ప్రవక్తలు - రాజులు

2/68

ప్రభువు ద్రాక్షతోట

శ్రేష్ఠమైన పరలోక వరాల్ని లోక ప్రజలందరికీ అందించాలన్న ఉద్దేశంతో అబ్రహాముని తన విగ్రహారాధక బంధుజనుల్ని విడిచిపెట్టి కనానులో నివసించటానికి దేవుడు పిలిచాడు. “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు.” అన్నాడు. ఆది. 12:2. అబ్రహాముకి గొప్ప గౌరవాన్నివ్వటానికి దేవుడు పిలిచాడు. అది లోకానికి దేవునిగూర్చి సత్యాన్ని, యుగాల పొడవున కాపాడి పరిరక్షించే ప్రజలకు తండ్రిగా ఉండటమన్న గౌరవం; అది వాగ్దత్త మెస్సీయాలో ఏ జనులందరూ ఆశీర్వాదం పొందుతారో ఆ ప్రజలకు తండ్రిగా ఉండటమన్న గౌరవం. PKTel .0

మనుషులు నిజమైన దేవుడు ఎవరో ఎరుగని దుస్థితిలో ఉన్నారు. వారి మనసులు విగ్రహారాధనతో బూజుపట్టి ఉన్నాయి. “పరిశుద్దమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియు” అయిన (రోమా. 7:12) దైవ నియమావళి స్థానే తమ క్రూర, స్వార్థపూరిత ఉద్దేశాలకు అనుగుణమైన చట్టాల్ని ప్రవేశ పెట్టటానికి మనుషులు ప్రయత్నిస్తున్నారు. అయినా కరుణామయుడైన దేవుడు వారిని ఇకలేకుండా తుడిచివేయలేదు. తన సంఘంద్వారా తనను తెలుసు కునేందుకు వారికి అవకాశం ఇవ్వటానికి దేవుడు సంకల్పించాడు. తన ప్రజల జీవితాల్లో వెల్లడయ్యే నియమాలు మానవుడిలో దేవుని నైతిక స్వరూపాన్ని పునరుద్ధరించే సాధనం కావాలని దేవుడు సంకల్పించాడు. PKTel .0

దైవ ధర్మశాస్త్రాన్ని ఘనపర్చటం, ఆయన అధికారాన్ని కొనసాగించటం జరగాలి. ఈ సమున్నత కర్తవ్యాన్ని ఇశ్రాయేలీయుల ఇంటివారికి ఆయన అప్పగించాడు. తమకు పరిశుద్ధ ధర్మనిధిని అప్పగించేందుకు వారిని లోకంనుంచి వేరుచేశాడు. వారిని తన ధర్మశాస్త్రానికి ధర్మకర్తలుగా నియమించాడు. తన్నుగూర్చిన జ్ఞానాన్ని వారిద్వారా భద్రపర్చాలని ఉద్దేశించాడు. చీకటితో నిండిన లోకంలో పరలోక కాంతి ఈవిధంగా ప్రకాశించాల్సి ఉంది. సజీవుడైన దేవుని సేవించటానికి విగ్రహారాధన నుంచి తొలగవలసిందంటూ ప్రజలకి విజ్ఞప్తిచేస్తూ ఒక స్వరం వినిపించాల్సిఉంది. PKTel .0

“మహాశక్తివలన బాహుబలమువలన” దేవుడు తాను ఎన్నుకున్న ప్రజల్ని ఐగుపు నుంచి విమోచించి తీసుకువచ్చాడు. నిర్గమ. 32:11. “ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్య సూచక క్రియలను, హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి.” “ఆయన ఎట్టి సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానముమీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను.” కీర్త. 105:26, 27; 106:9. మంచి దేశానికి వారిని తీసుకువచ్చేందుకు బానిసత్వం నుంచి రక్షించాడు. అది తమ శత్రువులనుంచి వారికి ఆశ్రయంగా ఉండేందుకు దేవుడు సంకల్పించి సిద్ధంచేసిన దేశం. వారిని తన దగ్గరకు తెచ్చుకుని తన దివ్య బాహువుల పరిరక్షణలో ఉంచాలని సంకల్పించాడు. తన దయాళుత్వానికి, కృపకు ప్రతిస్పందనగా వారు ఆయన నామాన్ని ఘనపర్చి లోకంలో ఆయన్ని మహిమపర్చాల్సి ఉన్నారు. PKTel .0

