అంత్యకాల సంఘటనలు

15/21

14 అధ్యాయము — గంభీరమైన కేక

దేవునికి అన్ని సంపూలలో ఆణిమత్యాలు ఉన్నాయి మరియు ప్రసిద్ధమైన మత పరమైన ప్రపంచాన్ని బహిరంగంగా మనము ఉల్లంఘించే ప్రకటనలు చేయకూడదు. - దిఎస్ డి ఎబైబిల్ కామెంటరీ 4: 1184 (1893). LDETel 138.1

దేవునికి అన్ని సంఘలలో ఆయనకు ప్రతినిదులున్నారు. ఈ విశ్వాసులకు కడవరి దినాలలో సత్యము విషయములో ప్రత్యేకమైన పరీక్ష ఉండదు, వారు ఆయ పరిస్థితులలో హృదయమందు మరియు మనస్సు నందు విశ్వాసం వుచ్చియునారు, కాబట్టి వారు సత్యమును బట్టి తిరస్కరించబడరు, దేవునితో తమకున్న సంబందం వేరు చేయలేదు. -సంఘమునకు ఉపదేశములు 6:70, 71 (1900). LDETel 138.2

ఇంకా చెప్పలంటే ప్రకటన 18వ అధ్యాయములో బబులోను నుంచి దేవుని ప్రజలు బయటకు రావలసిందిగా పిలుపు వున్నది. ఈ లేఖనం ప్రకారం దేవుని ప్రజల్లో అనేక మంది ఇంకా బబులోనులో ఉండాలి, క్రీస్తు అనుచరులలో అధికశాతం ఇప్పుడు ఏ సంపూల్లో ఉంటారు? నిస్సహందేహంగా ప్రోటస్టాంట్ విశ్వాసాన్ని అనుసరిస్తున్న ఆయా సంపూలలోనే వుంటారు. మహా సంఘర్షణ, 383 (1911) LDETel 138.3

బబులోను బాగమైన సంపూన్ని ఆధ్యాత్మిక అందికారం అలుముకొన్న, అవి దేవుని నుంచి దూరంగా వెళ్లిపోయినా ఆ సంపూలలో క్రీస్తును యాదార్ధంగా నమ్మిన అనుచరు లెందరో వున్నారు. మహా సంఘర్షణ,390 (1911) LDETel 138.4

బబులోను పతనం ఇంకా పూర్తి కలెదు మహోద్రేకముతో కూడిన తన వ్యబిచార మద్యమును సమస్త జనులకు త్రాగించెను (ప్రకటన 14: 6-8). ఇది ఎలా జరుగుతుంది? ప్రజలను కపటమైన విశ్రాంతి దినాన్ని అంగీకరించమని ఒత్తిడి చేయుట వలన బలవంతముగా వచ్చెను. సంఘమునకు ఉపదేశములు. 8:94 (1904). LDETel 138.5

అయితే ఆ పతనం సంపూర్తికాలేదు. ఆనాటి ప్రత్యేకత సత్యాలను తిరస్కరిస్తూపోగా వారి నైతిక స్థితి నానాటికి ది జారిపోయినది. తన వ్యబిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన మహా బబులోను కూలిపోయెను.....ఈ పరిస్థితి వచ్చు వరకు, క్రైస్తవ లోకమంతతా సంఘము లోకం మద్య సంపూర్ణ ఐక్యత ఏర్పడే వరకు బబులోను కూలటం పూర్తికాదు. ఇది క్రమక్రమంగా చోటుచేసుకొనే మార్పు. ప్రకటన 14:8 నెరవేర్చు భవిష్యత్తులో జరిగే సంభవం. మహా సంఘర్షణ, 389, 390 (1911). LDETel 138.6

ఆమె పాపాలు ఎప్పుడు పరలోకానికి చేరతాయి [ప్రకటన18: 2-5]? శాసనం ద్వారా దేవుని చట్టం శాశ్వతంగా రద్దుచేయబడినప్పుడు.. సైన్స్ ఆప్ టైమ్స్, జూన్ 12,1893. LDETel 138.7

దేవుని చివరి హెచ్చరిక సందేశం

ప్రకటన గ్రంథం 14 అధ్యాయములో దేవుడు వర్తమానములు ఇచ్చెను. వారి ప్రవచన ప్రకారము వారి స్థానమువుంది మరియు వారి పని ఈ భూమి యొక్క చరిత్ర ముగిసే వరకు నిలిపివేయకూడదు.-ఇ జిడ్లు, 88 804 (1890). LDETel 139.1

ప్రకటన 14: 6-12,లోని హెచ్చరికను తిరస్కరించిన పలితముగా రెండో దూత ప్రవచించిన పరిస్థితి సంఘం చేరుకొంటుంది. ఆ సమయాన్ని ప్రకటన 18 అధ్యయం సూచిస్తుంది. ఇంకా బబులోనులోనే ఉన్న దైవ ప్రజలకు దాని సహవాసం విడిచి రావలసిందిగా పిలుపు వస్తుంది. లోకానికి వచ్చే చివరి వర్తమానం ఇదే.. మహా సంఘర్షణ 390 (1911). LDETel 139.2

ప్రకటన 16,1,2,4 బబులోను కూలటం గురించి ప్రకటన 13,8లో రెండో దూత ప్రకటన మొదటిగా 1884 గ్రీష్మ కాలంలో వెలివడినప్పటినుంచి బబులోనుగా మారిన వివిధ వ్యవస్థలు సంస్థల దుష్కృతాల్ని అదనంగా పేర్కొంటు మళ్లి ఇదే ప్రకటన భవిష్యత్తులో జరగవలసి ఉన్న కాలాల్ని ఈ లేఖనం సూచిస్తుంది...... దూత వర్తమానం నా ప్రజలారా ..... దానిని విడిచి రండి, అన్న పిలుపునిస్తుంది , ఈ వర్తమానం మూడో దూత వర్తమానం కలసి లోక ప్రజలకు చివరి హెచ్చరికగా వస్తున్నాయి.... బబులోను పాపాల్ని బహిర్గతం చేస్తారు. ప్రభుత్వధికారముతో సంఘాచారాల్ని అమలుపర్చుటవలన కలిగే దుష్పరిణామాల్ని, చూతమత విజృంభణను వేగం పుంజకొంటున్న పోపుమత వ్యాప్తిని బట్టబయలు చేయుడం జరుగుతుంది. ఈ గంబీర హెచ్చరికలు ప్రజలకు కనువిప్పు కలిగిస్తాయి. వేవేల ప్రజలు ఇంతకు ముందు వినిపించిని ఈ మాటలు వింటారు. దేవుడు పంపిన సత్యన్ని నిరకరించినందుకు తన అపరాదాలు పాపాలు కారణంగా కూలిన బబులోను ఎవరో కాదు సంఘమేనన్న సాక్ష్యాన్ని వారు విని విస్మయముతో వింటారు.మహా సంఘర్షణ 603, 604, 606 (1911). LDETel 139.3

