క్రైస్తవ పరిచర్య

4/278

వ్యక్తికి పిలుపు

ప్రతీ క్రైస్తవుడకీ ఓ నిర్దిష్టమైన పని నియమితమయ్యింది. సదర్న్ వాచ్ మేన్, ఆగస్టు 2, 1904. ChSTel 4.1

తన ద్రాక్షతోటలో ప్రతీవారూ పనిచేయాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. మీకు అప్పగించిన పనిని చేపట్టి నమ్మకంగా చెయ్యాలి. బైబిల్ ఎకో, జూన్ 10, 1901. ChSTel 4.2

మిలో ప్రతీ ఒక్కరూ సజీవ మిషనెరీ అయితే, ఈ కాలానికి దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానం అన్ని దేశాల్లో అన్ని ప్రజావర్గాలకి అన్ని భాషలు మాట్లాడేవారికి వేగవంతంగా ప్రకటితమౌతుంది. టెస్టిమొనీస్, సం.6, పు. 438. ChSTel 4.3

నిజమైన ప్రతీ శిష్యుడూ దేవుని రాజ్యంలోకి మిషనెరీగా జన్మిస్తాడు. ఏ వ్యక్తి జీవజలం తాగుతాడో అతడు జీవపు ఊట అవుతాడు. గ్రహీత దాత అవుతాడు. ఆత్మలో క్రీస్తు కృప ఎడారిలో నీటిబుగ్గలా ఉంటుంది. అది అందరిని సేదతీర్చటానికి ప్రవహిస్తూ నశించిపోటానికి సిద్దంగా ఉన్న వారిలో జీవజలం తాగాలన్న తృష్ణ పుట్టిస్తుంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 195. ChSTel 4.4

ఈ కాలానికి ఉద్దేశించిన సత్యాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడో వారిలో ప్రతీ వ్యక్తి నుంచి వ్యక్తిగతమైన సేవకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అందరూ విదేశాలకి మిషనెరీలుగా వెళ్లలేరు. కాని అందరూ తమ కుటుంబాల్లోను ఇరుగు పొరుగువారి మధ్య స్వదేశ మిషనెరీలు కావచ్చు. టెస్టిమొనీస్, సం.9, పు. 30. ChSTel 4.5

తన శిష్యులికి తన ఆదేశాన్నిచ్చినప్పుడు పరలోక సింహాసనానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే క్రీస్తు ఉన్నాడు. తన నామాన్ని విశ్వసించే వారందరినీ మిషనెరీలుగా పరిగణించి ఆయన అన్నాడు, “మీరు వెళ్లి, సమస్తజనులను శిష్యులనుగా చేయుడి.” సదర్న్ వాచ్ మేన్, సెప్టె. 20, 1904. క్రీస్తును విశ్వసించేవారిలో ప్రతీ వ్యక్తి ఆత్మల్ని రక్షించటం తన జీవిత సేవగా పరిగణించాలి. దేవుడు మనకిచ్చిన కృపనుబట్టి మనపై ప్రకాశిస్తున్న వెలుగునిమిత్తం, మనకు వెల్లడైన సత్యసౌందర్యం శక్తి నిమిత్తం మనం లోకానికి రుణస్తులమై ఉన్నాం. టెస్టిమొనీస్ సం.4, పు. 53. ChSTel 4.6

చేయాల్సిన పనికి ప్రత్యామ్నాయంగా సంస్థల పై ఆధారపడే ధోరణి అన్నిచోట్ల కనిపిస్తుంది. మానవ జ్ఞానం ఏకీకరణ పట్ల కేంద్రీకరణ పట్ల, గొప్ప భవనాలు ఆలయాలు సంస్థల నిర్మాణం పట్ల మొగ్గు చూపుతుంది. వేలాది ప్రజలు ఉపకార, కారుణ్య సేవలను సంస్థలకు, వ్యవస్థలకు విడిచి పెడారు. వారు లోకంతో సంబంధం పెట్టుకోరు. వారి హృదయాలు చల్లబడి స్పందించవు. వారు స్వార్థపరత్వంలో మునిగి ఇతరుల్ని పట్టించుకోరు. దేవుని పట్ల మనుషుడి పట్ల వారికి ఆత్మలో ప్రేమ ఉండదు. క్రీస్తు తన శిష్యులికి వ్యక్తిగతమైన పనిని నియమిస్తున్నాడు. ఆ వ్యక్తి తప్ప దాన్ని మరెవరూ చెయ్యలేరు. వ్యాధిగ్రస్తులికి బీదలకు పరిచర్య, నశించిన ఆత్మలకు సువార్త ప్రకటన కమిటీలకుగాని వ్యవస్థీకృత ధర్మ సంస్థలకుగాని విడిచి పెట్టకూడదు. సువార్త వ్యక్తిగత బాధ్యతను, వ్యక్తిగత కృషిని, వ్యక్తిగత త్యాగాన్ని కోరుతున్నది. ది. మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 147. ChSTel 5.1

