క్రైస్తవ పరిచర్య

11/278

అధ్యాయం-2
యువజనులకు పిలుపు

దైవ నియామకం

తనకు సహాయకులుగా పనిచేసేందుకు దేవుడు యువతను నియమించాడు. టెస్టిమొనీస్, సం. 7, పు. 64. ChSTel 28.1

సిలువను పొంది తిరిగిలేచి, త్వరలో రాన్ను రక్షకుని గూర్చిన వర్తమానం సుశిక్షితులైన మన యువతవంటి పని వారి సైన్యతంతో లోకానికి ఎంత త్వరలో అందించటానికి సాధ్యపడుతుందో గ్రహించవచ్చు. ఎట్టకేషన్, పు. 271. ChSTel 28.2

నేడు మనకు ఓ యువ సైన్యం ఉంది. సరియైన రీతిగా నడిపించి, ప్రోత్సహిస్తే, వారు సాధించగలిగింది చాలా ఉంది. మన బిడ్డలు సత్యాన్ని నమ్మాలన్నది మన ఆకాంక్ష. ఇతర యువజనులకు సహాయం చేసేందుకు చక్కగా ఏర్పాటైన ప్రణాళికల్లో వారు పాత్ర నిర్వహించాలని మేము కోరుతున్నాం. సత్యాన్ని సరిగా సూచించేందుకు, తమలో ఉన్న నిరీక్షణకు కారణం విశదం చేసేందుకు, ఏ శాఖలో పని చెయ్యటానికి తమకు అర్హత ఉన్నదో అందులో దేవున్ని ఘనపర్చేందుకు అందరూ శిక్షణ పొందాలి. జెనరల్ కాన్ఫరెన్స్ బులిటన్, సం. 5, నెం.2, పు. 24. ChSTel 28.3