో కడుపు ఎక్కువ ఆహారాన్ని స్వీకరించటానికి మెరుగైన స్థితిలో ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ అంతంత మాత్రంగాను రాత్రి భోజనం గట్టిగాను తినటం తప్పు. బ్రేక్ ఫాస్ట్ దినమంతటిలోనూ పెద్ద భోజనమై ఉండాలి. CDTel 175.4