“యెహోవావంతు ఆయన జనమే. ఆయన స్వాస్థ్యభాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపనువలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడురేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కలమీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతోకూడ ఉండలేదు.” ద్వితి. 32:9-12. ఇశ్రాయేలీయులు సర్వశక్తుని నీడను నివసించేందుకు ఆయన ఈవిధంగా వారిని తనవద్దకు తెచ్చుకున్నాడు. అరణ్య సంచారంలో ఆశ్చర్యకరమైన కాపుదల పొంది తుదకు వారు వాగ్దత్త దేశంలో దైవ ప్రసన్నతగల జాతిగా స్థిరపడ్డారు. PKTel .0

లోకంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రతీ మంచి పనిలోను ఫలదాయకంగా ఉన్న యెహోవా ప్రతినిధులుగా నివసించేందుకు వారు పొందాల్సిన శిక్షణను గురించి వారి పిలుపును ఒక ఉపమానంద్వారా యెషయా కరుణార్ధంగా చిత్రిస్తున్నాడు. PKTel .0

“నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి. అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైన వానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియునికొక ద్రాక్షతోట యుండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్ఠమైన ద్రాక్ష తీగెలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను.” యెష. 5:1,2. PKTel .0

తాను ఎంపిక చేసుకున్న జాతిద్వారా మానవులందరికీ ఆశీర్వాదాలు కలుగ PKTel .0

జెయ్యాలని దేవుడు ఉద్దేశించాడు. “ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట. యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము” అన్నాడు ప్రవక్త. యెష. 5:7. PKTel .0

ఈ ప్రజలకు దేవుడు తన వాక్యాన్నిచ్చాడు. “ఆయన పరిశుద్ద” ధర్మ సూత్రాలు అనగా సత్యం, న్యాయం, పరిశుద్దతను గూర్చిన సూత్రాలు వారి చుట్టూ కంచెగా ఉన్నాయి. ఈ సూత్రాలికి విధేయత వారికి రక్ష. ఎందుకంటే పాపక్రియలు అలవాట్ల వల్ల వారు తమ్మును తాము నాశనం చేసుకోకుండా అవి వారిని పరిరక్షిస్తాయి. ద్రాక్షతోటలో బురుజును వేసినట్లు ఆ దేశం మధ్యలో దేవుడు తన పరిశుద్ధ ఆలయాన్ని ఉంచాడు. PKTel .0

క్రీస్తు వారికి ఉపదేశకుడు. అరణ్యంలో వారితో ఉన్నరీతిగా ఆయన వారికింకా ఉపదేశకుడుగా మార్గదర్శకుడుగా ఉండనున్నాడు. గుడారంలోను, దేవాలయంలోను కృపాసనం పైగా ఆయన పరిశుద్ద షెకీనా మహిమ ఉండేది. వారిపక్షంగా ఆయన తన ప్రేమ, సహనాల్ని అనునిత్యం ప్రదర్శించాడు. PKTel .0

మోషేద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని వారి ముందు ఉంచి తమ ప్రగతికి షరతుల్ని వారికి విశదపర్చాడు. “నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్టిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను.” అని ఆయన అన్నాడు. PKTel .0

“యెహోవాయే నీకు దేవుడై యున్నాడనియు, నీవు ఆయన మార్గముల యందు నడిచి, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి, ఆయన మాట విందువనియు నేడు ఆయనతోమాట యిచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువనియు, తాను సృజించిన సమస్త జనములకంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీదేవుడైన యెహోవాకు ప్రతిష్టిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమందు ప్రకటించెను.” ద్వితి. 7:6; 26:17-19. PKTel .0

ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తమకు నియమించిన భూభాగమంతటినీ ఆక్రమించుకోవలసి ఉన్నారు. నిజమైన దేవుని ఆరాధనను సేవను తోసిపుచ్చిన జాతుల భూముల్ని, వీరు స్వాధీన పర్చుకోవాల్సి ఉన్నారు. కాని తన ప్రవర్తనను ఇశ్రాయేలు ద్వారా వెల్లడి చెయ్యటంద్వారా మనుష్యుల్ని తన చెంతకు ఆకర్షించు కోవాలన్నది దేవుని ఉద్దేశం. సువార్త ఆహ్వానం లోకమంతటికి అందించాల్సి ఉంది. బలిఅర్పణ సేవ బోధనద్వారా జాతులముందు క్రీస్తును పైకెత్తాలి. ఆయనవంక చూసేవారందరూ రక్షణపొందాల్సి ఉన్నారు. కనానీయురాలైన PKTel .0

