అపొస్తలుల కార్యాలు

43/59

42—ఓడ ప్రయాణం , బద్దలైన ఓడి

చివరికి పౌలు రోముకు బయలుదేరాడు. లూకా ఇలా రాస్తున్నాడు, “మేము ఓడ ఎక్కి ఇటలీకి వెళ్లవలెనని నిర్ణయమైనప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్పగించిరి. ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి; మాసిదోనీయుడును థెస్సలొనీక పట్టణ స్థుడునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను.” AATel 313.1

క్రీస్తు శకంలోని ప్రథమ శతాబ్దంలో సముద్రం పై ప్రయాణం కష్టాలు ప్రమాదాలతో కూడుకొని ఉండేది. నావికులు సూర్యుడు నక్షత్రాల స్థానాన్ని బట్టి ఓడను నడిపేవారు. ఇవి కనిపించనప్పుడు, తుఫాను సూచనలు కనిపించినప్పుడు ఓడల సొంతదారులు ఓడను సముద్రంలోకి పంపటానికి భయపడేవారు. సంవత్సరంలో కొన్ని మాసాలు సముద్రప్రయాణం దాదాపు అసాధ్యమయ్యేది. AATel 313.2

సంకెళ్లతో ఉన్న ఖైదీగా ఇటలీకి చేయాల్సివున్న దీర్ఘమైన ఆయాసకరమైన సముద్రప్రయాణంలో కడగండ్లను శ్రమల్ని అనుభవించటానికి అపొస్తలుడైన పౌలు సిద్ధంగా ఉండాలి. కాగా అతని శ్రమల్ని తేలికచేసే ఒక అంశం లూకా అరిస్తార్కుల సహవాసం. తన కష్టాల్లో పరిచర్యచే సేందుకు, తనతో చెరలో ఉండటానికి అరిస్తార్కును ఎంపిక చేసుకున్నట్లు కొలస్సయులకు రాసిన ఉత్తరంలో పౌలు రాశాడు. AATel 313.3

ప్రయాణం ఆహ్లాదకరంగా ప్రారంభమయ్యింది. మరుసటి రోజు వారు సీదోను ఓడరేవుకు వచ్చి అక్కడ లంగరువేశారు. ఇక్కడ శతాధిపతి యూలి “పౌలు మీద దయగా ఉండి” ఆ స్థలంలో క్రైస్తవులున్నారని పౌలు వలన తెలుసుకొని ” స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు” అతనికి సెలవిచ్చాడు. ఆరోగ్యం అంత బాగాలేని అపొస్తలుడు ఈ సెలవును ఎంతో అభినందించాడు. AATel 313.4

సీదోను నుంచి బయలుదేరిన తర్వాత తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. అవి ఓడకు ఎదురుగా వీస్తున్నందువల్ల ఓడ నెమ్మదిగా నడుస్తున్నది. లుకియ రాష్ట్రంలో ఉన్న మూరలో ఇటలీతీరానికి వెళ్తున్న ఓ పెద్ద అలక్సంద్రియ పట్టణపు ఓడను శతాధిపతి కనుగొన్నాడు. వెంటనే తన ఖైదీల్ని ఆ ఓడలోకి బదిలీ చేశాడు. ఎదురుగాలులు ఇంకా వీస్తూనే ఉన్నాయి. ఓడ ముందుకు సాగటం కష్టమయ్యింది. లూకా ఇలా రాస్తున్నాడు, ” అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాని దాటి, మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి.” AATel 313.5

అనుకూలమైన గాలుల కోసం కని పెడ్రూ మంచి రేవులలో వారు కొంతకాలం ఉండాల్సివచ్చింది. శీతాకాలం సమీపిస్తున్నది. “ప్రయాణము చేయుట అపాయకరమై యుండెను.” సంవత్సరంలో ఇక సముద్ర ప్రయాణం ఆపివేసే కాలం రాకముందు తమ గమ్యాలు చేరుకోవాలని ఆశించిన ఓడ అధికారులు ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వారి ముందున్న సమస్య మంచి రేవులలో ఉండటమా లేదా ఇంకా మంచి స్థలానికి వెళ్ళి అక్కడ శీతాకాలం గడపటమా అన్నదే. AATel 314.1

