అంత్యకాల సంఘటనలు
9 అధ్యాయము - ఆదివారం చట్టాలు
దేవుని అధికారాన్ని సాతనుడుసవాలుచేయుట
తన వ్యబిచార మద్యమును సమస్త జనులకు త్రాగించించెను కాబట్టి దేవుడు బబులోన్ను ఖండించెను.....దేవుడు ఈ సృష్ట అంతటిని ఆరు దినములలో సంపూర్తి చేసేను మరియు ఏడవ దినమున విశ్రాంతి తీసుకోనేను. ఈ దినాన్ని పవిత్రపరిచెను, ఇతర దినములకన్న ఆ దినము ప్రత్యేకముగా వుండుటకు, అన్ని యుగముల్లో తన ప్రజలు ఆచరించుటకుగాను దానిని తన కొరకు పవిత్రపరిచేను. కానీ పాపముతో నిండిన మనిషి, దేవునికంటే పైగా తాను హెచ్చించుకొని దేవుని ధర్మశాస్త్రమును మరియు న్యాయ పద్ధతులను మార్చి దేవుని ఆలయంలో కూర్చొని, తాను దేవుడుగా కనపరిచు కుంటున్నాడు. ఏడవ దినమైన విశ్రాంతి దినమునకు బదులు వారములో మొదటి దినము విశాంతిదినముగా మార్చుటలో, అది దేవునితో సమానంగా చేసుకో వటమే కాదు, దేవుని కంటే మించిన వాడని నిరూపించుటకు తన శక్తి యుక్తిలతో ప్రయత్నించు చున్నాడు. మరియు పోపుల నుండి పుట్టికొచ్చిన ఈ శిశువును చూచి ప్రొటెస్టెంట్ ప్రపంచం ఇది పవిత్రమైన దినమని వారు బావించు చున్నారు.అయితే దేవుని వాక్యంలో ఇది ఆమే వ్యభిచారములోవున్నదని అని పిలువబడుతున్నది. [ప్రకటన 14: 8] .ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 7: 979 (1900) LDETel 86.1
క్రైస్తవ శకంలో మానవుల యొక్క సంతోషానికి వ్యతిరేకి అయున సాతాను నాలుగో ఆజ్ఞ నిర్దేశించే సబ్బాతును తన దాడికి గురిగా పెట్టుకున్నాడు. సాతాను ఇలా అంటు న్నాడు, నేను దేవుని వ్యతిరేకముగా పనిచేస్తాను. దేవుని సృష్టి స్మారకచి హ్నమైన ఏడవరోజు సబ్బాతును ప్రక్కన పెట్టడానికి నా అనుచరులకు శక్తినిస్తాను. కాబట్టి, దేవుడు పరిశుద్ధపరచబడిన మరియు ఆశీర్వదించబడిన రోజు మార్చబడిందని ప్రపంచానికి నేను చూపిస్తాను. నేను దాని జ్ఞాపకమును తుడిచివేస్తాను. దేవునికి మరియు అతని ప్రజలకు మధ్య ఒక సంకేతం కానటువంటి రోజును నేను దేవుని యొక్క ఆధారాలను భరించలేని రోజును దాని స్థానంలో ఉంచెదను. ఏడవ దినమున దేవుడు ఉంచిన పవిత్రతను ఈ రోజున అంగీకరించే వారిని నేను నడిపిస్తాను- ప్రవక్తలు - రాజులు, 183, 184 (c.1914) LDETel 86.2
సబ్బాతుసమస్య ఒక గొప్ప విషయము.
అంత్యదినాల్లో దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, యెహోవా నియమానికి విదేయత చూపించిన అవినీతిపరులైన అన్యజంనులందరు కలసి ఐక్యముగా యుద్ధం చేయుదురు. ఈ యుద్ధంలో నాలుగవ ఆజ్ఞఅయున సబ్బాతునుగూర్చి గొప్ప చర్చనీయాంశం అవుతుంది.సబ్బాతు నియమములో ఆజ్ఞ ఇచ్చిన ధర్మశాస్త్ర విధాయకుడుతానే భూమ్యా కాశములను సృష్టించేనని బయలుపర్చబడును.- సెలెక్ట్డ్ మెసెజన్స్ 3: 392 (1891). నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినమును అచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరుచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తరతర ములకు నాకును నీకును సూచనగా ఉండును; అని ఆయన అనెను, (నిర్గమ 31:13). సబ్బాతు దినము ఏదో మీకు తెలియదు అంటు కొందరు విశ్రాంతి దినము గూర్చిన ఆచారములో అడ్డంకులు వేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆదివారం వచ్చినప్పుడు వారు అర్థం చేసుకోవడమే కాక, దాని ఆచారాన్ని బలపరచే చట్టాలను తయారుచేసే గొప్ప ఉత్సాహం కనబరిచారు. ది క్రస్ కలక్షన్ 148 (1900). LDETel 86.3
1880 లలో ఆదివారం చట్టాము గూర్చి ఉద్యమం
[ఉపయోగకరమైన నేపథ్యం మరియు మరింత విస్తృతమై నసమాచారం కొరకు ఇ జీ వైట్ వ్రాసిన వాక్యలు, సెలెక్ట్డ్ మెసెజన్స్ 3: 380-402, మరియు 5: 711 - 718 సంఘమునకు ఉపదేశములలో చూడండి. మన దేశములో ఆదివారం చట్టం అమలు చేయబడాలని మనము అనేక సంవత్సరాలు నుండి ఎదురుచూస్తున్నాము. ఇప్పడే ఆ సమయము లేక దినము మనమీదకి రానైయున్నది. ఈ విషయములు మన ప్రజలు ఏమి చేయనైయున్నరో అని అడిగెదము?......... మనము దేవుని యొక్క కృప మరియు ఆయన శక్తిని ఇప్పుడే ప్రజలకు ప్రశాదించుమని ప్రత్యేకంగా అడగెదము. మరియు మన స్వేచ్చలను పరిమితం చేయబడిన సమయము పూర్తిగా వచ్చిందని నేను నమ్ముట లేదు. భూమీ యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి విచకుండునట్లు భూమీ యొక్క నలుగుదిక్కుల వాయువులను పట్టుకొనియుండగా ప్రవక్తచూచెను. మరొక దేవదూత, సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి దేవుని దాసులను వారి సళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రముకైనను చెట్టుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఇది ఇప్పుడు మనము చేయవలసిన పనిని సూచిస్తుంది, దేశాంతర సేవకులు ప్రపంచనలు మూలలకు పంపించి యెహోవా ధర్మశాస్త్రమునకు అవిధేయులైనవారికి హెచ్చరిక ప్రకటించు వరకు, భూమియొక్క నాలుగు దిక్కులను దేవదూతలు పట్టుకొమ్మని మనము దేవునికి మొఱ్ఱపెట్టవలెను. -రివ్యూ అండ్ హెరాల్డ్ ఎక్ స్టా, డిసెంబర్ 11, 1888. LDETel 87.1