రాహాబు మోయాబీయురాలైన రూతువలె విగ్రహారాధననుంచి నిజదేవుని ఆరాధనకు మళ్లిన వారందరూ దేవుని ప్రజలతో ఏకమవ్వాల్సి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల సంఖ్య పెరిగేకొద్దీ వారు తమ విస్తీర్ణతను పెంచుకుంటూ తుదకు తమ రాజ్యాన్ని లోకమంతా విస్తరించాల్సి ఉన్నారు. PKTel .0

అయితే పూర్వం ఇశ్రాయేలీయులు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. ప్రభువిలా అన్నాడు, “శ్రేష్టమైన ద్రాక్షవల్లివంటి దానిగా నేను నిన్ను నాటితిని; కేవలము నిక్కమైన విత్తనములవలని చెట్టువంటి దానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షవల్లివలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి?” “ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్షచెట్టుతో సమానము; వారు ఫలము ఫలించిరి.” “కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయం తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది తొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు జేసెదను. అది శుద్ధి చేయబడదు. పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలును, బలురక్కసి చెట్లును బలిసియుండును. దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను... ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను. నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.” యిర్మి. 2:21; హోషీ 10:1; యెష. 5:3-7. PKTel .0

అపనమ్మక జీవితంవల్ల కలిగే ఫలితాల్ని మోషేద్వారా ప్రభువు తన ప్రజల ముందు పెట్టాడు. తన నిబంధనను ఆచరించడానికి నిరాకరించటంద్వారా వారు దేవుడిచ్చే జీవంనుంచి తమ్ముని తాము దూరం చేసుకుంటారు. కనుక వారికి ఆయన దీవెనలు ఉండవు. కొన్నిసార్లు వారు ఈ హెచ్చరికల్ని పాటించినందువల్ల యూదు జాతి గొప్ప దీవెనలు పొందింది. వారిద్వారా వారి చుట్టుపట్ల ఉన్న ప్రజలుకూడా దీవెనలు పొందారు. కాని ఈ ప్రజలు అతి తరచుగా దేవున్ని మర్చిపోయి ఆయన ప్రతినిధులుగా ఉండే ఉన్నతాధిక్యతను విస్మరించిన చరిత్ర వారికున్నది. తమనుంచి ఆయన కోరిన సేవను చేయకుండా వారు ఆయన్ని దోచుకున్నారు. సాటి మనుషులికి మత విషయాల్లో మార్గం చూపించకుండా వారికి పరిశుద్ధ ధర్మం చూపించకుండా వారిని దోచుకున్నారు. తాము ధర్మకర్తలుగా ఏ ద్రాక్షతోటకు నియమితులయ్యారో దాని ఫలాన్ని తామే అనుభవించాలని ఆశించారు. వారు ప్రదర్శించిన దురాశ, స్వార్థంవల్ల అన్యజనులు సైతం వారిని PKTel .0

అసహ్యించుకున్నారు. ఈ రకంగా అన్యజన లోకం దేవుని ప్రవర్తనను అపార్ధం చేసుకోటానికి ఆయన రాజ్య చట్టాలకి తప్పుడు భాష్యం చెప్పటానికి అవకాశం కల్పించారు. PKTel .0

తండ్రి హృదయంతో దేవుడు తన ప్రజలపట్ల సహనం ప్రదర్శించారు. కృప చూపించటం ద్వారాను, కృపను నిలిపివేయటం ద్వారాను ఆయన వారితో విజ్ఞాపన చేశాడు. ఆయన ఓర్పుతో తమ పాపాల్ని వారి ముందు ఉంచాడు. వాటిని వారు గుర్తించి ఒప్పుకొనేందుకు సహనంతో కనిపెట్టాడు. తన హక్కును గురించి విజ్ఞప్తి చెయ్యటానికి ఆయన కాపులవద్దకు ప్రవక్తల్ని, సేవకుల్ని పంపాడు. అయితే అవగాహన ఆధ్యాత్మిక శక్తిగల ఈ దూతల్ని స్వాగతించే బదులు వారు శత్రువులుగా పరిగణించారు. కాపులు వారిని హింసించి చంపారు. దేవుడు ఇతర దూతల్ని పంపాడు. కాపులు వారితో కూడా ముందటిలాగే ప్రవర్తించారు. కాపులు ఈసారి మరింత ద్వేషంతో ప్రవర్తించారు. PKTel .0