దేవుని చివరి హృదయ సందేశం

విశ్వాసం ద్వారా న్యాయవంతుడుగా తీర్చబడే సందేశమే త్రిదూతవర్తమానం, అని ప్రశ్నించి ఎందరో నాకు వ్రాసియున్నారు, అప్పుడు నేను ఇది యదార్ధమైన మూడవ దూత సందేశమే” అని చెప్పాను.- సెలెక్ట్డ్ మెసెజన్స్ 372 (1890). LDETel 139.4

దేవుడు ఆయన కృపా సన్నిది నుండి [ఇ.జే.] వెగనార్ మరియు [ఎ. టి.] జోన్స్ గారు ద్వారా అత్యంత విలువైన ప్రజలకు సందేశం పంపించేను.ఈ లోక పాపముల కొరకై త్యాగము చేసిన రక్షకుడైన క్రీస్తుని ఉన్నతముగా హెచ్చించుటకు ప్రపంచానికి ఈ సందేశం చాల ప్రాముఖ్యముగా ముందుకు తీసుకోని రాబడియుంది. ఇది విశ్వాసం ద్వారా న్యాయమంతులుగా తీర్చబడుట అనేది వాస్తవమే, ఎందరో యేసుని గూర్చిన సత్యము కోల్పోయారు వారు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుటలో క్రీస్తు నీతిని బయలుపర్చుచున్నది కాబట్టి సర్వజలను అది ఆహ్వానించుచున్నది. ఆయన దైవిక వ్యక్తిత్వాన్ని అతని గుణము మరియు మానవ కుటుంబానికి అతని మార్పులేని ప్రేమను గుర్తించుటకు వారి కళ్లు తెరిచి చూడవలసియుంది. సర్వశక్తి ఆయన చేతుల్లోకి అప్పగించబడియుంది, కాబట్టి ఆయన గొప్ప బహుమతులను మనుష్యులుకు సిద్ధము చేయును, తన సొంత నీతి యొక్క అమూల్యమైన బహుమతిని నిస్సహాయ మానవ ప్రతినిదులకు అందించును. ఈ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన సందేశం ఆదే. మూడవ దూత వర్తమానము. ఇది ఒక గంభీరమైన స్వరముతో ప్రకటించబడాలి మరియు ఎంతో గొప్పగా ఆయన పరిశుద్దాత్మ కుమ్మరింపు ద్వారా మనలను దర్శించును. 91, 92 (1895). టెస్టమోనీస్ టూ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్. 91, 92(1895). LDETel 139.5

ప్రభువు యొక్క మార్గం సిద్ధముచేయటకు క్రీస్తు నీతి సందేశం అది భూమి యొక్క ఈ చివర నుండి ఆచివరి వరకు అది ద్వనించును. ఇది దేవుని మహిమ, ఇది మూడవ దూత పనిని ముగించును. సంఘమునకు ఉపదేశములు 6:19 (1900) LDETel 140.1

అయన ప్రేమపూరిత ప్రవర్తన వెల్లడే కృప తాలూకు వెలుగు చివరి కిరణాలు లోకానికి అందించాల్సిన చివరి కృపా వర్తమానం. దేవుని ప్రజలు ఆయన మహిమను ప్రదర్పంచాల్సి ఉన్నారు. దేవుని కృప తమలో కలిగించిన మార్పును వారు తమ జీవితంలోను నడవడిలోను కనపరచాలి. క్రీస్తు ఉపమాన ప్రబోధాలు.415, 416 (1900). LDETel 140.2

గొప్ప శక్తితో సందేశం ప్రకటించబడుచున్నవి

మూడవ వర్తమానము చాల బిగ్గరగా కేక వేస్తుండగా, మరియు మహా శక్తి, మరియు మహిమ అంతిమ కార్యమునకు సమీపించగా, నమ్మకమైన దేవుని ప్రజలు ఆ మహిమలో పాల్గొంటారు. అదే కడవరి వర్షము ఇది ఉజ్జీవింపజేయును మరియు శ్రమల కాలములోనుంచి వెళ్లుటకు బలపరుచును.- ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 7: 984 (1862). LDETel 140.3

అంతం సమీపించినప్పుడు, దేవుని సేవకుల యొక్క సాక్ష్యాలు మరింత ఎక్కువ నిర్ణయాలు తీసుకునే విగాను మరియు మరింత శక్తివంతమైనవిగా ఉంటాయి.- సెలెక్ట్డ్ మెసేజ: 3: 407 (1892). [ప్రకటన గ్రంథం 14: 9-12] ఈ వర్తమానము ముందు జరగబోయే రెండు సందేశాలు కలుపుతుంది. ఇది ఒక గంబరమైన కేక అది పరిశుద్దాత్మ శక్తితో ప్రాతినిధ్యము వహిస్తుంది- ది ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 7: 980 (1900). LDETel 140.4

మూడవ వర్తమానము చాల గంభీరముగా కేక వేస్తుండగా, మరియు దాని ప్రకటనతో మహా శక్తి, మరియు మహిమకలుగును. దేవుని ప్రజల ముఖాలు పరలోక వెలుగుతో ప్రకాశిస్తాయి.- సంఘమునకు ఉపదేశములు7:17 (1902). LDETel 140.5

