క్రైస్తవ పరిచర్య

31/278

ఆలస్యం ప్రాణాంతకం

దైవ ప్రజలు ఏదో మార్చు చోటు చేసుకోటానికి తమను ఓ మహత్తరశక్తి స్వాధీనపర్చుకోటానికి ఎదురుచూస్తున్నట్లు దర్శనంలో చూశాను. కాని వారు ఆశాభంగం చెందుతారు. వారు పొరబడున్నారు. వారు పని చెయ్యాలి. పనిని తామే చేపట్టి, తమ విషయంలో వాస్తవిక జ్ఞానంకోసం చిత్తశుద్ధితో ప్రభువుకి మొర పెట్టుకోవాలి. మన ముందు జరుగుతున్న సన్నివేశాలు మనకు మేల్కొలుపు కలిగించాల్సినంత ప్రాముఖ్యం గలవి. వినటానికి సమ్మతంగా ఉన్న వారందరికి వాటి సత్యాన్ని మనం అందించాల్సి ఉంది. లోకంలోని పంట దాదాపు పండింది. టెస్టిమొనీస్, సం.1, పు. 261. ChSTel 44.1

ఓ ప్రక్క, తమ అవకాశాన్ని తెలివిగా వినియోగించుకునే బదులు, ఒక ప్రత్యేకమైన పునరుజ్జీవన సమయం వస్తుందని, అప్పుడు ఇతరుల్ని చైతన్యపర్చటానికి తమశక్తి వృద్ధి అవుతుందని సోమరితనంగా వేచి ఉండేవారు కొందరున్నారు. తమ ప్రస్తుత విధుల్ని అవకాశాల్ని నిర్లక్ష్యంచేసి, తమ దీపాన్ని కొడిగట్టుకు పోనిచ్చి, తమవంతుగా ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండా, ఒక సమయం వస్తుందని అప్పుడు తాము ప్రత్యేక ఆశీర్వాదం పొందుతామని, దానిమూలంగా మార్పుచెంది, సేవకోసం యోగ్యత పొందుతామని ఎదురు చూసేవారు వారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజిల్స్, పు. 54. ChSTel 44.2