దైవ వికాసాన్ని పొందిన ప్రతీవారూ జీవపు వెలుగును ఎరుగని వారి మార్గాన్ని వెలుగుతో నింపాలి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 152. ChSTel 5.2

ప్రతీ వ్యక్తికి తన తన పని నిర్దేశించబడింది. ఎవరూ ఇంకొకరికి ప్రత్యామ్నాయంకాలేరు. ప్రతీ వ్యక్తికీ అద్భుతమైన, ప్రాముఖ్యమైన కార్యం ఉంది. దాన్ని అతడు అలక్ష్యం చెయ్యకూడదు లేక ఉపేక్షించకూడదు. ఎందుకంటే రక్షించేందుకు క్రీస్తు మరణించిన ఒక ఆత్మకుదాని నెరవేర్పు మేలుచేస్తే దాని నిర్లక్ష్యం ఆ ఆత్మకు ఏడ్పుకన్నీళ్లు మిగుల్చుతుంది. రిప్యూ అండ్ హెరాల్డ్, డిసెం. 12, 1893. ChSTel 5.3

మనం దేవుని తోటి పనివారం కావాలి. సోమరులు ఆయన సేవకులుగా గుర్తింపు పొందరు. తమ కార్యాలవల్ల సంఘజీవితం సంఘాభివృద్ధి ప్రభావితమౌతాయని సంఘ సభ్యులు వ్యక్తిగతంగా గుర్తించాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్ర. 15, 1887. ChSTel 5.4

క్రీస్తు రక్షించిన ప్రతీ ఆత్మ నశించిన ఆత్మల రక్షణకు ఆయన నామంలో పనిచెయ్యటానికి పిలుపు పొందుతున్నది. ఇశ్రాయేలులో ఈ సేవను అలక్ష్యం చెయ్యటం జరుగుతున్నది. ఈనాడు క్రీస్తు అనుచరులుగా చెప్పుకుంటున్నావారు దీన్ని నిర్లక్ష్యం చెయ్యటంలేదా? క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 191. ChSTel 5.5

ప్రతీవారు చెయ్యటానికి ఏదో పనిఉంది. సత్యాన్ని విశ్వసించే ప్రతీవ్యక్తీ తన నియమిత స్థలంలోను స్థానంలోను నిలిచి, “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము” అంటూ స్పందించాలి! యెషయా 6:8. టెస్టిమొనీస్, సం.6, పు. 49. ChSTel 6.1

యేసుక్రీస్తు ప్రభువు రాకకు కని పెట్టటమే కాదు దాన్ని వేగవంత చెయ్యటం ప్రతీ క్రైస్తడికీ ఉన్న విశేషావకాశం. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 67. ChSTel 6.2

దేవుని బిడ్డగా మారేవ్యక్తి ఆ గడియనుంచి లోకాన్ని రక్షించటానికి కిందకు దించబడ్డ గొలుసులో తాను ఒక లింకుగా గుర్తిస్తూ క్రీస్తు కృపా ప్రణాళికలో పాలుపంచుకుంటూ నశించినవారిని వెదకి రక్షించటానికి ఆయనతో ముందుకు సాగుతాడు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 105. ChSTel 6.3

చెయ్యటానికి అందరికీ ఏదో ఒక పని ఉంటుంది. క్రీస్తుకి సేవ చేసే స్థలం తమకు ఎక్కడాలేదని ఎవరూ భావించనక్కరలేదు. రక్షకుడు ప్రతీ మానవుడితో సన్నిహితంగా ఆత్మీయంగా ఉంటాడు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 104. ChSTel 6.4

