క్రైస్తవ పరిచర్య

61/278

ఉదాహరణ

ఒక వ్యక్తి నా వద్దకు కొంత తెల్లని బట్ట తెచ్చి, దాన్ని అన్ని పరిమాణాల వ్యక్తులకు, అన్ని రకాల ప్రవర్తనలు జీవిత పరిస్థితులకు చెందిన వారికి వస్త్రాలుగా కత్తిరించమని నన్ను ఆదేశించినట్లు కలగన్నాను. వాటిని కత్తిరించి, తాను కోరినప్పుడు తయారు చెయ్యటానికి సిద్ధంగా వేలాడ తీసి ఉంచమని నాకు చెప్పాడు. నేను ఎవరికి వస్త్రాలు కత్తిరించాల్సి ఉందో వారిలో అనేకులు అనర్హులని నా అభిప్రాయం. నేను కత్తిరించాల్సి ఉన్న ముక్కల్లో ఇది చివరిదా? అని అడిగాను. కాదు ఇది ముగించిన వెంటనే నేను చేపట్టాల్సినవి ఇంకా ఉన్నాయని అతడు బదులు పలికాడు. ChSTel 69.1

నా ముందున్న పని పరిమాణం నాకు నిరాశ కలిగించింది. ఇరవై సంవత్సరాలు పైచిలుకు ఇతరులికి వస్త్రాలు కత్తిరిస్తున్నానని, నా శ్రమను అభినందిచినవారులేరని, నా పని వల్ల ఏమంత మంచి జరిగినట్లు నాకు కనిపించలేదని నేనన్నాను. నాకు బట్ట తెచ్చిన వ్యక్తి ఎవరికి వస్త్రం కత్తిరించాల్సిందని నాతో చెప్పాడో ఆమెను గురించి అతనితో వస్త్రాన్ని ఆమె అభినందించదని దాన్ని ఆమెకివ్వటం సమయం పరంగాను వస్తువు పరంగాను నష్టమే అని అన్నాను. అతడిలా బదులిచ్చాడు: “వస్త్రం కత్తిరించు అది నీ విధి. నష్టం నీదికాదు, నాది. దేవుడు మనుషుడు చూసినట్లు చూడడు. చెయ్యాలని తాను కోరే పనిని ఆయన నిర్దేశిస్తాడు. ఏది వృద్ధి చెందుతుందో, ఇదాలేక అదా? మీకు తెలియదు. అలాంటి వారిలో అనేకులు దేవుని రాజ్యంలో ఉంటారు. అయితే జీవితంలో లోటేమీ లేకుండా అన్ని దీవెనలూ ఉన్న వారు, ప్రతిభాపాటవాలు, ఆనందదాయకమైన పరిసరాలు అన్ని సదుపాయాలు ఉన్న వారు మిగిలిపోవచ్చు.” టెస్టిమొనీస్, సం. 2, పులు. 10.11. ChSTel 69.2

తమ బ్యాక్ ప్యాక్ లని తీసివెయ్యటం మళ్లీ వాటిని వీపుల మీద అమర్చుకోటం నాలుగు గంటల సేపు సైనికులతో డ్రిల్లు చెయ్యిస్తారు. ఆయుధాల్ని ఎలా వరసగా పెట్టాలో, ఎలా త్వరగా తీసుకోవాలో నేర్పిస్తారు. శత్రువుపై ఎలా దాడిచెయ్యాలో అభ్యాసం చెయ్యిస్తారు. వారికి అన్నిరకాల విన్యాసాల్లో శిక్షణనిస్తారు. ఇలా ఎలాంటి అత్యవసర పరిస్తితికైనా సైనికుల్ని సిద్ధం చేస్తూ ఢిల్లు కొనసాగుతుంది. యువరాజు ఇమ్మానుయేలు పక్క యుద్ధంచేసేవారు ఆధ్యాత్మిక పోరాటానికి తమ సిద్ధబాటులో తక్కువ పట్టుదల తక్కువ శ్రద్ద కలిగి ఉండాలా? గాసిపుల్ వర్కర్స్, పు.75. ChSTel 70.1