క్రైస్తవ పరిచర్య

257/278

విశ్రాంతి, చింతన

తాము ఎలా పనిచెయ్యాలో ఎలా విశ్రమించాలో శిష్యులుకి యేసు ఉపదేశించటం అవసరమయ్యింది. నేడు దేవుని సేవకులు క్రీస్తు ఆదేశాన్ని అనుసరించి విశ్రాంతి తీసుకోవాల్సిన వసరం ఉంది. ఈ ఆజ్ఞను గూర్చిన అజ్ఞానం వల్ల విలువైన అనేక జీవితాలు ముగిసిపోయాయి. అవి అలా గతించిపోనవసరంలేదు.... కోత విస్తారంగా ఉన్నా పనివారు తక్కువమందే ఉన్నా ఆరోగ్యాన్ని ప్రాణాన్ని పోగొట్టుకోటం వల్ల వచ్చే లాభం ఏమి లేదు.... బలహీనులు క్షీణ దశకు చేరి, ఇంకా చేయాల్సి ఉన్న పనిని చూసి, తాము ఏమి చెయ్యలేనందుకు తీవ్ర చింతకు లోనయ్యేవారు చాలామంది ఉన్నారు. ఎక్కువ సాధించటానికి శారీరక శక్తికోసం వారు ఎంతగా ఆశపడతారు! అయితే ఈ తరగతినుద్దేశించే క్రీస్తు, ” మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి” అంటున్నాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, నవ. 7, 1893. ChSTel 292.2

క్రైస్తవ జీవితమంటే నిత్యం పని చెయ్యటం లేక నిత్యం ధ్యానించటం కాదు. క్రైస్తవులు నశించిన వారి రక్షణ కోసం చిత్తశుద్ధితో కృషిచెయ్యాలి. వారు ధ్యానించటానికి, ప్రార్ధించటానికి, దైవ వాక్యాన్ని అధ్యయనం చెయ్యటానికి సమయం గడపాలి. ఎప్పుడూ పని ఒత్తిడి ఆందోళనకు గురి అవ్వటం మంచిదికాదు. ఎందుచేతనంటే ఇది వ్యక్తిగతమైన భక్తి జీవితాన్ని అశ్రద్ధ చెయ్యటానికి దారి తీస్తుంది. మానసిక శారీరక శక్తులకు హాని కలిగిస్తుంది. రివ్యూ అండ్ హెరాల్డ్, నవ. 7, 1893. ChSTel 292.3

దేవుని శిక్షణ కింద ఉన్న వారందరూ తమ హృదయాలతోను, ప్రకృతితోను, దేవునితోను సమ్మేళనానికి ప్రశాంత గడియలు అవసరం. లోకం దాని ఆచారాలు అభ్యాసాలతో సంబంధంలేని జీవితం వారిలో వెల్లడి కావాలి. దేవుని చిత్తాన్ని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించటంలో వారికి వ్యక్తిగత ఆచరణాత్మక అనుభవం అవసరం. హృదయంతో ఆయన మాట్లాడటం మనం వ్యక్తిగతంగా వినాలి. ప్రతీ ఇతర స్వరం సద్దుమణిగినప్పుడు, ఆయన ముందు మనం మౌనంగా వేచినప్పుడు, ఆత్మలోని నిశ్శబ్దం దేవుని స్వరాన్ని మరింత స్పష్టం చేస్తుంది. ఆయన ఇలా ఆదేశిస్తున్నాడు: “ఊరకుండుడి, నేనే దేవుడనని తెలిసికొనుడి.” దేవునికి చేసే సమస్త సేవకు ఇది ఫలప్రదమైన సిద్దబాటు. హడావుడిగా కదులుతున్న జనసమూహాల నడుమ, జీవిత కార్యకలాపాల ఒత్తిడి కింద ఈవిధంగా అలసట తీర్చుకునే వ్యక్తి చుట్టూ వెలుగు సమాధానం వాతావరణం ఉంటుంది. అతడు శారీరక శక్తిని మానసిక శక్తిని నూతనంగా పొందుతాడు. అతడి జీవితం ఇం పైన సువాసనలు వెదజల్లుతుంది. అది మానవ హృదయాల్ని చేరే దైవ శక్తిని వెల్లడి చేస్తుంది. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 58. ChSTel 293.1