మహా సంఘర్షణ
మహా సంఘర్షణ
గ్రంథ పరిచయం
లోకంలో పాపం ప్రవేశించకముందు ఆదాము తన సృష్టి కర్తతో స్వేచ్ఛా సహవాస సాంగత్యాల్ని అనుభవించాడు. అయితే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరమయ్యాడు. మానవ జాతి ఇలా విశేషాధిక్యతకు దూరమయ్యింది. కాగా విమోచన ప్రణాళిక వల్ల లోకవాసులు పరలోకంతో సంబంధం కలిగి ఉండేందుకు ఒక మార్గం ఏర్పడింది. తన ఆత్మమూలంగా దేవుడు మానవులతో మాట్లా డాడు. తాను ఎంపిక చేసుకొన్న తన సేవకుల ద్వారా దేవుడు తన దివ్యవర్తమానాన్ని లోకానికి అందించాడు. “మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” 2 పేతురు 1:21. GCTel .0
మానవ చరిత్రలోని మొదటి 2500 సంవత్సర కాలంలోను రాతపూర్వకమైన వెల్లడి లేదు. దేవుని ఉపదేశాన్ని అందుకొన్న వారు తాము తెలుసుకొన్నది ఇతరులకు అందించే వారు. ఉపదేశం తరం నుంచి తరానికి తండ్రి నుంచి కుమారుడికి సంక్రమించేది. వాక్యం రాత రూపం ధరించటానికి అవసరమైన ఏర్పాట్లు మోషే కాలంలో జరిగాయి. ఆవేశంతో నిండిన దైవొక్తులు ఒక ఆవేశపూరిత గ్రంథంగా కూర్పు పొందటం జరిగింది. అప్పుడే. ఈ గ్రంథం కూర్పు 1600 సంవత్సరాల సుదీర్ఘ కాలం సాగింది. సృష్టి చరిత్రకారుడు, ధర్మశాస్త్ర రచయిత అయిన మోషే నుంచి, సువార్తలోని మిక్కిలి గంభీర సత్యాల లేఖకుడైన యోహాను వరకు ఈ కూర్పు ప్రక్రియ సాగింది. GCTel .0
తన మూలం దేవుడే అని బైబిలు తెలుపుతున్నది. అయినా దాని రచన మానవుల ద్వారా జరిగింది. అందులోని వివిధ పుస్తకాల రచనా శైలి అనేక రచయితల గుణశీలాలను బయలుపర్చుతుంది. ప్రకటితమైన సత్యాలు “దైవావేశము వలన కలిగినవే ”(2 తిమోతి 3:16). కాకపోతే అవి మనుషుల మాటలలో వ్యక్తం అవుతున్నాయి. అనంత జ్ఞాని అయిన దేవుడు తన పరిశుద్ధాత్మ వలన తన సేవకుల మనసులను వెలుగుతో నింపాడు. వారికి కలలు, దర్శనాలు, చిహ్నాలు, ఛాయారూపాలు ఇచ్చాడు. ఇలా ప్రకటితమైన సత్యాన్ని అందుకొన్న వారు దాని భావాన్ని మానవ భాషలో లిఖించారు. GCTel .0
పది ఆజ్ఞలను దేవుడే పలికి తన స్వహస్తంతో రాశాడు. ఆజ్ఞలు దేవుడు కూర్చినవి. అవి మానవుడి కూర్పుకాదు. మానవ భాషలో వున్న దైవ సత్యాలే GCTel .0
బైబిలు. అది దైవ మానవ సంయుక్త కృషిని సూచిస్తున్నది. దైవ కుమారుడు మానవ కుమారుడు అయిన క్రీస్తు స్వభావంలో ఇలాంటి సంయోగమే కనిపిస్తుంది. క్రీస్తు విషయంలోలాగే బైబిలు విషయంలోనూ “ఆ వాక్యము శరీరధారియై... మన మధ్య నివసించెను” అన్నది వాస్తవం. యోహాను 1:14. GCTel .0
