క్రైస్తవ పరిచర్య

26/278

మత ఛాందసం, ఆచారబద్ధత

గొప్ప శక్తితో ప్రకటితం కావలసి ఉన్న మూడోదూత వర్తమాన సేవనుంచి మనుషుల్ని దూరంగా నడిపించటానికి సాతాను వ్యంగ్య దూషణలు మోసాలతో పనిచేస్తాడు. ప్రభువు తన ప్రజల్ని ఆశీర్వదించి, తన మోసాల్ని పసిగట్టేందుకు వారిని సిద్దంచేస్తున్నట్లు అతడు చూసినప్పుడు, గొప్ప ఆత్మల పంటపోగుచేసుకోవాలన్న ఉద్దేశంతో తన శక్తినంతా ఉపయోగించి ఒక పక్క మతమౌఢ్యాన్ని మరోపక్క లాంఛనబద్ధతను ప్రవేశపెడతాడు. ఎడతెగకుండా మెలకువగా ఉండాల్సిన సమయం ఇదే. ముందుకి పోటానికి మన మధ్య సాతాను వేసే మొదటి అడుగు విషయంలో మెలకువగా ఉండాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, జన. 24, 1893. ChSTel 40.1

మన సంఘాల్లో మంచుకొండలున్నాయి. గొప్ప ప్రదర్శన అట్టహాసం చేస్తే కాని లోకంలో వెలుగుగా ప్రకాశించలేని సంప్రదాయవాదులు చాలామంది ఉన్నారు. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 24, 1891. ChSTel 40.2