క్రైస్తవ పరిచర్య

125/278

వర్తమానానికి కుడి భుజం

భుజానికి హస్తానికి దేహంతో ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధమే వైద్య మిషనెరీ సేవకు మూడోదూత వర్తమానంలో ఉన్నదని నాకు పదే పదే వచ్చిన దైవోపదేశం సూచిస్తున్నది. దివ్య నాయకుని మార్గ దర్శకత్వంలో క్రీస్తు రాకడకు మార్గాన్ని సిద్దపర్చటంలో అవి ఐక్యంగా పనిచెయ్యాల్సి ఉంది. సత్యపు శరీరానికి కుడి భుజం నిత్యం చురుకుగా నిత్యం పనిచేస్తూ ఉండాలి. దేవుడు దాన్ని బలోపేతం చేస్తాడు. అయితే దాన్నే శరీరం చెయ్యటం జరగకూడదు. అదే సమయంలో శరీరం “నాకు నీ అవసరం లేదు” అని భుజంతో చెప్పకూడదు. క్రియాశీలమైన శక్తిమంతమైన సేవ చెయ్యటానికి శరీరానికి భుజం అవసరం. రెంటికీ వాటి నియమిత విధులు ఉన్నాయి. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేస్తే రెంటికీ అపార నష్టం వాటిల్లుతుంది. టెస్టిమొనీస్, సం. 6, పు. 288. ChSTel 156.2

వైద్య మిషనెరీ సేవ జరగాలి.... శరీరానికి హస్తంలా అది దేవుని సేవకు ఉపయుక్త మవ్వాలి. టెస్టిమొనీస్, సం. 8, పు. 160. ChSTel 156.3