క్రైస్తవ పరిచర్య

121/278

కలంతో, గళంతో

క్రీస్తు మన పక్షంగా విజ్ఞాపన చెయ్యటానికి నివసిస్తున్నాడని కలంతోను గళంతోను వెల్లడి చెయ్యండి. ఆ మహోన్నత కార్యకర్తతో చెయ్యి కలిపి, ఈ లోకంలో తన ప్రేమ యాత్రలో తన్నుతాను ఉపేక్షించుకునే ఆ విమోచకుణ్ని వెంబడించండి. రివ్యూ అండ్ హెరాల్డ్, జన. 24, 1893. ChSTel 151.1

ప్రభువు తమను పిలిచి నడిపించేటప్పుడు కొందరు ఒక విధంగా కొందరు మరో విధంగా పనిచేస్తారు. కాని వారందరు కలిసి కృషిచేసి దాన్ని పరిపూర్ణమైన మొత్తం చెయాల్సి ఉంది. కలంతోను స్వరంతోను ఆయన పనిని చేయాల్సి ఉంది. టెస్టిమొనీస్, సం. 9, పు. 26. ChSTel 151.2

సిలువ వేయబడ్డ క్రీస్తు గురించి మాట్లాడండి, ప్రార్ధించండి, పాడండి. అది హృదయాల్ని విరగగొట్టి జయిస్తుంది. టెస్టిమొనీస్, సం. 6, పు. 67. ChSTel 151.3

తమ హృదయ బలిపీఠం పై సత్యం మండుతున్నట్లు భావించే మనుషులు, దేవుని పట్ల స్వస్తబుద్ధి వల్ల సమతులమైన ఉత్సాహంగల మనుషుల చేతుల్లో కలం ఓ ప్రబల శక్తి. శుద్ధమైన సత్యంలో ముంచిన కలం లోకంలోని చీకటి మూలలకు వెలుగు కిరణాల్ని ప్రసరిస్తుంది. అవి వెలుగును, ప్రతిబింబించి, కొత్త శక్తిని నింపి, అన్నిచోట్ల వెలుగు వెదజల్లటానికి ఇంకా ఎక్కువ వెలుగునిస్తాయి. లైఫ్ స్కెచ్చేస్, పు. 214. ChSTel 151.4

మన వాక్య పరిచారకులు తమ శక్తులన్నింటినీ ప్రసంగాలు చెయ్యటానికి వినియోగించి అక్కడితో పని ముగించకూడదు. సేవలో ఈ శాఖను [మిషనెరీ ఉత్తర ప్రత్యుత్తరాల సేవను] చేపట్టి జయప్రదంగా ఎలా కొనసాగించాలో సంఘ సభ్యులుకి ఉపదేశించాలి. ఈ సేవ పత్రికలు మిషనరీ సేవా సంస్థకు చక్రంలోని చక్రంలా ఉంటుంది. ఈ లోపలి చక్రం కదలిక బైట చక్రాన్ని ఆరోగ్యవంతంగా, శక్తిమంతంగా పనిచేసే స్థితిలో ఉంచుతుంది. లోపలి చక్రం దాని పనిని ఆపితే దాని పర్యవసానం పత్రికలు మిషనరీ సేవా సంస్థ జీవితం కార్యకలాపాల క్షీణతలో కనిపిస్తుంది. రివ్యూ అండ్ హెరాల్డ్, జాన్ 10, 1880. ChSTel 151.5

అప్రమత్తమైన మిషనరీ సేవతో విసుగు చెందకండి. మీరు దేవునితో అనుసంధాన పడిఉంటే, మీరందరూ విజయవంతంగా చెయ్యగల సేవ ఇది. విచారణ ఉత్తరాలు రాయకముందు, మీరు నిజమైన ద్రాక్షావల్లికి అంటు కట్టేందుకు కొన్ని అడవి కొమ్మల్ని కనుగోటంలో విజయం సాధించాలని, అవి దేవుని మహిమకు ఫలాలు ఫలించాలని ఎల్లప్పుడు ప్రార్ధించండి. వినయ మనసులతో ఈ సేవలో పాలు పంచుకునేవారందరు ప్రభువు ద్రాక్షతోటలో పనివారుగా నిత్యం నేర్చుకుంటూ ఉంటారు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880. ChSTel 152.1