సాంఘిక స్థాయిలో, వృత్తిలో, మానసిక, ఆధ్యాత్మిక సమర్ధతలలో ఎన్నో వ్యత్యాసాలు గల వ్యక్తులు వేర్వేరు యుగాలలో బైబిలులోని పుస్తకాల రచించారు. ఈ పుస్తకాల రచనాశైలిలో బైలుపర్చబడ్డ అంశాల వైవిధ్యంలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఆయా రచయితలు, ఆయా తీరులలో భాషను ఉపయోగించారు. ఒకే సత్యాన్ని ఒక రచయిత కన్న ఇంకో రచయిత మనోరంజకంగా వ్యక్తీకరించటం జరిగేది. అనేకమంది రచయితలు ఒక అంశంపై ఆయా సమయ సందర్భాలలో రాయగా, భక్తి భావం, సదాలోచన, నిర్మల దృష్టి గల విధ్యార్ధికి అందులో కనిపించే ఏకత్వం, పొందిక, దురభిమానంతో నిండిన అప్రవుతుడైన ఆషావూషీ పాఠకుడికి పొంతనలేనట్లు, విరుద్ధంగా వున్నట్లు కనిపించవచ్చు. GCTel .0
వివిధ వ్యక్తుల మూలంగా బహిర్గతమయ్యే సత్యం వివిధ రూపాల్లో బయలుపడుంది. ఒక అంశంలో ఒక భాగం ఒక రచయితను బలంగా ఆకర్షించవచ్చు. తన అనుభవానికి, అవగాహన చేసుకొని అభినందించ టానికి తనకున్న సామర్థ్యానికి అనువైన విషయాలను అతడు గ్రహిస్తాడు. ఇంకొక రచయిత వేరొక భాగాన్ని తీసుకొంటాడు. పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కింద ఇలా ప్రతివారు తమతము మనసులపై బలీయంగా ముద్రపడ్డ విషయాన్ని వ్యక్తం చేస్తారు. ఒక్కొక్కరికి సత్యంలోని ఒక భాగం, అయినా మొత్తంలోని ఏకత్వం, సమన్వయత ఇలా బహిర్గతమైన సత్యాలు అన్నీ కలిసి ఒక పరిపూర్ణమైన మొత్తమై అన్ని పరిస్థితులకు అనుభవాలకు మనుషుల అవ సరాలను తీర్చటానికి సిద్ధంగా ఉండారు. GCTel .0
తన సత్యాన్ని మానవుల ద్వారా లోకానికి ప్రకటించాలన్నది దేవుని ఆకాంక్ష. అందుకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మానవులకు అర్హతలు, సమర్ధతలు ఇచ్చారు. ఈ సేవ చేయటానికి వారికి శక్తి నిచ్చాడు. ఏమి GCTel .0
మాట్లాడాలి, ఏమి రాయాలి అన్న విషయమై ఆలోచనలు పుట్టించేది ఆయనే. ఈ ఐశ్వర్యం వుంటి ఘటాలకు అప్పగించటం జరిగింది. అయినా ఇది పరలోకం నుంచి వచ్చిందే. ఈ సాక్ష్యం లోపాలతో నిండిన మానవ భాష ద్వారా ప్రకటితవనౌతున్నది. అయినా ఇది దేవుని సాక్ష్యం . విశ్వసించి విధేయుడయ్యే దేవుని బిడ్డకు ఇందులో కృపాసత్య సంపూర్ణమైన దైవ శక్తి ప్రభావం కనిపిస్తుంది. GCTel .0
మానవుల రక్షణకు అవసరమైన జ్ఞానాన్ని దేవుడు తన వాక్యంలో గుప్తపర్చాడు. పరిశుద్ధ లేఖనాలు దేవుని చిత్తం గురించి అధికారికంగా నిర్దుష్టంగా వెలువడ్డ ప్రకటన అని మనం అంగీకరించాలి. ప్రవర్తనకు గీటురాయి, సిద్ధాంతాలకు సూచిక, అనుభవానికి పరీక్ష లేఖనాలే. “దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై యున్నది.” 2తిమోతి 3:16, 17. GCTel .0