ఆ అంశాన్ని తీవ్రంగా చర్చించారు. చివరికి శతాధిపతి నావికులూ సైనికులూ, ఎంతో అభిమానిస్తున్న పౌలుతో ఆ సమస్యను చర్చించాడు. అక్కడే ఉండిపోవటం ఉత్తమమని అపొస్తలుడు హితవు పలికాడు. ” ఈ ప్రయాణము వలన సరకులకును ఓడకును మాత్రమేకాక ప్రాణమునకు కూడ హానియు బహునష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది” అని పౌలు హెచ్చరించాడు. అయినా “నావికుడును ఓడ యజమానుడును” ప్రయాణికుల్లో అధిక సంఖ్యాకులూ ఓడ సిబ్బందీ పౌలు సలహాను తోసిపుచ్చారు. ఎందుకంటే “శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకు చేరి అక్కడ శీతాకాలము గడపవలెనని యెక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైఋతి వాయవ్య దిక్కుల తట్టుననున్న క్రేతు రేవైయున్నది.” AATel 314.2

ఎక్కువ మంది ఆలోచననే పాటించాలని శతాధిపతి నిర్ణయించుకున్నాడు. ఆ ప్రకారమే “దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా” త్వరలో తాము కోరుకున్న రేవు చేరుకోవచ్చన్న ఆశాభావంతో వారు మంచి రేవులు నుంచి బయలుదేరారు. “కొంచెము సేపైన తరువాత.... పెనుగాలి.... విసరెను,” “దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురునడువలేకపోయెను.” AATel 314.3

తుఫాను తాకిడివల్ల ఓడ కొట్టు కొనిపోయి కేద అనే చిన్న ద్వీపాన్ని సమిపించింది. ఓడలోని నావికులు ప్రమాదాన్ని ఎదుర్కోటానికి ఏర్పాట్లు చేశారు. ఓడ మునిపోతే వారి ప్రాణరక్షణకు ఒకే ఒక సాధనమైన రక్షక నావ ఓడలో ఉన్నది. అది ఏ నిమిషమైన బదాబద్దలైపోవచ్చు. దాన్ని ఓడ పైకి ఎత్తడం వారి ప్రథమ కర్తవ్యం. ఓడ తుఫాను తాకిడిని తట్టుకోటానికి దాన్ని బలోపేతం చేసే దిశగా ముందస్తు సిద్ధబాటంతా జరిగింది. ఆ చిన్న ద్వీపం ఇచ్చిన స్వల్ప రక్షణ వారికి ఉపయోగపడలేదు. మళ్ళీ వారు తుఫాను బీభత్సానికి గురి ఆయ్యారు. AATel 314.4

రాత్రంతా తుఫాను కొనసాగింది. ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఓడకు చిల్లులు ఏర్పడి లోపలికి నీళ్లు వస్తున్నాయి. “మరునాడు సరుకులు పారవేయసాగిరి.” మళ్ళీ రాత్రివచ్చింది. గాలి ఉద్ధృతి తగ్గలేదు. తుఫాను దెబ్బకు తెరచాప స్తంభం విరిగి తెరచాప చినిగివున్న ఓడ వేగంగా వీస్తున్న గాలికి అటూ ఇటూ ఊగుతున్నది. తుఫాను తాకిడికి ఓడ గిరిగిర తిరుగుతూ దడదడలాడటంతో మూలుగుతున్న ఓడ చెక్కలు ఏ నిమిషమైనా ఊడిపడిపోవచ్చుననిపించింది. ఓడలోకి నీళ్లురావటం వేగవంతమయ్యింది. ప్రయాణికులు ఓడ సిబ్బంది కలిసి ఏకధాటిగా నీళ్లు తోడేస్తున్నారు. ఓడలో ఉన్నవారెవ్వరికి క్షణం విరామంలేదు. ” మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను” అని లూకా రాస్తున్నాడు. AATel 315.1

సూర్యుడుగాని నక్షత్రాలుగాని లేని ఆకాశం కింద వారు పద్నాలుగు రోజులు కొట్టుకుపోయారు. తాను కూడా శారీరకంగా బాధననుభవిస్తున్నప్పటికీ అపోస్తలుడు ఆ అంధకార ఘడియల్లో నిరీక్షణ పుట్టించే మాటలతో వారిని ఉత్సాపర్చాడు. అత్యవసర పరిస్థితిలో చేయూతనిచ్చాడు. విశ్వాసంతో పౌలు అనంత శక్తిగల దేవుని చెయ్యి పట్టుకున్నాడు. పౌలు హృదయం దేవుని మీద నిలిచింది. అందుకు అతనిలో ఎలాంటి భయాలూలేవు. రోములో క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్నివ్వటానికి దేవుడు తన ప్రాణం కాపాడ్డాడని అతనికి తెలుసు. అయితే తన చుట్టూ ఉన్నవారి నిమిత్తం అతని హృదయం జాలిగొన్నది. వారు తమ పాపాల్లోను దీనస్థితిలోను ఉన్నారు. మరణించటానికి సిద్ధంగా లేరు. వారి ప్రాణాలు కాపాడవలసిందిగా పౌలు దేవునితో విజ్ఞాపన సల్పగా తన ప్రార్థన మేరకు అలా జరుగుతుందని అతనికి దేవుడు బయలుపర్చాడు. AATel 315.2

