క్రైస్తవ పరిచర్య

262/278

అభినందించని వాగ్దానం

ఆత్మ తాలూకు దివ్య ప్రభావం తన అనుచరులతో చివరి వరకు ఉంటుందని క్రీస్తు చెప్పాడు. కాని దాన్ని అభినందిచాల్సినంతగా వారు అభినందించటం లేదు. కాబట్టి అది నెరవేరాల్సి ఉన్నంతగా నెరవేరటం లేదు. ఆత్మకు సంబంధించిన వాగ్దానం గురించిన ఆలోచన ఎక్కువ లేదు. దాని ఫలితం ఊహించగలిగినట్టుగా ఆధ్యాత్మిక క్షామం, ఆధ్యాత్మిక అంధకారం, ఆధ్యాత్మిక క్షీణత మరణం. ప్రాముఖ్యం లేని చిన్న చిన్న విషయాలు దృష్టిని ఆకర్షిస్తాయి. సంఘం పెరుగుదలకు అభివృద్ధికి అవసరమైన ఇతర దీవెనలన్నిటిని తేగల దైవ శక్తి సమృద్ధిగా అనంతంగా అందుబాటులో ఉన్నప్పటికీ అది లోపిస్తుంది. టెస్టిమొనీస్, సం. 8, పు. 21. ChSTel 300.1