దేవుడు తన చిత్తాన్ని తన వాక్యం ద్వారా మనకు బయలుపర్చాడన్న వాస్తవం పరిశుద్ధాత్మ సన్నిధిని, పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని రద్దు పర్చదు. చెప్పాలంటే, తన సేవకులకు వాక్యాన్ని విపులపర్చటానికి, వాక్యబోధనతో వారిని చైతన్య పర్చటానికి ఆత్మను పంపుతానని రక్షకుడు వాగ్దానం చేశాడు. బైబిలును ఆవేశపూరితం చేసింది దేవుని ఆత్మేగనుక ఆత్మ బోధించేది వాక్యానికి విరుద్ధంగా ఉండ టం అసాధ్యం . GCTel .0
బైబిలును రద్దుచేయటానికి ఆత్మను ఇవ్వలేదు దేవుడు. అందుకు కానే కాదు. ఎందుకంటే దైవవాక్యం సమస్త ఉపదేశానికి, అనుభవానికి ప్రామాణికమని లేఖనాలు స్పష్టంగా బోధిస్తున్నాయి. అపోస్తలుడు యోహాను అంటున్నది వినండి “ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి”1 యోహాను 4:1. “ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్యప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు” హెచ్చరిస్తున్నాడు. యెషయా 8:20. GCTel .0
తమకు ఆత్మ జ్ఞానం ఉన్నదని దైవవాక్య మార్గదర్శకత్వం తమకు ఇక అవసరం లేదని చెప్పే ఒక తరగతి ప్రజల తప్పులవల్ల పరిశుద్దాత్మ చేస్తున్న పని తీవ్ర అప్రతిష్ఠకు గురి అవుతున్నది. వారు కొన్ని అభిప్రాయాల ప్రాబల్యానికి గురిఅయి అవే తమ ఆత్మలో దేవుడు చేస్తున్న పని అని భ్రమపడ్డారు. అయితే వారిని నియంత్రించేది దేవుని ఆత్మ కాదు. లేఖనాలను నిర్లక్ష్యం చేసి ఇలాంటి అభిప్రాయాన్ని అనుసరించటం, గందరగోళంలో పడి, మోసంలో కూరుకు పోయి, నాశనమువటానికి దారితీస్తుంది. ఇది సాతాను కుయుక్తులు కుతంత్రాలకు ఊతమిస్తుంది. పరిశుద్ధాత్మ పరిచర్య క్రీస్తు సంఘానికి ఎంతో ప్రాముఖ్యం. అందుచేత అతివాదులు, మత ఛాందసుల పొరపాట్లు ఆధారంగా పరిశుద్దాత్మ పరిచర్యపట్ల దైవ ప్రజలలో ద్వేషం పుట్టించి స్వయంగా దేవుడే ఏర్పాటు చేసిన ఈ అపార పరిశుద్దాత్మ శక్తి వనరును నిర్లక్ష్యం చేసేందుకు వారిని మోసగించటం సాతాను కుతంత్రాలలో ఒకటి. GCTel .0
సువార్త కాలం పొడుగునా దైవాత్మ పరిచర్య కొనసాగవలసి వున్నది. ఇది దైవ వాక్యం సెలవిస్తున్న మాట. పరిశుద్ధాత్మ ద్వారా పాత నిబంధన, కొత్త నిబంధనలను ఇచ్చిన యుగాలలో వ్యక్తిగత మనస్సులకు వెలుగును అనుగ్రహించటం దేవుడు ఆపలేదు. పరిశుద్ధ గ్రంధములో భాగం కావటానికి ఆయన ఇచ్చిన ప్రత్యక్షతలకు అది అదనంగా ఇచ్చిన వెలుగు. లేఖనాలు ఇవ్వటంతో ఎలాంటి సంబంధమూ లేని విషయాలపై ప్రజలు పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిక, గద్దింపు, హితవు ఉపదేశం అందుకొన్నట్లు బైబిలే వ్యక్తీకరిస్తున్నది. ఆయా యుగాలలోని ప్రవక్తల ప్రస్తావనా ఉన్నది. కాని వారి ప్రవచనాల దాఖలాలులేవు. లేఖనాల సంకలనం పూర్తి అయిన తర్వాత కూడా అదే విధంగా పరిశుద్ధాత్మ దైవ ప్రజలను చైతన్య పర్చటం, హెచ్చరించటం, ఓదార్చటం అన్న తన సేవను కొనసాగించవలసి ఉన్నాడు. GCTel .0