భూమి చివరి గొప్ప సంక్షోభం యొక్క లోతు నీడలు మధ్య, దేవుని వెలుగు ప్రకాశవంతముగా కాంతి నిచ్చెను మరియు నిరిక్షణ మరియు నమ్మకమైన పాట స్పష్టముగాను మరియు గంభీరముగాను వడికట్టునట్టు వినవచ్చు. ఎడ్యుకేషన్, 166 (1903). LDETel 141.1

ప్రకటన పద్దెనిమిదవ అధ్యాయం ముందే చెప్పినట్లుగా,మూడవ దూత వర్తమానం మృగానికిని మరియు దాని ప్రతిమకు వ్యతిరేకంగా చివరి హెచ్చరికను ఇచ్చిన వారి ద్వారా గొప్ప శక్తితో ప్రకటించబడవలసి ఉంది. -టెస్టిమోనియస్ ఫర్ ది చర్చ్ 8: 118 (1904). LDETel 141.2

1844 ఉద్యమం మాదిరిగానే

1844 నాటి ఉద్యమములో ప్రజలందరు గొప్ప శక్తితో ప్రేరేపించబడ్డారు మళ్లీ అటు వంటి ఉజ్జీవం బహిరగం అవుతుంది. మూడవ దూత సందేశం ముందుకు మెల్లగా కాదు గభీరమైన స్వరముతో సాగిపోతుంది. -సంఘమునకు ఉపదేశములు 5: 252 LDETel 141.3

ఈ సందేశం అర్ధరాత్రికేక కంటే అధికారం మరియు శక్తితో ముగుస్తుంది అని నేను చూశాను. ఎర్లీ రైటింగ్, 278 (1858). LDETel 141.4

పెంటెకొస్తు దినము వంటిది.

పెంతెకొస్తు దినమున జరిగిన సంఘటనలు కంటే మరింత అదిక శక్తితో పున రావృతమయ్యే సమయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము. యోహాను ఇట్లానేను” మరొక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను.“[ప్రకటన 18: 1]. LDETel 141.5

పెంటెకోస్తు కాలం లాంటిది వచ్చినప్పుడు ప్రజలు వారి స్వంత భాషలో ప్రతి ఒక్కరితో సత్యమే మాట్లాడటం వినవచ్చును. ది ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 6:1055 (1886). LDETel 141.6

రాత్రి దర్శనములలో దేవుని ప్రజలలో గొప్ప సంస్కరణ ఉద్యమమును ప్రాతినిద్యము వహించుచు నన్ను దాటి వెల్లటం నేను చూచాను, చాలా మంది దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అనారోగ్యం నయం చేయుటం మరియు ఇతర అద్భుతాలు చేస్తున్నారు, పెంతెకోస్తు యొక్క గొప్ప దినం ముందు ప్రత్యక్షంగా చూపబడిన విధంగా ఆత్మ మధ్య వర్తిత్వం కనబడింది. సంఘమునకు ఉపదేశములు 9: 126 (1909)6: 1055 (1886). LDETel 141.7

సువార్త సేవ ఆరంభములో ఎంతో బ్రహ్మండంగా దైవ శక్తి ప్రదర్శితమయ్యిందో దాని అంతంలోనూబ్రహ్మండంగా ప్రదర్శికముకానుంది. సువార్త సేవ ఆరంభంలో తొలకరి వర్షంతో నెరవేరిన ప్రవచనాలు సువార్త సమాప్తిలో కడవరి వర్షంతో నెరవేరుతాయి. పరిశుద్ధ సమర్పణతో ప్రకాశిస్తున్న ముఖాలతో దేవుని వంక చూస్తు దేవుడు తమ కిచ్చిన వర్తమానాన్ని ప్రకటస్తు దైవ సేవకులు గ్రామాలు ,పట్టణాలు తిరుగుతారు. భూమండలమంతా వేళాది గళాలు హెచ్చరిక వర్తమానం ప్రకటిస్తాయి.అద్భతాలు చోటుచేసుకుంటాయి. రోగులు స్వస్థత పొందుతారు. ఎక్కడకు వెళ్లినా విశ్వాసులు సూచనలు అద్భుతాలు చూస్తారు. మహా సంఘర్షణ,611, 612 (1911). LDETel 141.8

మనము అశ్చర్యపోయే విధముగా దేవుడు ప్రతినిధులను ఏర్పర్చుకొనును.

ఈ చివరి సంఘనలలో ప్రభువు సాధారణ క్రమంలో చాలా విదమైన రీతిలో పని చేస్తాడని, మరియు మానవ ప్రణాళికకు విరుద్ధంగా అయినా పని చేస్తాడని నేను మీకు చెప్పుచున్నాను. ప్రపంచానికి ఇవ్వబడే సందేశానికి మూడవ దూతతో కలసి మరొక దూతతో యొక్క దిశలో ముందుకు వెళ్లినప్పుడు ఏ కదలికలు చేయాలో కూడా నిర్దేశించడానికి, ఎల్లప్పుడూ దేవుని పనిని నియంత్రించాలని కోరుకుంటున్నవారు మనలో ఉంటునే ఉంటారు. దేవుడు తన చేతుల్లో పగ్గాలు తీసుకొని తన మార్గములోన మరియు తన విదానములోను పనిని ముందుకు సాగిచటం మనము చూస్తాము. ఆయన సరళమైన నీతి కార్యమును పూర్తీ చేసేందుకు ఆయన ఉపయోగించిన సాదారణమైన విదానము చూచినప్పుడు పనివారులకు ఎంతో అశ్చర్యన్ని కలిగిస్తుంది . - టెస్టమోనిస్ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 300 (1885). LDETel 142.1