వారు చేస్తున్నది గ్రహించవలసిననవసరం లేదని ఆదివారం చట్టామ వాదించును
ఆదివారమే ఆచరించాలనే ఉద్యమం ఇప్పుడే చీకటి మార్గములో పని చేస్తున్నది. నాయకులు నిజమైన సత్యమును దాచిపెడుతున్నారు, మరియు ఈ ఉద్యమంలో ఏందరో ఐక్యమై పాల్గొంటున్నారు, కాని వారు రహస్య ప్రభావమును పెంపారింప జేయు చున్నారనే విషయము వారు గ్రహించులేదు......వారు అంధత్వంతో పని చేస్తున్నారు. ప్రొటెస్టంట్ ప్రభుత్వం వారిని స్వేచ్చాయుత స్వతంత్ర దేశంగా మార్చేందుకు వారికున్న సూత్రాలను త్యాగము చేసిన సువార్త దానిని చూడలేకపోతున్నారు, మరియు చట్టాల ద్వారా రాజ్యాంగం సూత్రాలను తీసుకొని వస్తారు, అది అబద్దాల పోష్) మరియు మాయ జాలంచేసే పోపు గూర్చి ప్రచారం చేస్తున్న అ చీకటి యుగములో వున్న భయంకరమైన రోమన్ పరిపాలన మోసములోనే పడిపోవుచున్నాము.-ది రివ్యూ అండ్ హెరాల్డ్ ఎక్ స్టా డిసెంబర్ 11, 1888. LDETel 87.2
ఆదివారమే ఆచరించాలనే ఈ ఉద్యమములో ఎందరినో బలవంతము చేయుటలో నిమగ్నమైన వారి సహితము, రానైయున్న చర్యలు యొక్క పలితములకు వారు అంధులైయున్నారు. మతపరమైన స్వేచ్ఛకు వ్యతిరేకంగా తాము నేరుగా దాడి చేస్తున్నా రని వారు గమనించుటలేదు. ఎటువంటి ఆదారములేని పునాది మీద వున్న ఆదివారము ఆచరించే సంస్థలలో వున్నారు మరియు బైబిలో వున్న సబ్బాతు గూర్చిన వివరణలు అర్థం తెలుసుకోకుండవున్న వారు ఎందరోవున్నారు..... రాజ్యాంగంను మార్చ డానికి మరియు ఆదివారపు ఆచారాన్ని అమలు చేయటానికి ఒక చట్టాన్ని భద్రపరిచే ప్రయత్నం చేస్తున్న కొందరు అయితే దాని ద్వావా వచ్చే పలితము ఏమీటి, దానిని బట్టి మన మీద ఒక సంక్షోభం ఉన్నది. సంఘమునకు ఉపదేశములు. 5: 711, 753 (1889) LDETel 88.1
ఏమీ చేయకుండా నిశ్శబ్దంలో కూర్చోవద్దు,
మనకున్న బలముచేత భయపెట్టే ప్రమాదాన్ని నివారించగలగడం మన బాధ్యత .... దుష్టత్వముతో కప్పియున్న ఈ నల్లని మేపూన్ని తోలిగించి మన యజమానుడు కొరకు పనిచేయుట ఇంక కొన్ని సంవత్సరములు నీ కృపను అనుగ్రహించునని భూమిపై ఉన్న ప్రార్థనాపరులైన స్త్రీ పురుషులు దేవునికి విజ్ఞప్తి చేయవలసిన బాద్యతవున్నది.- రివ్యూ అండ్ హెరాల్డ్ ఎక్ స్టా,డిసెంబర్ 11, 1888. దేవుని ఆజ్ఞలను ఎవరైతే ఇప్పుడు గైకొంటున్నారో వారికి మాత్రమే దేవుడు అనుగ్రహించు ప్రత్యేకమైన సహాయాన్ని పొందుకోనుటకు వారికి వారే మేల్కోవాలి. సాద్యమైనంత వరకు భయపెట్టుచున్న విపత్తును ఆలస్యం చేయడానికి వారు మరింత దృడంగా పని చేయాలి.-ది రివ్యూ అండ్ హెరాల్డ్, డిసెంబర్ 18, 1888.మనము ఈ పరిస్థితిని ఎంతో గౌరవముగా అంగీకరించినప్పటికిని, దేవుని ఆజ్ఞను గైకొనుటకు ప్రజలుగా మనము ఈ సమయంలో మౌనంగా ఉండరాదు . ఎస్ డి ఏ బైబిల్ కామెంటరీ 7: 975 (1889). LDETel 88.2
మనస్సాక్షి స్వేచ్ఛను కాపాడటానికి మనము ఏమీ చేయక పోయినా మనము ఉరకనే కూర్చునివున్న, మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలేదు. ప్రభావవంతమైన ప్రార్థన పరలోకానికి ఆరోహణమవ్వాలి.ఎందుకంటే చాలాకాలం వరకునిర్లక్ష్యం చేసిన పనిని మనం సాదించేవరకు ఈ విపత్తులు వాయిదా వేయబడవచ్చు. అత్యంత నమ్మకమైన ప్రార్థన ఉండనివ్వండి, మన ప్రార్ధనలతో అనుగుణంగా పనిచేయాలి.సంఘమునకు ఉపదేశములు: 714 (1889) LDETel 88.3
చాలామంది నిద్రిస్తున్నట్లు ఉన్నారు వారు విషయాలను సులువుగా తీసుకుంటు న్నారు, ఆదివారం ఆచరణ బలవత్తముగా అమలోకి వస్తుంది అని ప్రవచనం ముందే చెప్పినట్లైయితే, చట్టప్రకారం తప్పనిసరిగా అమలు చేయబడుతుంది అని వారు అంటారు, మరియు వారు నిదానంగా కుర్చున్న ఈ సంఘటన గూర్చి నిరీక్షిస్తు దీర్గంగా ఆలోచిస్తు శ్రమకాలం వచ్చినప్పుడు, దేవుడే తన బిడ్డలను కాపాడుకుంటాడు అని వారు ఒక పరి స్కారమునకు వచ్చేదరు. మన మార్పు కోసం బాధ్యతగా కట్టుబడి ఉన్న పనిని చేయటానికి మన ప్రయత్నం చేయకపోతే దేవుడు మనల్ని రక్షించడు .... స్త్రీ పురుషులు సత్యము తెలిసుండి దానిని నిర్లక్షము చేసినయెడల ఏదో అజ్ఞానము వలన అనుసరించ లేక పోయాము అంటే వారి మీదకి ఒక ఖడ్గము వస్తుందని నారిని హెచ్చరించుటకు నమ్మకమైన కావలివానిగా చూడవలసిన బాద్యన నీది.- ది రివ్యూ అండ్ హెరాల్డ్ ఎక్ స్టా డిసెంబర్ 24, 1889. LDETel 89.1
కలము మరియు ఓటు ద్వారా నైనను ఆదివారం చట్టాలను వ్యతిరేకించుము