తన శిష్యులకు యేసు ఈ వాగ్దానం చేశాడు. “ఆదరణ కర్త, అనగా తండ్రి నా నావుమున పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకము చేయును.” “అయితే ఆయన అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన సంభవింపబోవు సంగతులను GCTel .0
మీకు తెలియజేయును” యోహాను 14:26;16:13. అపోస్తలుల దినాలకే పరిమితం కాకుండా అన్ని యుగాలలోని క్రీస్తు సంఘానికి ఈ వాగ్దానాలు వర్తిస్తాయని లేఖనం స్పష్టంగా బోధిస్తున్నది. ” ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను” అంటూ తన శిష్యులకు హామీ ఇస్తున్నాడు రక్షకుడు. మత్తయి 28:20. “మనమందరము విశ్వాసము విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోను ఏకత్వము పొంది, సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు...పరిశుదులు సంపూరు లగునటు క్రీస్తు శరీరము క్షేమాభివృది చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, పరిశుద్దాత్మ వరాలూ, పరిశుద్దాత్మ ప్రత్యక్షతలూ సంఘంలో ఏర్పాటయ్యాయని పౌలు తెలుపుతున్నాడు.” ఎఫెసీయులకు 4:12,13. GCTel .0
ఎఫెసులో ఉన్న విశ్వాసుల కోసం అపొస్తలుడిలా ప్రార్థించాడు, “ మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో పరిశుదులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్య మెట్టిదో, ఆయన క్రీస్తు నందు వినియోగపరచిన బలాతిశయ మును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్య మెట్టిదో మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్ధనయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.” ఎఫెసీయులకు 1:17-19. ఎఫెసు సంఘం విషయంలో పౌలు ఆశించిన దీవెన ఏమిటంటే వారు దైవగ్రంథంలోని గంభీర సత్యాలను అవగాహన చేసుకొనేందుకు పరిశుద్దాత్మ వారి మనసులు తెరిచి వారికి జ్ఞానోదయం కలిగించటమున్నది. GCTel .0
పెంతెకొస్తునాడు ఆశ్చర్యకరమైన ఆ పరిశుద్దాత్మ ప్రత్యక్షత అనంతరం తము పాపాల నిమిత్తం పశ్చాత్తాప పడి క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిందిగా ప్రజలను పేతురు హెచ్చరించాడు. పేతురిలా అన్నాడు GCTel .0
“మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్దాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి కందరికిని చెందును” అపొ. 2:38, 39. GCTel .0