చెరకాలంలో దైవానుగ్రహ ఉపసంహరణ అనేకుల్ని పశ్చాత్తాపానికి నడిపించింది. అయినా యూదులు వాగ్దత్త దేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారు తమ ముందుతరాల ప్రజలు చేసిన పొరపాట్లనే మళ్లీచేసి తమచుట్టూ ఉన్న జాతులతో రాజకీయ సంఘర్షణల్ని సృష్టించుకున్నారు. ప్రబలుతున్న చెడుగును సంస్కరించటానికి దేవుడు పంపిన ప్రవక్తల్ని వారు అనుమానంతోను, అవహేళనతోను సత్కరించారు. ఈ తీరుగా ద్రాక్షతోట కాపులు శతాబ్దం తర్వాత శతాబ్దంలో తమ అపరాధాల్ని పెంచుతూ పోయారు. PKTel .0

దివ్య వ్యవసాయకుడు పాలస్తీన కొండలపై నాటిన మంచి ద్రాక్షవల్లిని ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించి చివరికి దాన్ని ద్రాక్షతోట గోడపక్క పారేశారు. దాన్ని గాయపర్చి కాళ్లకిందవేసితొక్కి నాశనం చేశామని భావించారు. దివ్య వ్యవసాయకుడు ద్రాక్షవల్లిని తొలగించి వారికి కనిపించకుండా ఉంచాడు. దాన్ని మళ్లీ నాటాడు. కాని మొదలు కనిపించకుండా దాన్ని గోడ అవతలి పక్క నాటాడు. దాని తీగలు గోడ ఇవతలి పక్క వేలాడుతున్నాయి. వాటికి అంటులు కట్టవచ్చు. కాని దాని మొదలు మాత్రం మానవులెవరూ చేరలేని, ఏ హానీ చెయ్యలేని రీతిలో ఏర్పాటయి ఉంది. PKTel .0

ప్రవక్తల ద్వారా దేవుడిచ్చిన వర్తమానాలు ఉపదేశం ద్రాక్షతోట వ్యవసాయకులకు అనగా ఈనాడు భూమిమీద ఉన్న దేవుని సంఘానికి చాలా విలువైనవి. ప్రవక్తలు మానవుల విషయంలో దేవుని సంకల్పాన్ని విశదం చేస్తున్నారు. నశించిన మానవ జాతిపట్ల దేవుని ప్రేమ మానవుల రక్షణ నిమిత్తం దేవుని ప్రణాళిక ప్రవక్తల బోధనల్లో స్పష్టంగా వెల్లడయ్యాయి. ఇశ్రాయేలీయుల PKTel .0

పిలుపు, వారి జయాపజయాలు వారు దేవుని అనుగ్రహాన్ని తిరిగి పొందటం, ద్రాక్షతోట యజమాన్ని వారు నిరాకరించటం, నిబంధన వాగ్దానాలు ఎవరికి నెరవేర్చబడాల్సిఉన్నాయో ఆ శేషించిన ప్రజలు యుగయుగాల ప్రణాళికను కొనసాగించటం, శతాబ్దాల పొడవున దేవుని ప్రవక్తలు దూతలు ఆయన సంఘానికి అందిస్తున్న వర్తమానం ఇదే. PKTel .0

నేడు తన సంఘానికి అనగా నమ్మకమైన వ్యవసాయకులుగా ఆయన ద్రాక్షతోటను పండిస్తున్న వారికి దేవుని వర్తమానం ప్రవక్తద్వారా ఆయన పలికిన వర్తమానమే. PKTel .0

“ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును. దానిగూర్చి పాడుడి. యెహోవా అను నేను దాని కాపుచేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దానిమిదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.” యెష. 27:2,3. PKTel .0

ఇశ్రాయేలు తన ఆశలు దేవునిపై నిలపాలి. ద్రాక్షతోట యజమాని అన్ని జాతుల ప్రజల్లోనుంచి తాను దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రశస్త ఫలాల్ని ఇప్పుడు పోగు జేస్తున్నాడు. ఆయన త్వరలో తనవారి వద్దకు వస్తాడు. ఇశ్రాయేలు వంశం విషయంలో ఆయన నిత్య సంకల్పం ఆనందకరమైన ఆ దినాన నెరవేర్తుంది. “రాబోవు దినములలో యాకోబు వేరుపారును. ఇశ్రాయేలు చిగిర్చి, పూయును. వారు భూలోకమును ఫలభరితము చేయుదురు.” 6వ వచనం. PKTel .0