క్రైస్తవ పరిచర్య

272/278

అధ్యాయం 27
సేవాఫలం

అమూల్యం

దేవునికి సేవ చెయ్యటం వ్యర్థం కాదు. ఆయన సేవకు తమ జీవితాన్ని అంకితం చేసుకున్న వారికి అమూల్యమైన బహుమానం ఉంది. టెస్టిమొసీన్, సం.4, పు. 107. ChSTel 312.1

తన సేవలో చేసే ప్రతీ త్యాగానికి “అత్యధికమైన తన కృపా మహ ధైశ్వర్యము” చొప్పున ఆయన ప్రతిఫలమిస్తాడు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 249. ChSTel 312.2

లోకంలో క్రీస్తుతో పనిచేస్తునందుకు ఆయన మనకిచ్చే ప్రతిఫలం ఇతోధిక శక్తి, రానున్న లోకంలో తనతో కలిసి పనిచేసే ఆధిక్యత. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 361. ChSTel 312.3