మతపరమైన స్వేచ్ఛను అణచివేయుటకు దౌర్జన్యముగాను లేద బలవంతముగా ఆదివారం సబ్బాతు దినముగా ఆచరించాలని వారి తోటి సహచరులకు నియమాలు ఏర్పాటు చేయుటకు అధికారమును ఉపయోగించెదరు. అట్టి మనుష్యుల దయను కోరుకొనుటకు మనము కృషిచేయకూడదు....వారం మొదటి రోజు పవిత్రముగా ఆచరించడానికి ఏర్పటుచేసిన దినము కాదు. ఇది కల్పితమైన సబ్బాతు, మరియు మనుష్యులు ఈ దినాన్ని హెచ్చించెదరు మరియు దేవుని చట్టం ఉల్లంఘించి తప్పుడు బోధ చేస్తున్న వారితో దేవుని మాట ప్రకారము నడిచే ప్రభువు యొక్క కుటుంబ సభ్యులు మాత్రము పాల్గొన్నారు, ఇటువంటి వ్యక్తులకు తమ కార్యలయములో పని చేయుటానికి ఓటు ద్వారా సిపారసు చేయకూడదు, ఎందుకంటే వారు ఇలా చేస్తే నీవుకూడ కార్యాలయములో ఉండగా వారు ఉల్లఘించే అపరాదములతో నీవును ఏకభవిస్తున్నట్టే. -ఫండమెంటల్స్ అఫీస్టియన్ఎడ్యుకేషన్, 475 (1899). LDETel 89.2
ఈ ఆదివారం చట్టము గూర్చి ఒక ఉద్యమమునకు సంబందించి ప్రత్యకమైన బూరద్వని వినిపిస్తుందని నేను ఆశిస్తున్నాను.మన పత్రాల్లో దేవుని చట్టం యొక్క శాశ్వత విషయం ప్రత్యేకమైనదిగా ఉంటే అది ఉత్తమమైనదని నేను భావిస్తున్నాను..... ఈ ఆదివారము చట్టం జయించటానికి ఇప్పుడు మనము మన శక్తికి మించిన ఉత్తమమైన పని చేయవలసియున్నది. కౌన్సల్ టూ రైటర్స్ అండ్ ఎడిటర్స్ 97, 9 8 (1906). LDETel 89.3
అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆదివారం చట్టము అమలు చేయుదురు
మన దేశం ఆదివారము చట్టము న్యాయబద్ధముగా చేయటానికి మన ప్రభుత్వ సాశనాలు ప్రమాణపూర్వకంగా అంగీకరించినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఒక ఆదివారం చట్టమును అమలులోనికి తీసుకొని వస్తుంది. ఈ చట్టం విషయములో ప్రొటెస్టెంటులు వారికి వున్న ఆస్థితో పాటు ఆ అధికారాలతో చేతులు కలుపుతారు. సంఘమునకు ఉపదేశములు 5: 712 (1889). LDETel 89.4
ప్రొటస్టెంట్లు పోపుల పక్షమునా చేరివారి మొత్తం అదికారం మరియు వారి బలము ఇచ్చివేస్తారు. ఒక జాతీయ చట్టం బలవంతము ద్వారా తప్పుడు సబ్బాతు అమలు చేస్తు మలినమైన రోము యొక్క శక్తికి ప్రాణము పోస్తు ఆమె దౌర్జన్యం మరియు మనస్సాక్షి యొక్క అణచివేతకు పునర్జీవింపచేస్తున్నారు.- మారనాథ 179 (1893). LDETel 90.1
ఇప్పుడు లేక తరువాత ఆదివారం చట్టాలు జారీ చేయబడుతుంది. ది రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్రవరి 16, 1905.త్వరలో ఆదివారం చట్టాలు అమలు చేయబడతాయి, మరియు దేవుని ఆజ్ఞను గైకొనుచు కొద్దిమందిగా వున్న ప్రజలను అ అదికారములో వున్న మనుష్యులు నానా ఇబ్బందులకు గురిచేస్తారు. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 4: 278 (1909). LDETel 90.2
గొట్టెపిల్ల కొమ్మువంటి కొమ్ములుగల మృగం సూచిస్తున్న రాజ్యము దానిలో నివసించువారును, చిరతపులిని పోలియున్న మృగం సూచిస్తున్న పోపును తాను అవలంబించేటట్లు చేస్తుందని ప్రకటన 13 అధ్యాయములో నున్న ప్రవచనము, వ్యక్తము చేస్తున్నది, తన సర్వాధికారము అంగీకారానికి చిహ్నంగా మను సంఘము పరిగనిస్తున్న ఆదివారాచరణనను అమెరిక అమలు పరిచినప్పుడు ఈ ప్రవచనము నెరవేరుతుది...... రాజకీయ అవినీతి న్యాయ దృష్టిని సత్యశక్తిని నాశనం చేస్తుంది. స్వతంత్ర అమెరికాలో సైతం పరిపాలకులు మరియు శాసన సభ్యులలో ప్రజాదరణ దృష్టితో ఆదివారపు ఆచారాన్ని అమలుచేసే ఒక చట్టం కోసం ప్రజలు ఒత్తిడికి తలవంచుతారు.మహా సంఘర్షణ, 578, 579, 592 (1911). LDETel 90.3
ఆదివారం చట్టాము వకీలు ద్వారా వాదనలు ఉపయోగించుచున్నారు
సాతాను సంఘటనలపైన తన సొంత భావమును వివరిస్తాడు మరియు భూమి మీదకి వచ్చిన విపత్తులు అన్నిటికి కారణం ఆదివారం ఆచరించక దానిని ఉల్లంఘించి నందుకే ఇట్టి ఫలితలు వచ్చాయిఅని వారిని ఆలోచించేలాగ చేస్తాడు. ఈ ప్రభావవంతమైన దేవుని ఉగ్రతను శాంతింపజేయాలని మనుష్యులకు ఆలోచనిస్తు ఆదివారము ఆచరణను అమలుచేసే చట్టాలను తయారుచేస్తారు. మాన్యుస్కిప్టిలీజ్ 10: 239 (1899). LDETel 90.4
వేగంగా విస్తరిస్తున్న దుర్మార్గతకు క్రైస్తవ సబ్బాతు పేరుతో జరుగుతున్న అవినీతి కార్య కలపాలే కారణమని ఆదివారా ఆచరణ అమలు జరిగిననాడు సమాజ నీతి ప్రమాణము ఎంతో మెరుగౌతుందని ఈ తరగతి నేతలే సెలవిచ్చుచున్నారు. నిజమైన సబ్బాతు సిద్ధాంతం ప్రబలంగా ప్రకటితమవుతున్న అమెరికాలో ప్రత్యేకించి ఈ దుర్బోద జరుగుచున్నది, అత్యంత విస్తృతంగా బోధించబడుతోందని వారు వాదించెదరు “మహా సంఘర్షణ, 587 (1911). LDETel 90.5
ప్రొటెస్టెంటిజం మరియు కాథలిసిజం సమ్మతించిన చర్య ఇది. ప్రొటెస్టెంటిజం వారితో చేతులు కలిపి సహవాసం చేయుటవలన రోమను అధికారం కట్టపెట్టారు. అప్పుడు దేవుని సృష్టిలో సబ్బాతుకు వ్యతిరేకంగా ఒక చట్టం అమంలోనికి తీసుకొని వస్తారు మరియు అప్పుడు దేవుడు భూమిపై తన “ఆశ్చర్యమైన కార్యము జరిగిస్తాడు. ది ఎస్ డి ఏ బైబిల్ కామెంటరీ 7: 910 (1886). LDETel 91.1
ప్రొటెస్టెంటిజం మరియు కాథలిజం చట్టంతో సంబంధం