భవిష్యత్ ప్రణాళికలు వేయడానికి సాధ్యమేనని ఊహించవద్దు. అన్ని సమయా లలోనూ మరియు ప్రతి పరిస్థితులలోను దేవుని యొక్క నియంత్రణలో వుండులాగున తన ఆధిపత్యమును అంగీకరించెదము. అతను తగినట్లుగా పని చేస్తాడు, మరియు నిర్వహిస్తాడు, అబివృద్ది చేస్తాడు మరియు తన స్వంత ప్రజలను స్థాపించును.- కౌంసల్ టూ రైటర్స్ అండ్ ఎడిటర్స్ 71 (1895). LDETel 142.2

మనుష్యుడు గుర్తించే నిర్దేశించిన ఖచ్చితమైన మార్గలుకాక అది దేవుని క్రమంలో ఆయన పేరును గౌరవించే విదానములో ఎవ్వరు ఊహించని సమయాల్లో తన మార్గాల్లో ఆధణకర్త తనకు తాను బయలుపర్చుకొనును. ఇజిడ్ల్యు 88 1478(1896). LDETel 142.3

ఆయన కార్యమును నెరవేర్చడానికి వయస్సులో పెద్దవారైన చేపలు పట్టేవారిని శిష్యులుగా పిలిచిన రీతిగా సామాన్య ప్రజల నుండి స్త్రీ పురుషులను అయనే పిలుచును. త్వరలో అనేక మందిని ఆశ్చర్యపరిచే మేల్కోల్పు ఉద్యమిస్తుంది. ఎవరైతే తగిన సమయ మందు ఏమిచేయాలో అని గుర్తించనివారిని విడిచిపెట్టి పరలోక దేవదూతలు ముందుకు దాటిపోయి సామాన్యమైన ప్రజలు ఎవరైతే సత్యము అనేక ప్రాంతలకు తీసుకొని వెళ్లగలిగే సామర్థ్వత కలిగివున్నరో వారితో కలసి పని చేయును .-మాన్యుస్క్రిప్ట్ రీలీజ్, 15: 312 ( 1905). LDETel 142.4

పరిశుద్ధాత్మ ద్వారా పనివారు అర్హత సాధించెదరు

అంతిమ కాలములో పవిత్రమైన పనిలో గొప్పవారైన కొందరు నిమగ్నమై యుంటారు...... దేవుడు మన దినాలలో ఒక పనిని అయన చేయునైయున్నాడు. అయితే దాని కోసం కొందరే ఎదురుచూస్తున్నరు. శాస్త్రీయ సంస్థల యొక్క బావ్యమైన శిక్షణ ద్వారా కాకుండా లేదా ఆత్మ ఉద్రేక బోధిలోనించి కాకుండ మనలను ఆయన లేపి ఉన్నతమైన స్థానములో హెచ్చించేను. ఈ అవకాశములు తృణీకరించటం లేదా ఖండించుటకు కాదు;అవి దేవుని చేత అబిషేకము పొందినవి,అయున అవి బాహ్య అర్హతలు మాత్రమే అలంకరించును. విధ్యావేతలు, గర్వముగల మనుషులపై ఆయన ఆధారపడకుండగానే దేవుడు తనకు తాను బయలుపరుచుకొనును. సంఘమునకు ఉపదేశములు-5:80, 82 (1882). LDETel 143.1

నమ్మకముగా వెలుగు కోసం వెదుకుచు పరిశుద్ధ వాక్యం నుండి వచ్చిన దైనికముగా ప్రకాశించే ప్రతి కిరణమును సంతోషంగా అంగీకరించే ఆత్మలకు, ఇటువంటి అదిక వెలుగు ఇవ్వబడుతుంది. ఈ ఆత్మలు ద్వారా దేవుడు వెలుగు మరియు శక్తిని బయలుపరిచి తన మహిమతో భూమి అంతటిని వెలుగుతో నింపివేయును -- సంఘమునకు ఉపదేశములు5: 729 (1889) LDETel 143.2

ఇది ఆత్మ యొక్క క్రమశిక్షణ, హృదయశుద్ధత మరియు ఆలోచన అవసరమై యుంది. తెలివైన నైపుణ్యం, యుక్తి లేదా జ్ఞానం కంటే ఇది మరింత విలువైనది సామర్థ్యాలను కలిగి ఉండి దనిని సరిగా ఉపయోగంచలేని దాని కంటే దేవుని పనికి అర్హతను కలిగివుండటం మంచింది. సాధారణమైన మనస్సు అభ్యసించుటకు విదేయత కలిగివుంటారు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు” -ది రివ్యూ అండ్ హెరాల్డ్, నవంబరు 27, 1900. LDETel 143.3

పని వారు సాహిత్య సంస్థల వలన గాక దైవాత్మ ప్రోక్షణ వల్ల అర్హత పొందుతారు. విశ్వాసముగల మనుష్యులు, ప్రార్ధించే మనుష్యులు దేవుడు తన కిచ్చిన మాటలన్ని శువైనవి ఉద్రేకంతో ప్రకటించటానికి ముందుకు వస్తారు. మహా సంఘర్షణ, 606(1911). LDETel 143.4

నిరక్షరాస్యులను కూడా దేవుడు ఉపయోగిస్తాడు.