దేవుని మహాదిన దృశ్యాల సందర్భంగా ఆత్మ ప్రత్యేక ప్రత్యక్షతను యోవేలు ప్రవక్త ద్వారా ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. యోవేలు 2:28 పెంతెకొస్తు దినాన ఈ ప్రవచనం పాక్షికంగా నెరవేరింది. సువార్త సేవ చివరి కాలంలో ప్రదర్శితం కానున్న దైవకృపావరం ప్రత్యక్షతతో ఇది పూర్తిగా నెరవేరుతుంది. GCTel .0
మంచి చెడుల మధ్య మహా సంఘర్షణ లోకం అంతం వరకు ఉదృతమౌతూనే ఉంటుంది. అన్ని యుగాలలో క్రీస్తు సంఘంపై సాతాను ఆగ్రహం బహిర్గతమవుతూనే వుంది. తన ప్రజలు ఈ దుష్టశక్తిని ఎదిరించి నిలబడేందుకు వారిని బలోపేతుల్ని చేయటానికి తన కృపను ఆత్మను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. సువార్తను లోకానికి చాటించి తమ కార్యాలను భావితరాల ప్రజలకు రాసి ఉంచాల్సి వచ్చినప్పుడు అపోస్తలులు ప్రత్యేక పరిశుద్దాత్మ వికాసం పొందారు. కాగా సంఘం అంతివు విమోచనను సమీపించే కొద్దీ మరింత శక్తి కూడగట్టుకుని సాతాను కృషి చేస్తాడు. “తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై ” అతడు దిగివస్తాడు. ప్రకటన 12:12. “నానావిధములైన సూచక క్రియలతోను, మహాత్కార్యములతోను” వస్తాడు. 2 థెస్స. ఒకప్పుడు దేవదూతలందరిలో అత్యున్నత స్థాయిలో ఉన్నమోసగాడు. ఆరువేల సంవత్సరాలుగా మోసగించటంలో, నాశనం చేయటంలో తల మునకలై ఉన్నాడు. యుగాలకొద్దీ సాగుతున్న సంఘర్షణల్లో తాను సంపాదించుకొన్న విధ్వంసక నైపుణ్యాన్ని, క్రూరత్వాన్ని తన చివరి పోరాటంలో దైవ ప్రజలపై ప్రయోగిస్తాడు. అపాయంతో నిండిన ఈ దినాలలో యేసు రెండోరాకను గూర్చిన హెచ్చరికను క్రీస్తు అనుచరులు లోకానికి అందించవలసి ఉంది. యేసు వచ్చే తరుణంలో GCTel .0
“నిష్కళంకులుగాను, నిందా రహితులుగాను” ఆయన ముందు నిలబడేందుకు ఒక జనాంగం సిద్ధపడాల్సి వున్నది. 2 పేతురు 3:14. అపోస్తలుల దినాల్లో సంఘానికి అగత్యమైన దైవకృప, శక్తి సంఘానికి ఈ కాలంలో ఏమాత్రం తీసిపోని రీతులలో అవసరమవుతుంది. GCTel .0
మంచి చెడుల మధ్య దీర్ఘకాలంగా సాగుతున్న సంఘర్షణ దృశ్యాలు పరిశుద్దాత్మ ప్రభావం వల్ల ఈ గ్రంధ రచయితకు ప్రదర్శితమయ్యాయి. జీవ నాధుడు, రక్షణకర్త అయిన క్రీస్తుకు పాపానికి దుర్నీతికి కర్త,ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన మొదటి పాపి అయిన సాతానుకి మధ్య యుగయుగాలుగా జరుగుతున్న సంఘర్షణను అప్పుడప్పుడు వీక్షించ బానికి నాకు అనుమతి లభించింది. తనకు క్రీస్తు ఎడల ఉన్న కక్షను సాతాను క్రీస్తు అనుచరుల పట్ల కన