రోమనుసంఘం విగ్రహారాధన అధికారము నుండి స్పష్టముగా ఎలాగ దూరముగా వుంటుందో మనము చూడలేము .... మరియు ఇటువంటి మతం కోసం ప్రొటెస్టెంట్లు ఎంతో కాలము నుండి ఎదురుచూస్తున్నారు, అందుకే వారి మీద ఎంతో అభిమానం కలిగియున్నారు కాబట్టి చివరికి ప్రొటెస్టెంటిజంతో ఏకమవుతారు. ఈ కలయకలో కాదలిజం ఈ సంఘంలో ఇటువంటి మార్పు ద్వారా వారికి ఎటువంటి ప్రభావితం కలగదు. ఏ విషయములోను రోమను ఎప్పటికీ మారదు ఇది సహజమైనదే ఇందులో పొరపాటు ఏమిలేదు అని ఆమె వాదిస్తుంది. అయితే చివరికి ప్రొటెస్టెంటిజమే మారుతుంది. స్వేచ్చ అబిప్రాయములు స్వీకరించడం వలన క్యాథలిక్వాదంతో చేతులు కలపవచ్చా లేదా అనేది తన పక్షమున ఆలోచించే విషయము తీసుకొని వస్తుంది.-ది రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 1, 1886. ప్రొటెస్టెంట్ ప్రపంచంలో ప్రబలమైన పాప వ్యక్తితో సమాక్యము ఏర్పర్చుకుంటుంది. మరియు సంఘం మరియు ప్రపంచం అవినీతి సామరస్యంతో ఉంటుంది. ది ఎస్ డి.ఎ బైబిల్ కామెంటరీ 7: 975 (1891) LDETel 91.2
పాత ప్రపచంలో రోమను మతం నవీన ప్రపంచంలో ప్రోటస్టాంటు మతం దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తాన్న ప్రజలు పట్ల అదే విధనాన్ని అవలంభిస్తాయి.- మహా సంఘర్షణ, 616 (1911). LDETel 91.3
ఆదివారం చట్టాలను రోమను గౌరవించును
ఉమ్మడి సిద్ధాంతల ప్రతిపాదికపై అమెరికలో ప్రముక సంఘాలు ఏకమై తమ నిర్ణయాన్ని అమలు పర్చటానికి తమ సంస్థలను ఆదుకోవటానికి ప్రభుత్వాన్ని ప్రబా వితము చేసినప్పుడు ప్రోటస్టంట్ అమెరికా రోము మతాధికార్నీ సూచించే ప్రతిమను చేయటం జరుగుతుంది. పర్యవసానంగా అసమ్మతి వాదులకు శిక్షలు విధించటం తప్పనిసరి అవుతుంది......ప్రోటస్టేంట్ సంపూలు ఆదివారం ఆచరించాలి అని బలవంతము చేసే విషయములో చూస్తే అది బలవంతముగా పేపసిని పూజించటమే. మత పరమైన విదిని లౌకిక అధికారం అమలుపర్చటం ద్వారా సంపూలు స్వయముగా మృగము యొక్క విగ్రహాన్ని చేస్తున్నట్టే. కనుక అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆదివారా చరణనను బలవంతము అమలు చేయుటం వాస్తవికంగా మృగము దాని ప్రతిమను బలవంతముగా పూజించటమే.- మహా సంఘర్షణ, 445, 448, 449 (1911). LDETel 91.4
ప్రొస్టెస్టెంట్స్, రోమను అధికారమును తమచేతుల్లోనికి లాగుకోవడానికి ఆమే చేతులు సముద్రములు అవతలకి విశాలంగా చాపియునప్పుడు, ఈ మూడు అదికారముల కలయుకలో ఆధ్యాత్మిక విషయములో చెయి చేయి కలిపి అఘోరమైన కార్యములు చేయుటకు చేరినప్పుడు. మన దేశం తన రాజ్యాంగ ప్రతి సూత్రాన్ని తిరస్కరించి ఒక ప్రొటెస్టంట్ మరియు రిపబ్లికన్ ప్రభుత్వం అబద్దాలపోపుల మరియు మోసలను ప్రచారము కోసం ఏర్పాటు చేయవలసివచ్చెను. అప్పుడు సాతాను తన ఘనమైన కార్యములు చేయుటకు సమయము వచ్చినదని, మరియ అంతము సమీపంలో ఉందని మనము గ్రహించెదము.. సంఘమునకు ఉపదేశములు. 5: 451(1885) LDETel 92.1
కోల్పోయిన అధికారము రోమ తిరిగి పొందుకొనును
మనము చివరి సంక్షోభం యొక్క ముఖ్యమైన క్షణమునకు సమీపించినప్పుడు ప్రభు యొక్క సాధకములైన వారి మద్య సామరస్యం మరియు ఐక్యత అనేది ఉంటుంది. ప్రపంచ మంత అలజడులతోను మరియు యుద్ధలతోను మరియు బేదాలతో నిండి ఉంటుంది. ఇంకా ఒక యజామానుడు క్రింద అంటే-- పోపుల అధికారం— తన వ్యక్తిగత సాక్ష్యములో ప్రజలేల్లరు ఏకమై దేవుని వ్యతిరేకించెదరు. ఈ ఐక్యత గొప్ప మత భ్రష్టత్వము దృఢముగా బలపరచబడింది. సంఘమునకు ఉపదేశములు.7: 182 (1902) ఆదివారము సబ్బాతు దినముగా పాటించవలసిన చట్టాలు బలవంతం చేయుట వలన, ప్రజలు ఆమోదించిన సూత్రలను బట్టి ప్రభుత్వాన్ని నెలకొల్పిన చట్టాల నుండి జాతీయ మత భష్టత్వాన్ని తీసుకువస్తాయి. పోపుల మతమును పాలకులు అంగీకరిస్తారు కాబట్టి దేవుని దర్మశాస్త్రమును త్రోసిపుచ్చి విలువలేకుండ చేయుదురు.మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 7: 192 (1906). LDETel 92.2
విజయానికి గొప్ప మానసిక అందకారం అనుకూలంగా ఉండేటట్లు వ్యక్తమౌతుంది. గొప్ప మానసిక వికాసం కూడ దాని విజయానికి దోహద పడ్తుందని ఇంకా తెలపవలసివుంది. ది స్పిరిట్ అఫ్ ప్రొఫెక్సిస్,4: 390 (1884) సంఘ సంస్థలు ప్రభుత్వ మద్దతు కొరుతు ప్రస్తుతం సాగుతున్న ఉద్యమాలలో ప్రోటెస్టాంటులు పొపు మతవాదుల అడుగుల్లో అడుగు వేస్తు సాగుతున్నారు. అంతేకాదు, పాత కాలంలో ప్రొటెస్టంట్ అమెరికాలో ఆ సంఘం కోల్పోయిన ప్రాబల్యన్ని తిరిగి సంపాదించుకోటానికి వారు పోపు వ్యవస్థల ద్వారాలు తెరుస్తున్నారు - మహాసంఘర్షణ, 573 (1911 ). LDETel 92.3
జాతియ ఆదివారం చట్టము అంటే అర్ధము జాతీయ స్వధర్మత్యాగము
పోపుల సంస్థలు యొక్క శాసనాలు వత్తిడి చేయుటవలన ప్రజల ఆదరణ కొరకు పాలకులు, శాసనసభ్యులు ఆదివారం చట్టమునకు దాసోహమౌదురు. ఆవిదముగా దేవుని చట్టం ఉల్లంఘించుట ద్వారా మన దేశం నీతి నుండి పూర్తిగా తొలగిపోతుంది...... రోమ సైన్యము దండెత్తుకొని వచ్చినప్పుడు యెరూషలేముకు నాశనం రాబోతుందని శిష్యులకు సూచనగావున్నట్టు, ఈ మత భ్రష్టత్వము కూడ దేవుని యొక్క సహనం పరిమితి అయిందని అది చినరి దశకు వచ్చిందని మనకు ఒక సంకేతం కావచ్చు.. సంఘమునకు ఉపదేశములు 5: 451 (1885). LDETel 92.4