వ్యక్తిగత రక్షకునిగా క్రీస్తును స్వీకరించేవారు ఈ చివరి రోజులలో పరీక్షకును మరియు విచారణకు నిలబడతారు. క్రీస్తులో అపనమ్మకమైన విశ్వాసాన్ని బలోపేతం చేసినప్పటికి, నిరక్షరాస్యుడైన శిష్యుడు కూడా నమ్మకద్రోహం చేసినప్పటికిని,ఆ తర్వాత సృష్టించే సందేహాలను, ప్రశ్నలను తట్టుకోగలిగాడుకదా!మరియుఅపవాదుల తంత్రములు అణగదొక్కాడు. వారి విరోదులు ఎవ్వరూ ఖండించుటకుగాని లేదా అడ్డుకోవటానికి వీలు లేకుండ ప్రభువైన యేసు శిష్యులకు స్వరము మరియు జ్ఞానం ఇచ్చును. ఎవరైనను తర్కంతో సాతాను భ్రమలను అధిగమించ లేకపోయిన వారికి, ఒక నిశ్చయత సాక్ష్యమును కలిగి ఉండుట వలన జ్ఞానము కలిగిన మనుష్యులు కూడ విపతము అయ్యెదరు. సామాన్యుల నోటినుండి ఒప్పించగలిగే శక్తి మరియు జ్ఞానమైన మాటలు ద్వారా వారు సత్యమును అంగీకరించెటట్టు చేస్తుంది. వారి యొక్క సాక్ష్యము ద్వారా వేలాది మంది మార్పు పొందుతారు. విధ్యావేత్తకు లేనిది ఎందుకు నిరక్షరాస్యునికి ఈ శక్తి కలిగి ఉండాలి ? నిరక్షరాస్యుడైన ఒక వ్యక్తి, క్రీస్తులో స్వచ్చమైన, స్పష్టమైన విశ్వాసముగల వాతావరణంలో జీవిస్తాడు, అదే విద్య నేర్చుకున్న వ్యక్తి అయితే సత్యము నుండి తొలిగిపోతాడు, పేదవాడు క్రీస్తుకు సాక్షిగా ఉంటాడు. అతను చరిత్రకారకుడుగాను లేదా విజ్ఞప్తి శాస్త్రము ఎరిగిన వాడుగా ఉండడు. కానీ అతను దేవుని వాక్యము నుండి శక్తివంతమైన సాక్ష్యం సేకరిస్తాడు. అతను ఆత్మ ప్రేరణతో మాట్లాడు నప్పుడు సత్యం చాలా స్వచ్చమైనది మరియు గొప్పదిగా ఉంటుంది మరియు తన సాక్ష్యం మరల చెప్పనవసరములేకుండా నిస్సందేహమైన శక్తిని కలిగి ఉంటుంది.మాన్యుస్కిప్ట్ రిలీజ్ 8: 187, 188 (1905). LDETel 143.5

పిల్లలు సువార్తను ప్రకటించెదరు

ఎందరో నిరక్షరాస్యులైన వారు కూడ ఇప్పుడు దేవుని వాక్యము ప్రకటించు చున్నారు. పిల్లలు ఆత్మచేత ప్రేరేపించబడి పరలోక వర్తమానము ప్రకటించ డానికి ముందుకెల్లుచున్నారు. మనిషి యొక్క తంత్రములు అతని నియమాలు మరియు శ్రద్ధగల పద్దతులను ప్రక్కన పెట్టి ఆత్మ ప్రేరణకు విధేయత చుపించిన వారి పైన ఆత్మ కుమ్మరించబడును అప్పుడు వారు మహా శక్తితో సత్యాన్ని ప్రకటిస్తారు- ఎవాంజిలిజం 700 (1895). LDETel 144.1

యేసు వలే మనుష్యులు సరళతతో సత్యం చెప్పలేరని పరలోక జ్ఞాన సంపన్నులు చూచినప్పుడు, చాలామంది పిల్లలు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ కాలములో వారు సత్యాము ప్రకటంచుటకు ముందుకు సాగిపోవుదురు.- ది సదరన్ వర్క్, 66 (1895). LDETel 144.2

దేవదూతల పరిచర్య.

బైబిలు ఇతివృత్తములపై విచారణను ఉత్పన్నం చేయటానికి పరలోక దేవదూతలు మానవ మనస్సులను గమనిస్తుయున్నారు. ఇప్పటివరకు చేయబడిన దాని కంటే చాలా ఎక్కువ పని చేయబడుతుంది మరియు దాని యొక్క మహిమ ఏదీ మానవులకు ప్రవహించదు, ఎందుకంటే రక్షణకు వారసులుగా ఉన్నవారికి సేవ చేసే దేవదూతలు రాత్రి పగలు పని చేస్తున్నారు. కౌన్సిటూ రైటర్స్ అండ్ ఎడిటర్స్ 140 (1875). LDETel 144.3

కొర్నేలి లాంటి చాలా మంది మనుష్యులు ఉన్నారు...... దేవుడు కొర్నేలి కోసం పనిచేశాడు కాబట్టి, అతను ఈ నిజమైన నియమము ప్రకారముగావున్న వారి కోసం పనిచేస్తాడు .... పరలోకము నుండి దేవదూతల సందర్శనప్పుడు కొర్నేలి చేసిన విదంగా వారు దేవుని జ్ఞానాన్ని పొందుతారు .-లెటర్ 197, 1904. LDETel 145.1

దైవిక శక్తి మానవ కృషితో కలిసినప్పుడు, పోగుచేయబడిన చెత్తకు నిప్పు పెట్టినప్పుడు ఎంత వేగముగా కాలిపోతుందో పని అంతత్వరగా పాకిపోవును, ఏ మూల మనుషుడు గుర్తించలేని విదముగా దేవుడు సంస్థలను నియమించును. దేవుడు అడిగిన వాటికి సమాధానమివ్వటానికి వారు నిర్లక్ష్యం చేయక పనిని సాదించి ఆశీర్వాదము పొందిన మనుష్యులు వుండగా దేవదూతలు కార్యములు చేయునుసెలెక్ట్డ్ మెజన్స్ 1: 118 (1885). LDETel 145.2

ప్రపంచ వ్యాప్త సువార్త ప్రకటన విస్తరించును

మూడు దూత వర్తమానాన్ని ప్రకటించే దూత తన మహిమతోను వెలుగుతోను లోకాన్ని నింపవలసియున్నాడు. ఈ వర్తమానములో ప్రపంచవ్యాప్త సేవా పరిది అపూర్వ శక్తి ప్రవచితమయ్యా యి... పరిశద్ద సమర్పణతో ప్రకాశిస్తున్న ముఖాలతో దేవుని వంకచూస్తు దేవుని తమ కిచ్చిన వర్తమానాన్ని ప్రకటస్తు దైవ సేవకులు గ్రామాలు ,పట్టణాలు తిరుగుతారు. భూమండలమంతా వేలాది గళాలు హెచ్చరిక వర్తమానం ప్రకటిస్తాయి. మహా సంఘర్షణ,611, 612 (1911) LDETel 145.3