పర్చుతున్నాడు. ధర్మశాస్త్ర సూత్రాల పరంగా అదే విద్వేషం, మోసగించటంలో అదే విధానం చరిత్ర పొడుగున కానవస్తున్నది. తప్పును సత్యంగా కనపర్చటం, ధర్మశాస్త్రానికి ప్రత్యామ్నా యంగా మానవ నిబంధనలను నిలపటం , సృష్టికర్తను మానివేసి సృష్టాన్ని పూజించటానికి ప్రజల్ని తప్పు దారి పట్టించటం ఇవన్నీ ఈ మోస పూరిత విధానం వల్ల జరుగుతున్న పనులే. దేవుని ప్రవర్తనపై దుష్ప్రచారం చేయటానికి, సృష్టికర్త గురించి మనుషులకు తప్పుడు అభిప్రాయం కలిగించి తన్మూలంగా ఆయన పై వారికి ప్రేము లేకుండా చేసి ఆయన పట్ల భయం, ద్వేషం వారు పెంచుకునేటట్లు చేయటానికి, ధర్మశాస్త్రాన్ని విసర్జించి తద్వారా ధర్మశాస్త్ర విధులను ఆచరించాల్సిన పని లేదని భావించేందుకు ప్రజల్ని అపమార్గం పట్టించటానికి, తన మోసాల్ని ఎదిరించే వారిని హింసించటానికి సాతాను చేసిన ప్రయత్నాలు అన్నియుగాల్లోనూ అమలయ్యాయి. పితరులు, ప్రవక్తలు, అపోస్తలులు, సంస్కర్తల చరిత్రలో కూడా అవి చోటుచేసుకొని ఉండవచ్చు. GCTel .0
గడచిన యుగాలన్నింటిలో ఏ లక్ష్యంతో తాను పని చేశాడో, చివరి మహా సంఘర్షణలో అదే లక్ష్యసాధనకు, అదే విదానాన్ననుసరిస్తూ, అదే స్వభావాన్ని ప్రదర్శిస్తూ సాతాను కృషి చేస్తాడు. సంఘర్షణ గతంలో ఏలా సాగిందో GCTel .0
భవిష్యత్తులోనూ అలాగే సాగుతుంది. కాకపోతే భవిషత్ లోని సంఘర్షణ లోకం ముందెన్నడు కనివిని ఎరుగనంత ఉద్భతంగా ఉంటుంది. సాతాను మోసాలు సుతిమెత్తగా, సున్నితంగా ఉంటాయి. అతడి దాడులు మరింత దృఢంగా ఉంటాయి. సాధ్యమైతే, ఎన్నికయినవారిని సైతం అతడు తన దారి పట్టిస్తాడు. మార్కు 13:22, రివైజ్డ్ వర్షన్. GCTel .0
దైవ వాక్యంలోని మహాత్తర సత్యాలకు, గతంలోని భవిషత్తులోని దృశ్యాలకు నా మునోనే త్రం తెరచి నాకు ప్రత్యక్ష పర్చిన వాటిని ఇతరులకు తెలియపరుచుముని పరిశుద్దాత్మ నన్ను ఆదేశించాడు. గతించిన యుగాల్లో జరిగిన సంఘర్షణ చరిత్రను, ప్రత్యేకించి సమీప భవిష్యత్తులో సంభవించనున్న పోరాటాన్ని గూర్చిన సత్యాన్ని ప్రకటించుమని ఆయన ఆదేశించాడు. ఈ కార్యాచరణ దీక్షతో సంఘ చరిత్రను సంఘటనలను ఎంపికచేసి వర్గీకరించటానికి ప్రయత్నించాను. వివిధ కాలాల్లో లోకానికి వచ్చిన, సాతాను ఆగ్రహాన్ని, లోకాన్ని ప్రేమించే సంఘస్తుల వ్యతిరేకతను రేపిన, మరణం వరకు తమ జీవితాన్ని ప్రేమించని ” సాక్షులు కాపాడుకొన్న గంభీర సత్యాల విశదీకరణకు అనుకూలంగా ఈ వర్గీకరణ జరిగింది. GCTel .0