ఈ దినము యెహోవా చేత ఆశీర్వాదించబడి పరిశుద్ధపరచబడినందున, మనము వారములో మొదటి రోజైన ఆదివారం పవిత్రమైన విశ్రాంతిదినంగా గౌరవించలేము కాబట్టి మనము దృఢమైన నిర్ణయము తీసుకొనవలెను. మరియు మనము ఆదివారం పరిశుద్ధ దినముగా గౌరవించినటైయితే మనము గొప్ప మోసగాడు పక్షమున చేరుటకు మనకు మనమే స్థానము ఏర్పాటు చేసుకొనుచున్నాము. ఎప్పుడైతే దేవుని దర్మా శాస్త్రమును ప్రక్కన పెట్టి విలువలేకుండ చేసినప్పుడే మతభ్రష్టత్వము అది జాతీయ పాపంగా పరిగనింపబడుతుంది. యెహోవా తన ప్రజల తరఫున కార్యముచేయును..-సెలెక్టెడ్ మెసేజ 3: 388 (1889). LDETel 93.1
అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలు అభిమానించేవారు, అయితే వారు మత స్వేచ్చను పరిమితం చేసినప్పుడు, ప్రొటెస్టెంటులు వారికి లొంగిపోయారు, ఇక రోమను పోపుల మతమునకు మద్దతునిచ్చేదరు. వారి అపరాధము తూయబడినప్పుడు అది పూర్తిగా నిండిపోయునది. మరియు “వారి జాతీయ మతభ్రష్టత్వం “పరలోక పుస్తకాలలో నమోదు చేయబడుతుంది. రివ్యూ అండ్ హెరాల్డ్, మే 2, 1893. LDETel 93.2
జాతియ స్వధర్మ త్యాగము వెంబడి జాతయ విప్పత్తు వచ్చును
మన దేశం, దాని శాసన మండలులలో, మత సంబందమైన అధికారాలకు సంబందించి మనుషుల యొక్క భావాలను కట్టుబాటులో ఉంచుకొనుటకు ఆదివారా చరణన బలవంతముగా అమలు చేస్తారు. మరియు ఏడవ రోజు సబ్బాతు దినముగా ఆచరించేవారికి వ్యెతిరేకమైన అధికారమును తీసుకొనిరావటం జరుగుతుంది. మన దేశంలో దేవుని యొక్క ఉద్దేశాలు మరియు ప్రయోజనాలు రద్దు చేయబడతాయి. మరియు జాతీయ మతభ్రష్టత తరువాత జాతీయ నాశనాన్ని అనుసరించును.-ది ఎస్ డి ఏబైబిల్ కామెంటరీ 7: 977 (1888). సాతాను విధానంలో పని చేస్తున్నపుడు, దేశ పాలకులు పాప వ్యక్తిపక్షమున తమకి తాము స్థాపించుకునేటప్పుడు ఇది జాతీయ మతభ్రష్టుత్వమునకు సమయం. అది అపరాధం యొక్క కొలత పూర్తి అయింది. జాతీయ మతభ్రష్టత్వము జాతీయ నష్టానికి సంకేతంగా ఉంది. సెలేబ్రేడ్ మెసేజస్ 2: 373 (1891). LDETel 93.3
రోమన్ కాథలిక్ సూత్రాలు రాష్ట్ర సంరక్షణ మరియ పోషణలోనికి తీసుకోబడతాయి. ఈ జాతీయ మతభ్రష్టత్వము వేగవంతముగా జాతీయ వినాశనమునకు నడిపిస్తుంది. -ది రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 15, 1897. LDETel 93.4
ప్రొటెస్టంట్ సంఘాలు లౌకిక ఆదికారముతో ఐక్యమై అబద్ధ మతాన్ని పోషించ బడుచుండగా వారి పూర్వీకులు తీవ్ర హింసను భరిస్తారనే వ్యతిరేకించినప్పుడు, సంఘము మరియు రాష్ట్ర మిశ్రమ అధికారముతో పోపుల సబ్బాతు అమలు చేయబడు తుంది. అప్పుడు జాతీయ మతభ్రష్టత్వం తర్వాత అది మాత్రమే ప్రపంచ వినాశనంతోనే ముగుస్తుంది -ఎవాంజలిజం, 235 (1899). LDETel 94.1
సంఘములకు సబందించిన సంస్థలను పోషించుటకుగాను వారి శాసనాలు అమలు చేయడానికి రాష్ట్ర అధికారము ఉపయోగించినప్పుడు. ప్రొటెస్టంట్ అమెరికా పోపుల విగ్రహాన్ని రూపొందిస్తుంది, తద్వార జాతీయ మతభ్రష్టత్వం ఆ తర్వాత అది మాత్రమే ప్రపంచ వినాశనంతోనే ముగుస్తుంది .- దిఎస్ డి ఏబైబిల్ కామెంటరీ 7: 976 (1910). LDETel 94.2
సర్వము ఆదివారం చట్టములే
చరిత్ర పునరావృతమవుతుంది. తప్పుడు మతాన్ని హెచ్చించెదరు. బబులోను యొక్క విగ్రహము ఏర్పాటు చేసిన విదముగానే వారంలోని మొదటి రోజు ఏవిదమైన పవిత్రత ఉండకుండ సాదారణ పని దినముగా పరిగనించబడుతుంది. అయితే ప్రతి దేశ ప్రజలు మరియు ప్రతిభాష మాట్లాడేవారు మరియు ప్రతి ప్రజలు వారు ఏర్పటుచేసిన ఈ ప్రబలమైన సబ్బాతును ఆరాదించమని ఆజ్ఞాపించేదరు..... ఈ మొదటి రోజు ఆరాధనను అమలు చేసిన శాసనం ప్రపంచమంతటికి పాకుతుంది.- ది ఎస్ డి ఏ బైబిల్ కామెంటరీ 7: 976 (1897). LDETel 94.3
అమెరికా వంటి, మత స్వేచ్చ కలిగిన దేశం, పోపుల అధికారముతో ఐక్యమై మనుషుల మనస్సాక్షికి వ్యతిరేకముగ తప్పుడు సబ్బాతు గౌరవించాలని బలవంతము చేయుదురు, ప్రపంచంలోని ప్రతి దేశముయొక్క ప్రజలు వారి ఉదాహరణ అనుసరించు టకు దారి తీస్తుంది. సంఘమునకు ఉపదేశములు 6: 18 (1900). ఆఖరి గొప్ప సంగ్రామములో సబ్బాతు ప్రశ్న గూర్చి సమస్యగా ఉంటుంది. ఇందిలో ప్రపంచమంత భాగస్వాములౌతారు. సంఘమునకు ఉపదేశములు 6: 352 (1900). విదేశాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క ఉదాహరణను అనుసరిస్తాయి. ఆమే నడిపించినప్పటికిని, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో అదే శ్రమలు మన ప్రజల మీదకి వస్తాయి. సంఘమునకు ఉపదేశములు 6: 395 (1900). LDETel 94.4
ఈ అంతిమ నాటకములో సత్యమునకు బదులుగా తప్పుడు నటనసాగుతుంది, ఈ ప్రత్యామ్నాయము ఎప్పుడైతే విశ్వవ్యాప్తి అవుతుందో అప్పుడు దేవుడు తనను తాను బయలుపర్చు కొనేను. మనుష్యులు నియమాలు దేవుని నియమాల కంటే పైకి లేచినప్పుడు, ఈ భూమి యొక్క అధికారము వారములో మొదటి రోజున ఆరాదించాలి అని బలవంతం చేయటానికి ప్రయత్నించినప్పుడు,దేవుని కార్యముచేయుటకు సమయం ఆసన్నమైనదని తెలుసుకోండి.-ది ఎస్ డి ఏబైబిల్ కామెంటరీ 7: 980 (1901). LDETel 94.5