మూడవ దూత సందేశాన్ని తరువాత అప్పుడు మరో దూత సందేశము ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు అందించును,. అది పంటకోసే కాలమునకు సంబందించే సందేశంగా ఉంటుంది, మరియు అది భూమి అంతయు దేవుని మహిమతో వెలిగిస్తారు. లెటర్ 86, 1900. LDETel 145.4

హింస తుపాను నిజంగా మన మీద విచ్చిన్నం చేసినప్పుడు, ... మూడవ దూత సందేశాన్ని గంబీరమైన కేక పెట్టినప్పుడు, భూమియంతయు దేవుని మహిమతో కాంతివంతం చేయబడుతుంది. సంఘమునకు ఉపదేశములు, 6: 401 (1900). LDETel 145.5

అమెరికాలోని ప్రతి నగరంలో సత్యం ప్రకటించబడుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ హెచ్చరిక సందేశం ఇవ్వాలి.-ది జనరల్ కాన్ఫరెన్స్ బులెటిన్, మార్చ్ 30, 1903. LDETel 145.6

గంభీరముగా కేక వేసే సమయంలో, దైవికమైన సహాయం మధ్య వుండుట వలన ఆమే ప్రభవును ఉన్నతముగా హెచ్చించటమే కాక రక్షణ జ్ఞానము విస్తారముగా అభివృద్ధిలో కొచ్చిన ఆ సత్యమైన వెలుగు ప్రతి నగరం మరియు పట్టణమంత వ్యాపించును -ఎవాంజలిజం, 694 (1904). LDETel 145.7

ఒక సంక్షోభం మన మీద ఉంది. ఇప్పుడు మనము పరిశుద్దాత్మ యొక్క శక్తి ద్వారా ఈ చివరి దినాలలో గొప్ప సత్యాలను ప్రకటించాలి. ప్రతి ఒక్కరూ హెచ్చరికను వినడానికి మరియు అతని నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇది ఎంతోకాలం ఉండదు. అటుతరువాత అంతము వచ్చును. సంఘమునకు ఉపదేశములు 6:24 (1900). LDETel 146.1

రాజులు, అధికారులు, మంత్రులు సువార్త విందురు

అది మనము చూడడానికి సాధ్యముకాదు, ఇప్పుడు ఎవరైనసరే ఒంటరిగా నిలబడాలి, కానీ దేవుడు నా ద్వారా మాట్లాడినటైయితే, మనము ఆయన నామము నిమిత్తము అదికారులు ముందు మరియు వేలాది ప్రజలు ముందుకు తీసుకు రాబడిన సమయము వస్తుంది, మరియు ప్రతి ఒక్కరు తన విశ్వాసమునకు కారణం ఇవ్వలి... అప్పుడు సత్యం కోసం తీసుకున్న ప్రతి స్థానం మీద తీవ్ర విమర్శలు వస్తాయి. అప్పుడు మనము దేవుని వాక్యమును అధ్యయనం చేయవలసిన అవసరముంది. ఎందుకంటే మనం వాదిస్తున్న సిద్ధాంతాలను మనమెందుకు నమ్ముచున్నామో మనకు తెలుస్తుంది. -రివ్యూ అండ్ హెరాల్డ్ 18,1888 LDETel 146.2

శాసన న్యాయస్థానాల్లో చాలామంది నిలబడాలి; కొంతమంది రాజులు ముందు మరియు భూమిమీదవున్న విద్యావేత్తల ముందు నిలబడి మన విశ్వాసం గూర్చి సమాధానం చెప్పవలసియుంది. సత్యం గూర్చి పైపైన అర్ధము చేసుకొనే అల్ప విధ్య నేర్చుకొన్నవారు బైబిలు లేఖన వివరాలను స్పష్టం చేయలేరు మరియు తమ విశ్వాసానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేరు. కనుక వారి మాటలో తత్తరపాటు వస్తుంది కాని నిజమైన పనివాడు మాత్రము సిగ్గుపడవలసిన అవసరం లేదు. అతడు పవిత్ర వేదిక మీద మాట్లడడు కాబట్టి అతడు విధ్యనేర్చుకోన వసరములేదని ఎవ్వరు ఊహించకూడదు. దేవునికి నీయొద్ద నుండి కావలసింది ఎమైయున్నదో అది నీకు తెలియదు. పండమెంటల్ ఆఫ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, 217 (1893) LDETel 146.3

అడ్వెంటిస్ట్స్ ఎందరో తమను తాము సత్యమైన వెలుగుకు వ్యతిరేకులగుదురు

[సెవెంత్-డే అడ్వెంటిస్ట్] సంఘములో దేవుని యొక్క శక్తి ఒక అద్భుతంగా బయలు పరచబడవలసి యుంది, కానీ అది ప్రభువు ముందర తమను తాము వినయముగా తగ్గించుకొనకయు మరియు హృదయద్వారములు తెరిచి ఒప్పుకోలు మరియు పశ్చాత్తాపము పొందకయు ఉన్న వారి మద్య అది కనపర్చబడదు. దేవుని మహిమతో ఈ లోకమంత వెలిగించే శక్తి బయలుపరచబడినప్పుడు వారి యొక్క అంధత్వంతో ఎదో ప్రమాదము ముంచుకొస్తుందని భావించి భయముతో దానిని అడ్డుకోవటానికి కట్టుదిట్టము చేసుకొనుటకు చుస్తున్నారు. ప్రభువు వారి ఆలోచనలు తగ్గట్టుగాను మరియు అంచనాల ప్రకారము పని చేయలేదు కాబట్టి వారు ఆ పనిని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే, మేము చాలా సంవత్సరాల నుండి పని చేయుచున్నప్పుడు, దేవుని ఆత్మను గూర్చి మనకెందుకు తెలియదు? అని అంటారు“. ది రివ్యూ అండ్ హెరాల్డ్ ఎక్నా డిసెంబర్ 23, 1890. LDETel 146.4