సేవా నిబంధనలో ప్రభువుతో ఒకటైనవారు ఆత్మల రక్షణ సమున్నత, గంభీర సేవలో ఆయనతో ఏకమవ్వటానికి కట్టుబడి ఉన్నారు. టెస్టిమొనీస్, సం.7, పు. 19. ChSTel 6.5

సేవారంగం ఎంతో విస్తృతం, సంకల్పం ఎంతో సమగ్రం గనుక ప్రతిష్ఠితమైన ప్రతీ హృదయాన్ని దైవశక్తి సాధనంగా పరిచర్యలో వినియోగించటం జరుగుతుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 47. ChSTel 6.6

మనుషులు దేవుని చేతిలో సాధనాలు. తన కృపా సంకల్పాల్ని నేరవేర్చుకోటానికి దేవుడు వారిని వినియోగించుకుంటాడు. ప్రతి వ్యక్తికి తన పాత్ర ఉంది. తాను నివసిస్తున్న కాలం అవసరాలకి అనుగుణంగా తనకు దేవుడు నియమించిన పనిని నిర్వహించేందుకు సమర్ధుణ్ని చెయ్యటానికి సరిపోయేటట్లు ప్రతీవ్యక్తికి ఆయన కొంత వెలుగునిస్తాడు. ది గ్రేట్ కాంట్రవర్సీ, పు. 343. ChSTel 6.7

ప్రతీ వ్యక్తి తన శక్తిమేరకు సేవ సేసేందుకుగాను సంఘంలో సేవా స్ఫూర్తి ప్రభవించటానికి దేవుడు ఎంతోకాలంగా కని పెడ్తున్నాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 111. ChSTel 7.1

దేవుని రాజ్యాన్ని ప్రకటించటానికి పన్నెండుమందిని ఆ తర్వాత డెబ్బయి మందిని పంపిక చేసినప్పుడు తమకు ఆయన ఏమేమి బోధించాడో వాటిని వారు ఇతరులికి బోధించాలని అది తమ విధి అని వారికి నేర్పించాడు. తన పరిచర్య అంతటిలోను వ్యక్తిగత సేవకు జన సంఖ్య పెరిగే కొద్దీ విస్తరించి క్రమేపి భూదిగంతాల వరకు సేవకు వారిని తర్పీదు చేశాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 32. ChSTel 7.2

ఈ ఆదేశం నెరవేర్చటానికి ముందుకు వెళ్లే బాధ్యత అభిషేకం పొందిన పాదుర్ల మీద మాత్రమే లేదు. క్రీస్తుని రక్షకుడుగా స్వీకరించిన ప్రతి వ్యక్తి సాటి మనుషుల రక్షణ కోసం పని చెయ్యల్నిందిగా పిలుపు పొందుతున్నాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్ పు. 110. ChSTel 7.3

సంఘ వాస్తవిక ప్రవర్తనను కొలిచేది అది చెప్పుకునే గొప్పలు, సంఘ పుస్తకాల్లో నమోదైన పేర్లు కావుగాని అది రక్షకునికి ఏమి చేస్తున్నది అన్నది; ఎడతెగకుండా నమ్మకంగా పనిచేసే సభ్యులు ఎందరున్నారు అన్నది. ప్రసంగాలు, ఆచారాల కన్నా వ్యక్తిగత ఆసక్తి, అప్రమత్తమైన వ్యక్తిగతమైన కృషి క్రీస్తు సేవాభివృద్ధిలో ఎక్కువ సాధిస్తాయి. రివ్యూ అండ్ హెరాల్డ్, సెప్టె. 6, 1881. ChSTel 7.4

ఎక్కడ సంఘం స్థాపితమైతే అక్కడ సభ్యులందరూ మిషనెరీ సేవలో చురకుగా పాల్గొవాలి. ఇరుగు పొరుగునున్న ప్రతీకుటుంబాన్నీ సందర్శించి, వారి ఆధ్యాత్మిక పరిస్థితిని తెలుసుకోవాలి. టెస్టిమొనీస్, సం.6, పు. 296. ChSTel 7.5