ఈ అంతిమ నాటకములో దేవుని చట్టమునకు బడులుగా మనుష్యులు నియమాల ప్రత్యామ్నాయముగాను బైబిల్ సబ్బాతుస్థానంలో ఆదివారం ఆచరణలుకొనసాగతాయి. ఈ ప్రత్యామ్నాయము ఎప్పుడైతే విశ్వవ్యాప్తి అవుతుందో అప్పుడు దేవుడు తనను తాను బయలుపర్చు కొనేను. అప్పుడు ఆయన మహిమ ప్రభావముతో ఈ భూమిని వణికించును. సంఘమునకు ఉపదేశములు 7 : 141 LDETel 95.1
ప్రపంచమంత ఆదివారం చట్టమునకు మద్దతు ఇచ్చున
మాకు సత్యమున్నది, మా మద్య అద్భుతాలువున్నాయి, ఆకాశం నుండి దేవ దూతలు మాతో మాట్లాడారు మరియు వారు మాతో నడుస్తారు, గొప్ప శక్తి మరియు సూచనలు మరియు అద్భుతాలు వారి మద్య చేసాము అని దుష్టులు తమకు సత్యాన్ని కలిగి ఉన్నట్లు ప్రకటించెదరు మరియు వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తాత్కాలిక సహస్రాబ్ది ఇదే,ప్రపచమంతా ఆదివారం చట్టాలకు అనుగుణంగా మార్చ బడింది.- సెలెక్ట్డ మెసేజస్ 3: 427, 428 (1884). - LDETel 95.2
ఆదివారం ఆచరణకు మద్దతునివ్వకుండ పోపుల అదికారమును దిక్కరించి గౌరవించనందుకు, ఈ సంస్థ క్రైస్తువులకు వ్యతిరేక అదికారము కలిగివున్న రని, ప్రపంచమంత శత్రుత్వంతో సెవెంతుడే అడ్వెంటిస్ట్ వ్యతిరేకంగా కదులుతుంది.” (టెస్టమోనిస్ మినిస్ట్రీస్ఎండ్ గాస్పల్ వర్కర్స్.-37 (1893). LDETel 95.3
దేవుని ధర్మశాస్త్రమును అణిచి వేసి ప్రజలను బలవంతముగా అగీకరించేటట్టు మానవ చట్టాలను ఏర్పాటు చేస్తారు. వారు చేసిన కల్పితాలు, సలహాలను మరియు ప్రణలికలు మనుష్యులు గమనిచుచున్నారు. ప్రపంచమంత ఆదివారం ఆచరిస్తుండగా స్వల్ప సంఖ్యవున్న ఈ ప్రజలు, దేశచట్టాల ప్రకారం ఎందుకు చేయకూడద అని వారు అంటారు. ఎంమ్స్ ? -163, 1897. LDETel 95.4
క్రైస్తవ మత సామ్రాజ్యంలో వివాదాస్పద కేంద్రాలు
పేరుగాంచిన క్రైస్తవ ప్రపంచము ఒక గొప్ప నిశ్చయమైన నటనాలయముగ వుంది. పెపాసీ యొక్క ఉదాహరణ తర్వాత, అధికారంలో ఉన్న మనుష్యులు మనస్సాక్షిని నియంత్రించే చట్టాలను అమలుపరుస్తారు. పోల్గొంటున్న ప్రతి దేశము ఈ బబులోను తన వ్యభిచార మద్యమును సమస్తజనులకు త్రాగించును. ఈ సమయమును గూర్చి ప్రకటన గ్రంధకర్త యోహాను ఇలా ప్రకటిస్తున్నాడు: (ప్రకటన 18: 3-7; 17:13, 14,వీరు ఒకే మనస్సు కలిగి ఉంటారు” అందరు ఐక్యమత్యము కలిగివుంటారు, ఒక ఉన్నతమైన సామరస్యం, సాతాను దళాల సమఖ్యగావున్నారు మరియు వారి శక్తి మరియు ఆదికారము ఆ మృగానికి అప్పగించెదరు. కాబట్టి మతపర స్వాతంత్ర్యం వ్యతిరేకంగా అదే ఏకపక్షంగా, అణిచివేత శక్తిని వ్యక్తంచేస్తారు--- మనస్సాక్షి యొక్క కట్టడాల ప్రకారం దేవుని పూజించే స్వాతంత్రం,గత కాలంలో అది పీడన మతపరమైన ఆచారాలు మరియు రోమను యొక్క సంప్రదాయములు అనుగుణంగా తిరస్కరించే వారిని శిక్షించెదరు.. సెలేబ్రేడ్ మెజన్స్ 3: 392 (1891). LDETel 95.5
విశ్వాసం మరియు అపనమ్మకము మధ్య ఉన్న మహా పోరాటములో క్రైస్తవ ప్రపంచ మంత పాల్గొంటుంది. రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్రవరి 7, 1893. LDETel 96.1
క్రైస్తవ లోకమత రెండు వర్గాలుగా ఏర్పడుతుంది. దేవుని ఆజ్ఞలను, యేసు గూర్చిన విశ్వాసాన్ని కాపాడువారు ఒకవర్గం. క్రూరమృగనికి దాని ప్రతిమకు నమస్కరించి దాని ముద్రను పొందేవారు ఇంకో వర్గం .-మహాసంఘర్షణ, 450 (1911). LDETel 96.2
సబ్బాతు క్రైస్తవ లోక మంతటా వివాదాంశం అయినందువల్ల ఆదివారం ఆచరణను అమలుకు మతలౌకిక అధికారులు చేతులు కలిపి కృషిచేస్తున్నందు వలన అదిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యమైన అంశాన్ని కొద్దిమంది సభ్యులుగల ఒక వర్గం వ్యతిరేకించటం ప్రపంచమంతటా విద్వేషాన్ని పుట్టిస్తుంది.. మహాసంఘర్షణ, 615 (1911). LDETel 96.3
క్రైస్తవ లోకములో వివిద పాలకులు ఆజ్ఞలు ఆచరించే ప్రజలను వ్యతిరేకంగా జారీచేసే శాసనాలు ప్రభుత్వ పరిరక్షణను ఉపసంహరించి తనను నాశనం చేయుటానికి పూనుకొన్న శత్రువులకు వారిని విడిచి పెట్టగా దేవుని ప్రజలు నగరాలు ,పట్టణాలు మరియు గ్రామాలు విడిచిపెట్టి ప్రజలు లేని ఏకాంత స్థలాల్లో చిన్నచిన్న గుంపులుగా నివసిస్తారు. అనేకులకు పర్వతాల్లోన్ని స్థలాలు ఆశ్రయ దుర్గాలవుతాయి.....కానీ అన్ని దేశాలలో మరియు అన్ని వర్గాలలో, అధికులలోను మరియు అధములలోను, దనికులు మరియు పేదలు, నలుపు మరియు తెలుపు వారిలోను అన్యాయమైన మరియు క్రూరమైన బానిసత్వానికి గురి అవుతారు. దేవుని ప్రియమైన బిడ్డలు గొలుసులతో కట్టుబడి బందించబడతారు. ఇలాగ శ్రమలు పాలైతారు, మరణ శిక్ష క్రింద ఖైదుల్లో మగతారు, కొందరు చీకటి కొట్లలో మరణించేందుకు మిగులివుంటారు. - మహా సంఘర్షణ 626 (1911). LDETel 96.4
అలక్ష్యము చూపించవద్దు.