అ వెలుగు దాని యొక్క మహిమతో లోకమును వెలిగించినను, ,త్రిదూత సందేశం యొక్క సత్యము ఏమిటో బోధపడలేదు, ముందుకు సాగుచున్న అ మహిమలో నడుచుకొనుటకు ఎవరు నిరాకరించెదరో వారు అది అసత్యమైన వెలుగు అని పిలుస్తారు. -ది రివ్యూ అండ్ హెరాల్డ్, మే 27, 1890. LDETel 147.1

అడ్వెంటిస్టులు కానివారు హెచ్చరికను తిరస్కరించెదరు

సందేశాన్ని వినిపిస్తున్న అనేక మంది---- గొప్ప సంఖ్యలలో ఎంత మందివున్న --- ఈ గంబీరమైన హెచ్చరికను వారు లక్ష్యపెట్టరు. చాలా మంది దేవుని దర్మశాస్త్రమునకు అవిధేయత కలిగి ఉంటారు, ఇది ప్రవర్తనను లేదా గుణశీలమును పరీక్ష అయున్నది. ప్రభు సేవకులు ఇది గొప్ప ఉత్సాహము అనిపిలుస్తారు. సేవకులు కొందరు వారి మాట వినకూడదని వారిని హెచ్చరిస్తారు. దేవుని ఆత్మ నోవాహు సందేశం ఇచ్చినప్పుడు ఈ ప్రజలు వినినను లేదా వారు వినకపోయునను కాని వారికి నీవు అందించు అని చెప్పినప్పుడు ఇదే విధమైన వ్యవహరము అతడు చూచియున్నాడు .టెస్టమోనీస్ టూ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్, 233 (1895).కొందరు ఈ హెచ్చరికలను వింటారు, అయితే చాలా మంది. ఒక పక్షమున అదిక సంఖ్యనువున్న వారిని చూచి అలక్షముచేయుదురు.. హెవెన్లీ, ప్లేస్ 343 (1897). LDETel 147.2

ఆ ప్రఖ్యాత బోదకులు తమ అధికారాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఆగ్రహిస్తు ఆ వర్తమానం సాతాను వద్ద నుంచి వస్తున్నదన్ని ఎండిన మండలకు దిగుతూ ఆ సత్యమును ప్రకటించే భోదకుల్ని నిందించి హింషించుటకు పాప ప్రజామూకల్ని రెచ్చ గొడతారు. -మహా సంఘర్షణ, 607 (1911). LDETel 147.3

అనేక మంది పిలుపునకు సమాధానం ఇచ్చెదరు

లోతు నాశనానికి ముందు సొదొమ నుండి త్వరగా వెళ్లిపోయునట్టుగా మతపరమైన సంస్థలలో అక్కడక్కడ స్థిరపడిన వారు ఈ హెచరిక పిలుపును అంగీకరించి త్వరపడి వస్తారు. మరియు ఈ నాశనముకానైయున్న సంఘముల నుండి వెలపలకు వెళ్లుటకు విలువైనవారు త్వరపడుదురు. -ఎర్లీ రైటింగ్స్, 279 (1858). ఆఖరి పరీక్ష వరకు ఒక బండవలే స్థిరముగా నిలువబడే విశ్వాసుల సైన్యం ఉంటుంది.- సెలెక్ట్డ్ మెసేజప్స్ 3: 390 (1888).ఉన్నతమైన హోదాలలో వుండి ఇది వరకు సత్యము ప్రకటించు వారి కంటే ఇప్పుడు అత్యున్నత ఉత్సాహంగలవారై సత్యమును బోదించుటకు, ప్రపంచంలోని గొప్ప హోదాల నుండి అనేక సంఘల నుండి కాదలిక్ సంఘముతో సహా బయటికి రావడానికి చాలా ఆత్మలు ఎదురుచూస్తున్నవి- సెలెక్టేడ్ మెసేజస్,:3: 386, 387 (1889). LDETel 147.4

అనేక మంది విశ్వాసం పొందుతారు మరియు ప్రభు యొక్క సైన్యంలో చేరతారుఎవాంజలిజం, 700 (1895).మంద నుండి దూరమైన అనేక మంది గొప్ప గొర్రెల కాపరిని అనుసరించడానికి తిరిగి వస్తారు. సంఘమునకు ఉపదేశములు 6: 401 (1900) LDETel 148.1

అన్యమత ఆఫ్రికాలో, ఐరోపాలోని దక్షిణ అమెరికాలోని, కథోలిక్కు దేశాల్లో, చైనాలో, ఇండియాలో. సముద్ర ధీపాలలో, లోకంలోని చీకటి మూలలన్నిటిలో దేవునికి ప్రత్యేక ప్రజలు నిలవలో ఉన్నారు. ధర్మశాస్త్ర విధేయతలో ఉన్న పరివర్తనా శక్తిని భ్రష్టమైన ప్రపంచానికి స్పష్టంగా కనపరచుతు వారు చీకటినడుమ దేదివ్యంగా ప్రకాశిస్తారు. ఇప్పుడు కూడా వారు ప్రతి జాతిలో, భాష మాట్లాడే ప్రజల నడుమ కనిపిస్తున్నారు. మత భ్రష్టత తీవ్రంగా ఉన్న సమయంలో కొద్దివారుగాని, దనికులుగాని, దరిద్రులుగాని, స్వతంత్రులు గాని, దాసులుగాని అందరు తమ విశ్వాసపాత్రతకు అబద్ద విశ్రాంతిదినాన్ని గుర్తుగా అంగీకరించేలా మరణదండన బెదిరింపుతో సాతను ప్రయత్నిస్తున్నప్పుడు నిష్క ళంకులును అనింద్యలునగు దేవుని కుమారులగు, వీరు లోకమందు జ్యోతులవలె ప్రకాశిస్తారు. ప్రవక్తలు - రాజులు, 188, 189 (c.1914). LDETel 148.2

