క్రైస్తవ పరిచర్య

260/278

పొందటానికి షరతులు

తమ ఇరుగు పొరుగు వారికి అందించే నిమిత్తం జీవాహారాన్ని యాచించే వారందరి మీదికి పరిశుద్ధాత్మ వస్తాడు. టెస్టిమొనీస్, సం. 6, పు. 90. ChSTel 296.3

మనం మన హృదయాల్ని క్రీస్తుతో ఐక్యపర్చి, ఆయన సేవకు అనుగుణంగా నివసించినప్పుడు పెంతెకొస్తు దినాన శిష్యుల మీదకు వచ్చిన ఆత్మ మన మీదకు వస్తాడు. టెస్టిమొనీస్, సం.8, పు. 246. ChSTel 296.4

ఆయన కృపా సిరులు భూలోకంలోని మానవులకేసి ప్రవహించకపోటానికి కారణం దేవుని పరంగా ఏదో ఆంక్ష ఉండటం కాదు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 419. ChSTel 296.5

మనం డిమాండు చేసి అందు కునేందుకు పరిశుద్దాత్మ ఎదురుచూస్తున్నాడు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 121. ChSTel 296.6

వాగ్దాన నెరవేర్పు జరగ గలిగినంతగా జరగకపోతే అందుకు కారణం వాగ్దానాన్ని అభినందించాల్సినంతగా అభినందించకపోటమే. అందరూ సిద్ధంగా ఉంటే అందరూ ఆత్మతో నింపబడతారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 50. ChSTel 296.7

దిన దిన ఆత్మ బాప్తిస్మం నిమిత్తం ప్రతీ పనివాడు తన వినతిని దేవునికి సమర్పించుకోవాలి. క్రైస్తవ పనివారు సమూహాలుగా కూడి ఎలా ప్రణాళికలు తయారు చేసుకోవాలో వాటిని ఎలా జ్ఞానయుతంగా అమలుపర్చాలో గ్రహించేందుకు ప్రత్యేక సహాయం కోసం ప్రార్ధన చెయ్యాలి. ముఖ్యంగా మిషన్ల సేవా ప్రదేశాల్లో సేవకు ఎంపికైన రాయబారులుకి ఆత్మను ఎక్కువ ఇవ్వవలసిందిగా వారు ప్రార్ధన చెయ్యాలి. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పులు. 50, 51. ChSTel 296.8

క్రైస్తవులు తమ భేదాల్ని విడనాడి నశించిన ఆత్మల్ని రక్షించటానికి తమని తాము దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు వాగ్దానం చేసిన దీవెనల్ని అనుగ్రహించాల్సిందిగా వారు విశ్వాసంతో అడిగితే అవి వారికి కలుగుతాయి. టెస్టిమొనీస్, సం. 8, పు. 21. ChSTel 297.1

శిష్యులు తమ కోసం దీవెనల్ని కోరలేదు. ఆత్మల రక్షణ నిమిత్తం వారి హృదయాలు బరువెక్కాయి. సువార్తను భూదిగంతాలకి తీసుకువెళ్లాల్సి ఉంది. కనుక క్రీస్తు వాగ్దానం చేసిన శక్తి కోసం వారు ప్రార్ధించారు. పరిశుద్దాత్మ కుమ్మరింపు అప్పుడు జరిగింది. ఒక్క రోజునే వేలమంది నమ్మి క్రైస్తవులయ్యారు. సదర్న్ వాచ్ మేన్, ఆగ.1, 1905. ChSTel 297.2

క్రీస్తు తన సంఘానికి పరిశుద్దాత్మ వరాన్ని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఆది శిష్యులుకి ఏ మేరకు వర్తించిందో మనకూ అదే మేరకు వర్తిస్తుంది. కాని ప్రతీ ఇతర వాగ్దానంలాగే ఇదీ షరతులతో వస్తున్న వాగ్దానమే. ప్రభువు వాగ్దానాన్ని విశ్వసించి దాని నెరవేర్పును కోరేవారు చాలామంది ఉన్నారు. వారు క్రీస్తును గురించి పరిశుద్ధాత్మను గురించి మాట్లాడతారు. అయినా ఎలాంటి ప్రయోజనాన్నీ పొందరు. దైవ సాధనాల మార్గదర్శకత్వానికి, నియంత్రణకి వారు తమ ఆత్మను సమర్పించరు. మనం పరిశుద్దాత్మను ఉపయోగించలేం. పరిశుద్ధాత్మ మనల్ని ఉపయోగించాలి. ఇచ్చయించుటకును, కార్యసిద్ధి కలుగుజేసి కొనుటకును” పరిశుద్దాత్మ ద్వారా దేవుడు తన ప్రజల్లో పని చేస్తాడు. కాని అనేకులు తమని తాము సమర్పించుకోరు. తమంతట తామే వ్యవహరించగోరారు. ఇందువల్ల వారు ఈ పరలోక వరాన్ని పొందరు. వినయ హృదయులై వేచి ఉండే వారికి మాత్రమే, ఆయన మార్గదర్శకత్వం కోసం, కృప కోసం అప్రమత్తులై ఉండే వారికి మాత్రమే ఆత్మ అనుగ్రహించబడుతుంది. వారు డిమాండు చేసి పొందే నిమిత్తం దేవుని శక్తి వేచి ఉంది. విశ్వాసం ద్వారా పొందాల్సి ఉన్న ఈ వాగ్దత్త దీవెన దానితో పాటు ఇతర దీవెనలన్నింటిని తీసుకువస్తుంది. కృపా సంపద ప్రకారం క్రీస్తు దాన్ని ఇవ్వటం జరుగుతుంది. పొందటానికి తనకున్న సామర్థ్యాన్ని బట్టి ప్రతీ ఆత్మకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 672. ChSTel 297.3

దేవుని జతపని వారంటే ఏంటో అనుభవ జ్ఞానం ద్వారా వికాసం పొందిన ప్రజలు ఉండే వరకు, సర్వజగత్తును తన మహిమతో వెలిగించే దైవాత్మ కుమ్మరింపు జరగదు. క్రీస్తు సేవకు మనం పూర్తిగా హృదయ పూర్వకంగా ప్రతిష్టించుకున్నప్పుడు, తన ఆత్మను అపరిమితంగా కుమ్మరించటం ద్వారా దేవుడు ఆ విషయాన్ని గుర్తిస్తాడు. కాని సంఘంలో ఎక్కువ మంది దేవుని జతపనివారు కానప్పుడు ఇది జరగదు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూలై 21, 1896. ChSTel 298.1