క్రైస్తవ పరిచర్య

18/278

సేవా మార్గాలు

ఇతరుల సహాయార్ధం కృషిచెయ్యటానికి యువతకు అనేక మార్గాల్లో అవకాశం లభిస్తుంది. యుతను చిన్నచిన్న గుంపులుగా ఏర్పాటు చేసి నర్సులుగా, సువార్త సందర్శకులుగా, బైబిలు చదివి వినిపించే వారిగా, గ్రంథవిక్రయ సేవకులుగా, వాక్యపరిచారకులుగా, వైద్య మిషనెరీ సువార్తికులుగా వారికి శిక్షణ నివ్వాలి. కౌన్సిల్సు టు టీచర్స్, పేరెంట్స్, అండ్ స్టూడెంట్స్, పులు. 516, 517. ChSTel 32.1

యువతకు సహాయం చెయ్యటానికి యువతకు శిక్షణ నివ్వాలి. ఈ పని చేసే ప్రయత్నంలో వారు మరింత విస్తృత పరిధిలో ప్రతిష్ఠిత సేవకులుగా పనిచెయ్యటానికి తమను సమర్థుల్ని సేసే అనుభవాన్ని సంపాదిస్తారు. టెస్టిమొనీస్, సం.6, పు. 115. ChSTel 32.2

యువతీ యువకుల్ని తమ సొంత పరిసరప్రాంతాల్లోను ఇతర స్థలాల్లోను పని చెయ్యటానికి తర్బీతు చెయ్యలి. ఈ కాలానికి దేవుడు ఏర్పాటు చేసిన పని విషయంలో జ్ఞానం సంపాదించి, అందరూ తమకు అనుకూలమైన పనికి సమర్ధత సంపాదించుకోటం పై మనసు పెట్టాలి. టెస్టిమొనీస్, సం.9, పులు. 118, 119. ChSTel 32.3