ఒక రోజులో వేలది మంది మారుమనస్సు పొందుతారు

ఆఖరి ఘడియాలో వేల మంది సత్యాన్ని ఎరిగు అంగికరించెదరు ......సంఘము ఆశ్చర్యానికి గురైనంతగా, సత్యామును స్వీకరించి మారు మనస్సు పొందడం చాల వెగవంతమౌతుంది మరియు దేవుని నామము మాత్రమే మహిమ పరచబడుతుంది. - సంఘమునకు ఉపదేశములు. 2:16 (1890). ఇది ఆఖరి ఘడియని ఎరిగి, సత్యమును అంగీకరించి మరియు దేవుని ఆత్మ కదలికలను గమనించినవారు, ఒక దినమందే సత్యము తెలుసుకొని మారు మనస్సు పొందుటకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ఇజీడ్లు 88 755 (1890) శిష్యులు పరిశదాత్మ పొందిన తరువాత, పెంటెకోస్తు దినమున నజరిగిన రీతిగానే ఒక దినమందే ఎందరో మారు మనస్సు పొందెదరు, అ సమయము త్వరలోనే రానై యున్నది.- ఎవాంజలిజం, 692 (1905). LDETel 148.3

నిజాయితీగల మనస్సు దీర్ఘకాలం వెనుకాడదు

ఎందరో మంచివారు ఇప్పుడు వారి స్థానాన్ని పదిలం చేసుకొనుటకు దానిని గమనించెదరు, అయితే ఈ విషయాలు వారి జీవితాలలో ప్రభావితం చేస్తుంది, మరియు సందేశం పెద్ద శబ్దంతో వెళ్లినప్పుడు వారు దాని కోసం సిద్ధంగా ఉంటారు. వారు ఇక తీర్మనము తీసుకొనుటకు వెనుకాడరు; వారు బయటికి వచ్చి తమ స్థానమును తీసుకుంటారు.. ఎవాంజలిజం, 300, 301 (1890). త్వరలో అంతిమ పరీక్ష భూనివాసులందరు మీదకి రానైయున్నది. ఆ సమయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకో బడతాయి.దేవుని వాక్యము బయలుపరచబడిన దానిని బట్టి ఎవరైతే మారుమనస్సు పొందుతారో వారు రారాజగా రానైయున్న ఇమ్మానుయేలు యొక్క రక్తపు గుర్తు కలిగి ఉంటారు. సంఘమునకు ఉపదేశములు. 9: 149 (1909). LDETel 148.4

చిత్తశుద్ధిగల ప్రతి వ్యక్తి సత్యాన్ని కనుగొంటాడు.- మహా సంఘర్షణ, 522 (1911). ఈ వర్తమాన సాపల్యం వాదన ద్వారా కాక దేవుని ఆత్మ పని ద్వారా కలిగే ప్రగాఢ నమ్మకం ద్వారానే సాధ్యమౌతుంది. వాదనల వ్యక్తీకరణ జరిగినది. విత్తనం నాటటం జరిగినది. ఇప్పుడు అది మొలిచినది. ఫలాలు పలించాల్సి వుంది. మిషనెరి సేవలందించే పనివారు తమ ప్రభావాన్ని ప్రసరించారు. అయినా సత్యాన్ని విశ్వసించిన వారిలో చాల మంది సత్యాన్ని అవగాహన చేసుకొని ఆచరించాటానికి వచ్చే సరికి ఆటంకాలు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు సత్యకిరణాలు అన్ని చోట్లకు చోచ్చుకు పోతున్నాయి. సత్యము ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిజాయితీ పరులైన దేవుని బిడ్డలు తమ చేతుల్ని బందిస్తున్న శృంఖలాల్ని బద్దలు కొడ్తారు. కుటుంబ బందాలు, సంఘ సంబందాలు వారిని ఇక ఆపలేరు. సత్యాని అన్నిటికన్నా ప్రశస్తమౌవుతుంది. సత్యాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులు శంఘటితమైనప్పటికి పెద్ద సంఖ్యలో ప్రజలు దేవుని ప్రక్కనిలవ టానికి నిశ్చయించుకొంటారు. మహా సంఘర్షణ, 612 (1911). LDETel 149.1

ముద్రిత పేజీపై ప్రభావం

ఒక్క దినమందే వెయ్యి మందికంటే ఎక్కువ మంది మారుమనస్సు పొందుతారు. వీరిలో చాలామంది మన ప్రచురణలు చదివి మొట్ట మొదటి ఒప్పుకొని సత్యమును అంగీకరిస్తారు.- ఇవాంజలిజం, 693 (1885). LDETel 149.2

మహా సంఘర్షణ అనే ఈ పుస్తకం వ్యాపించడములో వచ్చిన పలితాలును ప్రస్తుతం కనిపించే దానిని బట్టి తీర్పు తీర్చకూడదు. దానిని చదవడం ద్వారా కొందరు ఉజ్జీవము మరియు ఉద్రేకము పొందుతారు. తద్వారా దేవుని ఆజ్ఞలను పాటించేవారితో ఒకేసారి తమను తాము ఐక్యపరచడానికి ధైర్యం కలిగివుంటారు కానీ అది చదివిన అనేకులు వాటి గురించి ముందు చెప్పబడిన సంఘటనలను చూసేంత వరకు వారి స్థానాన్ని తీసుకోరు, అయితే ముందుగా చెప్పబడిన సంగతులు కొన్ని నెరవేరగానే వారి విశ్వాసము ప్రేరేపించ బడుతుంది. అప్పుడు ఇతరులు కూడ వారితో కలసి వచ్చెదరు. మరియు భూమిమీద కార్యాంతమున దేవుని యొక్క హిమతో లోకమును నింపి నప్పుడు, అనేక మంది దేవుని ఆజ్ఞల ఫలితంగా వారి స్థానాలను తీసుకొందురు. - కోల్పో ర్ట్ మినిస్ట్రీ, 128, 129 (1890). [ప్రకటన 18: 1] LDETel 149.3

లోపరలోకము నుండి గోప్ప శక్తితో మరియు భూమి తన మహిమతో వెలిగించే మరోక దూత యొక్క పనిని మన ముద్రాలయము ద్వారా పెద్దస్థాయిలో ప్రచురణలు ద్వారా మనము పూర్తి చేయవలసి యుంది.-సంఘమునకు ఉపదేశములు. 7: 140 ( 1902). LDETel 149.4