క్రైస్తవ పరిచర్య

63/278

పని చెయ్యటం ద్వారా నేర్చుకోటం

మిషనెరీ సేవకు విద్యార్థులకు సమయం ఇవ్వటం - తమచుట్టూ ఉన్న సమాజంలోని కుటుంబాల అవసరాలేంటో గ్రహించటానికి - విద్యార్థుల సంపూర్ణ విద్యకు అవసరం. తాము సంపాదించిన జ్ఞానాన్ని వినియోగించటానికి సమయం లేనంతగా వారి పై చదువుల భారం మోపకూడదు. తప్పిదంలో ఉన్నవారితో పరిచయం ఏర్పర్చుకుని, వారికి సత్యాన్ని అందించటంలో చిత్తశుద్ధిగల మిషనెరీ కృషి చెయ్యటానికి వారిని ప్రోత్సహించాలి. దీన మనసుతో పనిచేస్తూ వివేకం కోసం క్రీస్తుని ఆశ్రయించి, ప్రార్థిస్తూ, మెలకువ కలిగి ప్రార్థిస్తూ, వారు తమ జీవితాల్ని పరిపుష్టం చేసిన జ్ఞానాన్ని ఇతరులకు అందించగలగుతారు. కౌన్సేల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పులు. 545, 546. ChSTel 72.1

విద్యాసంవత్సరంలో ఎక్కడ సాధ్యపడుందో అక్కడ నగరంలో జరుగుతున్న మిషను సేవలో విద్యార్థులు పాలుపొందాలి. చుట్టుప్రక్కల ఉన్న పట్టణాలు గ్రామాల్లో మిషనెరీ సేవ లందించాలి. క్రైస్తవ సహాయక సేవలందించటానికి వారు దళాలుగా ఏర్పడాలి. దేవునిపట్ల తమ ప్రస్తుత విధి విషయంలో విద్యార్థులు విశాల దృక్పథం కలిగి ఉండాలి. విద్యాసంవత్సరాలు ముగిశాక పెద్ద ఎత్తున సేవ చెయ్యాలని చూడక, తమ విద్యార్థి దశలోనే ఇతరులకు నిస్వార్థ సేవ చెయ్యటంలో క్రీస్తుతో కలిసి పని చెయ్యగల మార్గాన్ని అన్వేషించాలి. కౌన్సేల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్ పు. 547. ChSTel 72.2

విద్యార్థులు మనసుల్ని అతిముఖ్యమైన పాఠాలతో నింపుకోటం మాత్రమే చాలదు. తాము నేర్చుకున్నదాన్ని ఇతరులకి అందించటం నేర్చుకోవాలి. కౌన్సేల్స్ టు పేరెంట్స్, టీచర్స్, అండ్ స్టూడెంట్స్, పు. 545. ChSTel 72.3

మన కళాశాలలు శిక్షణా పాఠశాలల నుంచి మిషనెరీలు దూరదేశాలకు వెళ్లాలి. పాఠశాలల్లో ఉండగానే ఈ సేవకు విద్యార్థులు సిద్దపడటంలో కొంత సమయాన్ని ఉపయోగించాలి. తాము పరిస్థితులకు అనుగుణంగా ఎంత వరకు సర్డుకోగలరో, దేవునికి ఎంత వరకు లొంగి నివసించగలరో వారు ఇక్కడ పరీక్షకు నిలబడి నిరూపించుకోవలసి ఉన్నారు. కౌన్స్టిల్స్ టు పేరెంట్స్, టీచర్చ్, అండ్ స్టూడెంట్స్, పు. 549. ChSTel 72.4