సంఘ సభ్యులందరూ విదేశాల్లో సేవ చెయ్యటానికి పిలుపు పొందరు గాని లోకానికి వెలుగు నిచ్చే సేవలో అందరికీ ఓ భాగముంది. క్రీస్తు సువార్త పోరాట శీలం విస్తరణ శీలం అయినది. తమ స్వార్థాశలు ఆసక్తులకు బందీలైన వారెవ్వరూ దేవుని ఆ మహాదిన మందు క్షమాపణ పొందరు. ప్రతీ మనసు ప్రతీ హస్తం చెయ్యటానికి పని ఉంది. వివిధ మనసులకు వేర్వేరు సామర్థ్యాలు గల వారికి అనుకూలంగా రూపొందించిన రకరకాల సేవ ఉంది. హిస్టారికల్ స్కెచ్చేస్, పులు. 290,291. ChSTel 7.6

ఆయన మికు పవిత్ర సత్యాన్ని అప్పగించాడు. సంఘ సభ్యుల్లో వ్యక్తిగతంగా క్రీస్తు నివసించినప్పుడు ప్రతీ ఒక్కరూ నిత్యజీవపు ఊటగల బావి అవుతారు. ఈ జీవజలాన్ని ఇతరులికి పంచటానికి శాయశక్తులా ప్రయత్నించకపోతే మీరు దేవునిముందు అపరాధులుగా నిలబడ్డారు. హిస్టారికల్ స్కెచ్చేస్, పు. 291 ChSTel 8.1

క్రైస్తవులుగా మనం క్రీస్తుకి ఆత్మలు రక్షించటానికి చెయ్యగల కృషిలో ఇరవై పాళ్లలో ఒకపాలుకూడా చెయ్యటం లేదు. మనం హెచ్చరించాల్సిన ప్రపంచం ఉంది. నమ్మకంగా నివసించటంలో, సిలువను మోయటంలో, బలమైన చర్య సకాలంలో తీసుకోటంలో, సత్యంపట్ల అచంచల విశ్వసనీయత చూపించి దైవసేవాభివృద్ధికి త్యాగాలు చేస్తూ శ్రమించటంలో, ప్రతీ యధార్థ క్రైస్తవుడు ఇతరులకి మార్గదర్శకుడుగా ఆ దర్శనీయుడుగా నివసిస్తాడు. రివ్యూ అండ్ హెరాల్డ్ ఆగ. 23, 1881. ChSTel 8.2

“నరపుత్రుడా, నిన్ను ఇశ్రాయేలు వంశానికి కావలివాడిగా నియమించాను. కాబట్టి నీవు నామాట విని వారిని నా పక్షంగా హెచ్చరించు” అన్న దైవాదేశాన్ని పొందిన ఇశ్రాయేలు ప్రవక్తకు ఎంత బాధ్యత ఉందో సత్యం తాలూకు వెలుగు పొందిన ప్రతీ వ్యక్తికి తనకున్న అవకాశాల మేరకు అంతే బాధ్యత ఉంది. టెస్టిమొనీస్, సం. 9, పులు. 19,20. ChSTel 8.3

తన కృపలో పాలుపొందే ప్రతీవ్యక్తికీ ఇతరుల నిమిత్తం తాను చేయాల్సిన పనిని ప్రభువు నియమిస్తాడు. “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము” అంటూ వ్యక్తిగతంగా మనం మన స్థానంలో నిలవాలి. వాక్య సేవకుడి పైన, మిషనెరీ నర్సు పైన, క్రైస్తవ వైద్యుడి పైన, వ్యాపారి లేక వ్యవసాయదారుడి పైన ఉద్యోగస్తుడు లేక మెకానిక్కు వంటి వ్యక్తిగత క్రైస్తవుడి పైన అందరి పైన బాధ్యత ఉంది. మనుషులికి రక్షణ సువార్తను వెల్లడించటం మన కర్తవ్యం. మనం చేసే పని ఏదైనా అది ఈ కార్యసాధనకు ఓ మార్గం కావాలి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 148. ChSTel 8.4

గృహ యజమాని తన సేవకుల్ని పిలిచినప్పుడు ప్రతీవాడికి తన తన పనిని నిర్దేశించాడు. తమ ప్రభువు వస్తువుల్ని ఉపయోగించటమన్న బాధ్యతలో దైవకుటుంబ సభ్యులందరూ చేర్చబడి ఉన్నారు. బడుగు వర్గాల వారు అనామకులు మొదలుకొని అత్యున్నతులు అత్యధికుల వరకు ప్రతీ వ్యక్తి తన సామర్థ్యంమేరకు వాటి నిమిత్తం దేవునికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ఉంది. ఎకో, జూన్ 10, 1901. ChSTel 8.5