క్రైస్తవ పరిచర్య

34/278

అపరాధాలు పాపాలచేత చచ్చినవారు

ఈ నాడు మన సంఘ సభ్యుల్లో ఎక్కువమంది అపరాధాలచేత పాపాలచేత మరణించినవారు. బందుల పై తలుపులా వారు వస్తారు పోతారు. గంభీరమైన, ఆత్మను కలవరపర్చే సత్యాల్ని సంవత్సరాలుగా వింటున్నారు. కాని వాటిని ఆచరణలో పెట్టటంలేదు. కనుక ఎంతో విలువైన సత్యాన్ని లెక్కచెయ్యటంలేదు... దైవభక్తులమని చెప్పుకుంటూ భక్తితాలూకు శక్తిని ఉపేక్షిస్తున్నారు. వారు ఈ స్థితిలోనే కొనసాగితే దేవుడు వారిని నిరాకరిస్తాడు. ఆయన కుటుంబసభ్యులుగా ఉండటానికి వారు తమను తాము అనరుల్ని చేసుకుంటున్నారు. టెస్టిమొనీస్, సం.6, పులు 426, 427. ChSTel 45.2