మన సంఘానికి గుర్తులుగల లక్షణాలునువున్నాయని ఎవరైనా పరిష్కారానికి వస్తే ఇవే వారిని జాగ్రత్తగా నడిపించును.వారు చాలా జాగ్రత్తగా ఉండకపోతే, ఆగ్రహా అనుభూతి చెందుతారు, ఎందుకంటే ఆదివారం పని చేయటవలన వారి స్వేచ్చను తీసివేయ బడిన దని తప్పుగా తెలియజేసారు. ఈ అంశంపై భావోద్వేగమలో తేలిపోవద్దు అయితే ప్రతిదీ కూడ దేవునికి ప్రార్థించి తీసుకొనవలెను. ఆయన మాత్రమే పాలకులు శక్తిని నిరోధించ గలడు.అతురతగా నడవవద్దు. మోసపూరితమైన వేషమును బట్టి తమ స్వేచ్చా గూర్చి ఎవ్వరూ అజ్ఞానముగా పోగుడుకొనవద్దు. కానీ దేవుని సేవకులు, అందరినీ గౌరవించండి. సోదర ప్రేమ. దేవునికి భయపడండి. రాజును ఘనపరచుము (1 పేతురు 2:17). LDETel 96.5
ఎవరినైతే ఇరుకు స్థలమునకు తీసుకొని రాబడతారో వారికి ఇవ్వబడిన ఈ సలహా నిజముగా విలువగలది. తిరస్కారము అనేది ఎప్పుడు చూపించకూడదు. లేదా హాని కరమైనదిగా చూపించి వివరించవచ్చును.. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 2: 193, 194 (1898). LDETel 97.1
ఆదివారం పని నుండి దూరంగానుండుట
దక్షిణ పోలమునకు సంబందించి, (1880 మరియు 1890లలో అమెరిక సంయూక్త దక్షిణ రాష్ట్రాలలో (ఆదివారపు చట్టం అమలు ముఖ్యంగా తీవ్రంగా ఉంది. అమెరికన్ రాష్ట్ర వార్త పత్రిక (ది రివ్యూ అండ్ హెరాల్డ్, 1943, 517-562) చూడండి. సాద్యమైనంత వరకు జాగ్రత్తగాను మరియు వివేకంతో ఇక్కడ పనిచేయవలసివుంది, మరియు క్రీస్తు పని చేసే పద్ధతిలో అది చేయాలి. ఆదివారం మరియు సబ్బాతు విషయములో మీరు ఏమి నమ్ముచున్నారు అని ప్రజలు త్వరలోనే గమనించి ఇక ప్రశ్నలు వేయుదురు. అప్పుడు మీరు వారికి తెలియజేయవచ్చు, కానీ మీ పనిని ఆకర్షించే విధంగా వుండకూడదు. ఆదివారం మీరు జీతమునకు పని చేయచున్నారు. అయితే ఆపని నుండి మీరు విరమించుకొనవసరములేదు..... ఆదివారం పని నుండి దూరంగా ఉండటం మృగం యొక్క గుర్తును పొందుకునట్టుకాదు.......... ఏ ప్రాంతములో వ్యతిరేకత బలంగా ఉంటుందో అక్కడ హింసరావడానికి కారణమౌతుంది. ఆదివారం నాడు పనికి వెళ్లవచ్చు చేయవచ్చు, అని అంటే మన సహోదరులు గమనించాలి ఒకవేళ అలాగే అయునటైయితే ఆ దినము కేవలం ప్రత్యకముగా సూవార్త సేవకే యదార్ధంగా ఉపయోగించుము..-ది సదరన్ వర్క్, 69, 70 (1895). LDETel 97.2
మీ పనిని ముగించుము” ఆదివారం ఆచరణ ముందుకు కొనసాగించుము అని ఒక వేళ వారు ఇక్కడకు వచ్చి అన్నప్పుడు నేను కు మరియు నీ వునికి మద్య అది వివాదము కదా? కాబట్టి నీ పనిని అలాగే కొనసాగించుము అని చెప్పెను. ఎమ్ఎస్ 163, 1898. LDETel 97.3
ఆదివారమునాడు పవిత్రముగా ఆరాధించాలని మన పొరుగువారు ఉద్దేశపూర్వ కముగా తీరికగాను మరియు స్వేచగా వారు ఉండుటకు ముందుగానే నిర్ణయుంచు కొనిన ప్రకారముగా ఆ రోజు కూలివారిని ఏర్పటుచేసుకోవటం మనము చూచినప్పుడు వారిని ఎ గతాళి చేసే విధముగా మనము ఆనందించకూడదు. మన సోదరీమణులు ఆదివారం కేవలం ఇంటి పనిచేసుకొవటము కోసమే నిర్ణయం తీసుకోవలసివుంది. సెలెక్టడ్ మెసెజన్స్: 399 (1889). LDETel 97.4
ఆదివారం ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనుట
ఆదివారం చట్టాలు బలవంతముగా అమలోకి వచ్చినప్పుడు మీరు ఏమి చేయాలనే మీ ప్రశ్నకు నేను సమాధానము చెప్పుటకు ప్రయత్నిస్తాను. అలాంటి సంక్షోభము మన మీదకి వచ్చుటకు సమీపించుచున్నదని మనము అనుకోనుచుండగా అదే సమయంలో దేవుడు నాకు ఇచ్చిన సత్యము బట్టి, క్రింద నుంచి పైవరకు వున్న అదికారులు ఆదివారం పాటించాలని బలవంతముగా అమలు చేయునప్పుడు ప్రజలు వినయ పూర్వకముగా అంగీకరస్తారు, అప్పుడే సెవెంతుడేఎ డ్వెంటిస్టులు తెలివిగా వ్యహరించాలి, సాదారణ పని నుండి దూరంగా వుండి ఆ దినమందు సువార్త పని నిమిత్తము వెచ్చించాలి. ఆదివారం చట్టాలను ఉల్లంఘించిన యెడల వారు హింసించుటకు బలపరిచెదరు, కాబట్టి మతాన్ని ఘాడంగా ప్రేమించే వీరభక్తులు వీటిని అమలు చేయాలని కోరుకున్న వారికి మనము చట్టమును ఉల్లంఘించే వారముఅనే పేరుపెట్టుటకు వారికి అవకాశము ఇవ్వవద్దు....... నేరాన్ని గురిచేసేది ఏదైతేవుందో దనిని చేయకుండా ఆ పని నుండి విరముంచుకొని శాంతిని నెలకొల్పాలనే జ్ఞానాన్ని కనపరుస్తాడు కాబట్టి ఒకరు మృగం యొక్క గుర్తును పొందుకోరు .... ఆదివారంనాడు ప్రభువు కోసం ఎంతో పనిని సాదించడానికి దానిని ముందుకు కొనసాగించడానికి అనేక దారులు ఉపయోగించు కొనవచ్చు. ఈ రోజున బహిరంగ సమావేశాలు మరియు ఉజీవ కూడికలు నిర్వహించు కొనవచ్చును. ఇంటిట దర్శంపులు చేయవచ్చు. రచయితలు తమ వ్యాసాలను రాయడానికి ఈ రోజు అంకితం చేయవచ్చు. సాద్యమైతే ఆదివారం మతపరమైన సేవలు నిర్వహించవచ్చు. ఈ సమావేశాలు ఎంతో ఆసక్తికరంగా జరిగించండి నిజమైన ఉజ్జీవమైన పాటలు పాడండి మరియు రక్షకుని యొక్క ప్రేమలో వున్న శక్తిని మరియు అభయమును గూర్చి మాట్లాడండి.-సంఘమునకు ఉపదేశములు 9: 232,233 (1909). LDETel 97.5