తుఫాను కొంచెం తెరపు ఇచ్చినప్పుడు పౌలు ఓడ పై భాగం మీదికి వెళ్ళి గొంతెత్తి ఇలా అన్నాడు: ” అయ్యలారా, మీరు నామాటవిని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడే హానియు నషమును కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవనివాడనో, యెవని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి - పౌలా, భయపడకుము; నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించియున్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపము మిద పడవలసియుండును.” AATel 315.3

ఈ మాటలు వారిలో నిరీక్షణను పుట్టించాయి. ప్రయాణికులేంటి ఓడ సిబ్బందేంటి ఉత్సాహభరితులయ్యారు. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నాశనాన్ని తప్పించేందుకు తమ శక్తి మేరకు ప్రతివారు ప్రయత్నించాలి. AATel 316.1

ఎగసిపడున్న నల్లని కెరటాల పై అటూ ఇటూ ఊగుతున్న ఓడలో ఉన్న పద్నాలుగోరాత్రి దాదాపు “అర్థరాత్రివేళ” కెరటాల శబ్దం విని “ఏదో యొక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదువేసి చూచి యిరువది బారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్ళిన తరువాత, మరల బుడుదు వేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి. అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడునేమో అని భయపడి, వారు ఓడ అమరములోనుండి నాలుగు లంగరులు వేసి యెప్పుడు తెల్లవారునా అని కాచుకొనియుండిరి” అని లూకా రాస్తున్నాడు. AATel 316.2

తెల్లవార్తున్నప్పుడు తుఫానుతో ఉన్న తీరం లేఖామాత్రంగా కనిపించింది. కాని పరిచిత దృశ్యాలేమీ కనిపించలేదు. ఆ దృశ్యం ఎంత నిరాశాజనకంగా ఉందంటే అన్యులైన ఆ నావికులు ధైర్యం కోల్పొయి “ఓడ విడిచి పారిపోవలెనని చూచి,” “అనిలోనుండి లంగరు వేయబోవునట్లుగా” నటించి రక్షక నావను దింపివేశారు. పౌలు వారి దురుద్దేశాన్ని పసిగట్టి శతాధిపతితోను సైనికులతోను ఇలా అన్నాడు. “వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరు.” “వెంటనే సైనికులు పడవ త్రాళ్లుకోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి.” AATel 316.3

మిక్కిలి ప్రమాదకరమైన ఘడియ ఇంకా ముందున్నది. అపొస్తలుడు మళ్లీ వాళ్లతో మాట్లాడి ధైర్యం చెప్పి ఆహారం తీసుకోవలసిందిగా నావికుల్ని ప్రయాణికుల్ని అర్ధించాడు. వారితో ఇలా అన్నాడు, “పదునాలుగు దినముల నుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొనియున్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది నాప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తలనుండియు ఒక వెంట్రుకయైనను నశింపదు.” AATel 316.4

“ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరియెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను.” అలసిపోయి నిరాశచెంది ఉన్న ఆ రెండు వందల డెబ్బయి అయిదుమంది మనుషులూ అప్పుడు పౌలుతో కలిసి భోజనం చేశారు. పౌలు గనుక ఆ పని చెయ్యకపోతే వారు నిరుత్సాహంతో కుంగిపోయేవారు. “వారు తిని తృప్తి పొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి” AATel 316.5

ఇప్పుడు వెలుగు సంపూర్ణంగా వచ్చింది. అయితే తామెక్కడున్నారో తెలుసుకోటానికి వారికి ఆధారాలేమీ లేవు. కాని “దరిగల యొక సముద్రపు పాయ చూచి, సాధ్యమైన యెడల అందులోకి ఓడను త్రోయనవలెనని ఆలోచించిరి, గనుక లంగరు త్రాళ్లు కోసి వాటిని సముద్రములో విడిచి పెట్టి చుక్కానుల కట్టువిప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరిగాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొనిన ఓడను మెట్టపట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను; అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను.” AATel 317.1

