క్రైస్తవ పరిచర్య

54/278

సంఘ మిషనెల్ పాఠ్యవిషయం

ఎలా మొదలు పెట్టాలో నేర్పితే పని చెయ్యటానికి అనేకులు ఇష్టపడతారు. ఉపదేశమిచ్చి వారిని ప్రోత్సహించటం అవసరం. ప్రతీ సంఘం క్రైస్తవ పనివారిని తర్బీతు చేసే పాఠశాల కావాలి. ఆ సభ్యులుకి బైబిల్ పాఠాలు ఎలా బోధించాలో, సబ్బాతుబడి ఎలా నడిపించాలో, బీదవారికి ఎలా సహాయం చెయ్యాలో, జబ్బుగా ఉన్న వారికి ఎలా సేవచెయ్యాలో, అవిశ్వాసులకి సువార్త ఎలా అందించాలో నేర్పించాలి. ఆరోగ్య తరగతులు, వంట తరగతులు, వివిధరకాల క్రైస్తవ సహాయక సేవా తరగతులు జరిపించాలి. బోధించటమే కాదు అనుభవం గల ఉపదేవకుల నాయకత్వంలో వాస్తవ సేవ జరగాలి. ప్రజల మధ్య పనిచెయ్యటంలో బోధకులు ముందుండాలి. ఇతరులు వారితో కలిసి పనిచేస్తూ వారి ఆదర్శం నుంచి ఎంతో నేర్చుకుంటారు. ఒక్క ఆదర్శం అనేక నీతిబోధల కన్నా ఎక్కువ విలువను సంతరించుకుంటుంది. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 149. ChSTel 64.5