క్రైస్తవ పరిచర్య

224/278

పరలోక నివేదన పద్దతి

ప్రతీ మనిషి పనిని గూర్చి దూతలు నమ్మకమైన రికార్డు ఉంచుతారు. టెస్టిమొనీస్, సం.1, పు. 198. ChSTel 259.2

ప్రేమగల ప్రతీ కార్యం, దయగల ప్రతీమాట, బాధపడుతున్న వారి నిమిత్తం, పీడితుల నిమిత్తం చేసే ప్రార్థన ప్రతీ మాట దేవుని నిత్య సింహాసనం ముందు నివేదితమై పరలోక రికార్డులో దాఖలవుతుంది. టెస్టిమొనీస్, సం.5, పు. 133. ChSTel 259.3

చీకటిని పారదోలటానికి, క్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని విస్తరింపజెయ్యటానికి మనం చేసే విజయవంతమైన ప్రతీ ప్రయత్నం గురించి పరలోకానికి ఓ నివేదికను తీసుకు వెళ్లటం జరగుతుంది. ఆ చర్యదేవుని ముందు వివరించబడ్డప్పుడు పరలోక నివాసులందరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 154. ChSTel 259.4

మనకు పరిచర్య చెయ్యాల్సిందిగా దేవదూతల్ని దేవడు ఆదేశించాడు. మనుషుల క్రియల రికార్డు పట్టుకుని భూమినుంచి పరలోకానికి దేవదూతలు ఎక్కుతూ ఉంటారు. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 2, 1902. ChSTel 259.5

పరలోకంలో ఉన్న రికార్డు గురించి జ్ఞాపకముంచుకోటం మంచిది. అది లోపాలు, పొరపాట్లు లేని గ్రంథం. అందులోని విషయాల ఆధారంగా అందరూ తీర్పు పొందుతారు. దేవుని సేవ చెయ్యటానికి తప్పించుకున్న ప్రతీ అవకాశం అందులో దాఖలవుతుంది. అక్కడే ప్రతీ విశ్వాస క్రియ ప్రతీ ప్రేమా కార్యం దాఖలై నిత్యజ్ఞాపకర్థాంగా నిలిచి ఉంటుంది. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 69. ChSTel 260.1