వేర్వేరు ప్రదేశాల్లో సభలను నిర్వహించడానికి మరియు వైద్యసేవ పరిచర్య చేయడానికి విద్యార్థులను తీసుకోని వెళ్లండి. వారు ఇంటింటికి వెళ్ల సేవ చేస్తుండగా ప్రజల విషయలు తెలుసుకొని మరియు వారికి సత్యాన్ని తెలియజేసే అద్భుతమైన అవకాశాన్ని వారికి ఉంటారు. ఈ విధముగా ఆదివారం సేవలో గడిపితే ప్రభువు ఎల్లప్పుడూ అంగీ కరిస్తాడు. -సంఘమునకు ఉపదేశములు 9: 238 (1909) LDETel 98.1
ప్రతిపక్షం ద్వారా అందమైన సత్యమును స్పష్టంగా కనపర్చుట
ప్రపంచము మరియ సంఘము ఐక్యమై ఎలాంటి దుర్భలమైన చట్టాలు అమల్లోకి తీసుకొని వచ్చిన దేవుని ఆజ్ఞలకు విధేయులైయుండాలని ఆశక్తివున్నా వారు పెరుగుతునే వుంటారు. దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన ప్రతి అభ్యంతరము సత్యమును ప్రకటించే పురో గతికి దారి తీస్తుంది మరియు మనుష్యుల ముందు దాని విలువలను ప్రదర్శించి వాదించుటకు తోడ్పడుతుంది. సత్యములో అందము మరియు శక్తివున్నది. అంతేగాని వ్యతిరేకము మరియు హింసైనను కనపరచలేదు.-మాన్యుస్కిప్టు రిలీజ్ 13:71, 72 (1896). LDETel 98.2
ఈ సమయంలో, ఆదివారం పాటించటానికి బలవంతము చేసి ప్రయత్నాలు అలాంటివి జరిగినటైయితే, అబద్దమునకు విరుద్ధంగా సత్య సబ్బాతు ప్రపంచమునకు మరంత ఎక్కువుగా తెలియజేసే గొప్ప అవకాశముంది. మన కంటే ఎంతో ముందు దేవుని యొక్క కాపుదలవున్నది. నాలుగవ ఆజ్ఞ సబ్బాతు శాసన సమావేశాలకు ముందు ప్రవేశపెట్టుటకు ఈ ఆదివారం గూర్చి ప్రశ్న కూటమిలో తీసుకొచ్చుటకు ఆయనే అనుమతించాడు. ఆ విధంగా ప్రసిద్ధిగాంచిన ప్రజ నాయకులు నిజమైన సబ్బాతుకు అనుకూలంగా దేవుని వాక్యన్ని సాక్ష్యమివ్వడానికి శ్రద్ధ వహించేదరు.-మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 2: 197 (1890). LDETel 98.3
మనుష్యుల కాదు
దేవునికే విధేయత చూపించవలెను దేవుని వాక్యము యొక్క అవసరతలు స్పష్టముగా నిర్లక్ష్యంచేయడమా లేదా తమ స్వేచ్చను కోల్పోవడమా అనే విషయములో సత్యానికి అనుగుణంగా అనుసరించే వారిని ఎంచకోవటానికి ఇప్పుడు పిలపు ఇవ్వబడినది. మనము దేవుని వాక్యాన్ని అంగీకరిస్తు అలాగే మానవ ఆచారాలను మరియు సంప్రదాయాలను పాటించిన మనుష్యుల మధ్య నివసించుచు క్రయ విక్రయములు చేయుచు మన హక్కులను సాదించుకోనుటకు ఇప్పటికీ అనుమతివున్నది. కానీ దేవుని పట్ల మన యదార్థతను కాపాడుకోవలసి వస్తే మనుష్యుల మద్య మన హక్కులు వదులుకోవలసివుంటుంది. అదే దేవుని ఆజ్ఞలకు విరోదులైన వారు మత విశ్వాసాల విషయంలో స్వతంత్ర తీర్పును అణిచివేసేందుకు మరియు మనుష్యలు యొక్క మనస్సాక్షిని నియంత్రించడానికి కట్టబాటు తోవుంటారు ........ మానవ ప్రభుత్వం నియామకము మరియ ఆలోచన ద్వారావిది, దైవ ఏర్పాటుఅని దేవుని ప్రజలు బావించెదరు. మరియు దాని అదికారం దాని చట్ట బద్దమైన పరిధిలో ఉన్నంత వరకు పవిత్రమైన బాద్యతని విధేయత నేర్పించుటకు మాదిరిగా వున్నది. అయితే దేవుని వాదనలతో తన వాదనలు వివాదమునకు వచ్చినప్పుడు, నేను మనుష్యుల కంటే దేవునికి కట్టుబడివున్నామని ఎంచుకొనవలేను. మానవుల శాసనములన్నటిపైన దేవుని వాక్యము అదికారము కలిగియున్నదని గుర్తించి మరియు విధేయతను కలిగియుండాలి దేవుడు ఇట్లనెను, అది దేని కొరకు ప్రక్కన పెట్టకూడదు. సంఘము లేక దేశం ఇట్లానేను, భూలోక అదికారము లన్నిటికిపైన క్రీస్తు కిరీటము హెచ్చించవలేను. ది హోమ్మిషనరి నవంబరు 1,1893. LDETel 99.1
సాతను అధికారమునకు మనము తలవంచినట్లైయితే ఈ లోక రాజ్యములు మనుష్యులకు అనుగ్రహిస్తాడు.ఎందరో ఇలా చేసి పరలోకమును వదులుకొన్నారు. పాపము చేయుట కంటే మరణించుట మేలు. దొంగలించుట కంటే అడుగుట మేలు,అబద్ద మాడుటకంటే ఆకలిగొనియుండుట మేలు. -సంఘమునకు ఉపదేశములు: 495,1880. LDETel 99.2