పౌలుకి తక్కిన ఖైదీలకి ఓడ పగిలే ప్రమాదంకన్న మరింత భయంకర ప్రమాదం ఇప్పుడు ఎదురయ్యేటట్లు కనిపిస్తున్నది. తీరానికి చేరటానికి చేస్తున్న ప్రయత్నంలో ఖైదీల్ని పారిపోకుండా చూడటం అసాధ్యమని సైనికులు నిర్ధారించుకున్నారు. ప్రతివారు తమ్మును తాము రక్షించుకోటానికి శాయశక్తుల కృషి చేయవచ్చు. అయితే ఖైదీల్లో ఎవరైనా తప్పించుకుపోతే వారికి ఎవరు బాధ్యులో ఆ సైనికులు ప్రాణాలు కోల్పోతారు. అందుచేత ఖైదీలందరినీ చం పెయ్యాలని సైనికులు తలంచారు. ఈ క్రూర విధానాన్ని రోమను చట్టం ఆమోదించింది. ఒక్కరి ప్రమేయమే లేకపోతే ఈ ప్రణాళికను వారు వెంటనే అమలుపర్చి ఉండేవారు. వీరంతా ఆ వ్యక్తికి కృతజ్ఞులై ఉండాలి. ఓడలోని వారందరి ప్రాణాల్ని రక్షించటంలో పౌలు ప్రధాన పాత్ర వహించాడని మరీ ముఖ్యంగా దేవుడు పౌలుతో ఉన్నాడని నమ్మి శతాధిపతి యూలి పౌలుకి హాని చెయ్యటానికి భయపడ్డాడు. కనుక ‘మొదట ఈదగలవారు సముద్రములో దరికి పోవలెననియు కడమవారిలో కొందరు పలకలమీదను, కొందరు తప్పించుకొని దరి చేరిరి.” ఖైదీల్ని హాజరు పిలవగా ఒక్కరు కూడా తప్పిపోలేదు. AATel 317.2

అనాగరికులైన మెలితే ప్రజలు పగిలిన డకు చెందిన బాధితుల్ని దయానురాగాలతో ఆదరించారు. “అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టి మమ్మును ఆదరించిరి” అంటూ లూకా రాస్తున్నాడు. ఇతరులకు సహాయం చెయ్యటంలో పౌలు క్రియాశీల పాత్ర పోషించాడు. “మో పెడు పుల్లలేరి నిప్పు మీద” వేశాడు. అప్పుడు ఒక విషసర్పం “కాకకు బయటికి వచ్చి అతని చెయ్యిపట్టెను.” చూసేవారు భయపడ్డారు. తనకున్న సంకెళ్లను బట్టి పౌలు ఖైదీ అని గ్రహించి వారు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు, “నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమతనిని బ్రదుకునియ్యదు.” కాని పౌలు దాన్ని విదల్చగా అది మంటలో పడికాలిపోయింది. పౌలుకి హాని కలగలేదు. అది విష సర్పమని ఎరిగిన ఆ ప్రజలు అతడు ఏ నిమిషమైనా బాధతో నేలకొరుగుతాడని కనిపెట్టారు. “చాల సేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని - ఇతడొక దేవత అని చెప్పసాగిరి.” AATel 317.3

ఆ ఓడ ప్రయాణికులు మెలితిలో ఉన్న మూడు నెలలూ పౌలు అతని సహ సువార్త సేవకులు సువార్త ప్రకటించటానికి ఆ తరుణాన్ని వినియోగించుకున్నారు. వారి ద్వారా ప్రభువు అద్భుతంగా పనిచేశాడు. పగిలిన ఓడ బాధితుల్ని వారు పౌలుని బట్టి దయతో ఆదరించాడు. వారికే లోటు లేకుండా చూశారు. మెలితే నుంచి వెళ్ళిపోయేటప్పుడు వారికి ఓడ ప్రయాణంలో అవసరమైనవన్నీ సమకూర్చి పంపారు. అక్కడ వారున్న కాలంలో చోటుచేసుకున్న ప్రధాన ఘటనల్ని లూకా ఇలా క్లుప్తంగా వివరిస్తున్నాడు: AATel 318.1

“పొస్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. అప్పుడు పొస్లియొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొనియుండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థనచేసి, అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాదచేసి, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి.” AATel 318.2