మన ముందున్న సంఘర్షణను గూర్చిన హెచ్చరిక ఈ దాఖలాల్లో మనకు కనిపిస్తుంది. దైవ వాక్యం వెలుగులోను, దైవాత్మ ప్రకాశతలోను పరిశీలిస్తే దుష్టుడైన సాతాను కుతంత్రాలను కనుగోగలుగుతాం. ప్రభువురాకకు ముందు “నిందారహితులుగా” కనబడే వారు విసర్జించాల్సిన ప్రమాదకర విషయాలు గ్రహించగలుగుతాం. GCTel .0
గత యుగాల్లో సంస్కరణ పురోగతికి తోడ్పడ్డ సంఘటనలు చరిత్రకెక్కి ప్రొటస్టాంటు ప్రపంచంలో ఖ్యాతిని గుర్తింపును పొందాయి. అవి ఎవ్వరూ కాదనలేని వాస్తవాలు. పుస్తక పరిమితులు సంక్షిప్తత ఆవశ్యకత దృష్టిలో ఉంచుకొని ఈ చరిత్రను సంక్షిప్తంగా పాఠకుల ముందు ఉంచుతున్నాను. విషయాన్ని సరిగా అర్ధం చేసుకొని జీవితంలో ఉపయోగించుకునేందుకు అవసరమైన వాస్తవాలను క్లుప్తంగా తక్కువ స్థలంలో సమకూర్చాను. విషయంపై సమగ్ర అవగాహన కలిగించే ఉద్దేశంతో ఒక చరిత్రకారుడు సంఘటనల్ని వర్గీకరించిన కొన్ని సందర్భాలలో లేక సౌలభ్యం కోసం వివరాలను GCTel .0
సంగ్రహ పర్చిన సందర్భాలలో అతడి మాటలను ఉటంకించటం జరిగింది. అయితే బహుకొద్ది సందర్భాలలో తప్ప వాటికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వటం జరగలేదు. కారణమేముంటే ఆ మాటలు ఉటంకించింది ఆ రచయితను ప్రామాణికంగా ఉల్లేఖించేందుకు కాదు. ఆ విషయాన్ని శక్తిమంతంగా వివరిస్తున్నందుకు మన కాలంలో సంఘర్షణ కృషిని కొనసాగిస్తున్న వారి అనుభవాలు, భావాల ప్రచురణ విషయంలో కూడా ఇలాంటి పనే అప్పు డప్పుడూ జరుగుతున్నది. GCTel .0
గడచిన సంవత్సరాల్లోని పోరాటాలు శ్రమల గురించి నూతన సత్యాలు అందించటం ఈ పుస్తకం ఉద్దేశ్యం అంత గా కాదు. కాని భవిషతులో సంభవించబోతున్న సంఘటనలను గూర్చిన వాస్తవాలను సూత్రాలను బహిర్గతం చేయటమే దీని లక్ష్యం. అయినా వెలుగుకు, అంధ కార శక్తులకు మధ్య సాగుతున్న సంఘర్షణలో భాగంగా పరిగణించినప్పుడు గతానికి సంబంధించిన ఈ దాఖలాలు నూతన ప్రాముఖ్యాన్ని సంతరించు కొంటున్నట్లు కనిపిస్తుంది. ఈ దాఖలాలు చీకటిగా ఉన్న భవిషతులో వెలుగు విరజిమ్ముతాయి. క్రిందటి యుగాల్లోని సంస్కర్తలా తమ మాన ప్రాణాల్ని పణంగా పెట్టి “దేవుని వాక్యం గురించి యేసును గూర్చిన సాక్ష్యం గురించి ” ప్రకటించే భక్తుల మార్గాన్ని వెలుగుతో నింపుతాయి. GCTel .0
ఈ పుస్తకం ముఖ్యోద్దేశ్యం- సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ దృశ్యాలను బట్టబయలుచేయటం; సాతాను కుయుక్తులను బహిరంగ పర్చి వాటిని ప్రతిఘటించటానికి మార్గాలు సూచించటం; మానవులతో దేవుడు వ్యవహరించే తీరులో ఆయన న్యాయశీలత, దయాళుత్వం వ్యక్తమయ్యే విధంగా పాప సమస్యకు తృప్తికరమైన పరిష్కారం సూచించటం; ఎన్నడూ మారని దైవ ధర్మశాస్త్ర స్వభావాన్ని బయలు పర్చటం. GCTel .0
- ఎలెన్ జి. వైట్ GCTel .0