క్రైస్తవ పరిచర్య

219/278

అనాధల సంరక్షణ

విజయం మరణాన్ని మింగివేసే వరకు సంరక్షణ పొందాల్సిన అనాధలు ఉంటూనే ఉంటారు. వారి పక్షంగా మన సంఘ సభ్యులు ప్రేమానురాగాలు కరుణా కటాక్షాలు చూపించకపోతే, వారు ఎన్నో విధాలుగా బాధలు శ్రమలు అనుభవిస్తారు. ప్రభువు మనల్ని ఇలా ఆదేశిస్తున్నాడు, “దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొను”ము. ఈ నిర్వాసితులకు క్రైస్తవ్యం తండ్రుల్ని తల్లుల్ని సరఫరా చెయ్యాలి. ప్రార్ధనల్లోను, క్రియల్లోను విధవరాండ్రు, అనాధలపట్ల వ్యక్తం చేసే దయకనికరాలు ఒక దినాన జ్ఞాపకానికి ప్రతి ఫలానికి ప్రభువు ముందుకి వస్తాయి. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 27, 1893. ChSTel 251.5

బీదలకు సహాయం చేసినప్పుడు, శ్రమలు పడుతున్న వారికి హింసపొందుతున్న వారికి సానుభూతి చూపించినప్పుడు, అనాధలకు సహాయ పడినప్పుడు, మీరు యేసుతో సన్నిహిత సంబంధం ఏర్పర్చుకుంటారు. టెస్టిమొనీస్, సం. 2, పు. 25. ChSTel 252.1

రక్షణ పొందాల్సిన అనాధలు ఉంటారు. కాని అనేకులు అలాంటి వారి సేవను చేపట్టారు. ఎందుకంటే అది శ్రమతో కూడిన పని. అది చెయ్యటం వారికి ఇష్టం ఉండదు. తమ ఆనందానికి సంతోషానికి అది ఎక్కువ సమయం మిగల్చదు. అయితే రాజు పరిశీలన జరిపినప్పుడు, నిష్క్రియాపరులు, ఔదార్ల్యంలేనివారు, స్వార్థపరులు అయిన వీరు పని గలిగి ఉండే వారికే, క్రీస్తు నిమిత్తం తమను తాము ఉపేక్షించుకునేవారికే పరలోకం అని గ్రహిస్తారు. తమను తాము ప్రేమించుకుంటూ తమ ప్రయోజనాల్నే చూసుకోటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారికి ఎలాంటి ఏర్పాట్లూ లేవని గ్రహిస్తారు. తన ఎడమ పక్క ఉన్న వారికి ఇస్తానని రాజు చెప్పిన భయంకర శిక్ష వారి ఘోర నేరాల వల్ల కాదు. తాము చేసినవాటికి వారు ఖండన పొందలేదు. తాము చెయ్యని వాటికి పొందారు. దేవుడు తమ కు విధించిన పనుల్ని వారు చెయ్యలేదు. తమని తాము తృప్తిపర్చుకున్నారు గనుక వారు స్వార్థపరులతో కలిసి భాగం పంచుకోవాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ. 16, 1881. ChSTel 252.2

తన అనుచరులు దేవుని వద్ద నుంచి వస్తున్న ట్రస్టుగా స్వీకరించాల్సిన అనాధలున్నారు. తరచు ఉదాసీన ధోరణిలో వీరిని దాటివెళ్లిపోటం జరుగుతున్నది. వారు చినిగిన బట్టలు వేసుకుని, మోటుగా, అందవికారంగా ఉండవచ్చు. అయినా వారు దేవుని సొత్తు. విలువ పెట్టి కొనపబడ్డావారు. ఆయన దృష్టిలో మనమెంత విలువగలవారమో వారూ అంతే విలువగలవారు. వారు దేవుని గొప్ప కుటుంబంలో సభ్యులు. క్రైస్తవులు ఆయన గృహ నిర్వాహకులుగా వారి నిమిత్తం బాధ్యులు. ప్రభువువంటున్నాడు, “వారి ఆత్మలకు మిమ్మల్ని జవాబుదారుల్ని చేస్తాను.” క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 386, 387. ChSTel 252.3

ఈ అనాధల పట్ల తన విధిని నిర్వర్తించాలని ప్రతీ సంఘ సభ్యుడికి దేవుడు పిలుపునిస్తున్నాడు. వారి నిమిత్తం కేవలం విధి నిర్వహణ దృక్పథంతో కాక మీరు వారిని ప్రేమిస్తున్నందుకు, వారిని రక్షించటానికి క్రీస్తు మరణించినందుకు పని చెయ్యండి. మీ సంరక్షణ అవసరమైన ఈ ఆత్మల్ని క్రీస్తు కొన్నాడు. మా పాపాల్లోను మీ అవిధేయతలోను ఆయన మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అలా మీరు వారిని ప్రేమించాలని ఆయన కోరుతున్నాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 27, 1893. ChSTel 253.1

అనాధలు, తండ్రిలేనివారు, కుంటివారు, గుడ్డివారు, వ్యాధిగ్రస్తులు అలక్ష్యానికి గురి అవుతుండగా ప్రభువు తన ప్రజలు చేసే ప్రార్ధనలు ఆలకించడు. టెస్టిమొనీస్, సం. 3, పు. 518. ChSTel 253.2

మిత్రులులేని ఈ పిల్లలు బాలలు దేవుని బిడ్డలయ్యేందుకు సరియైన ప్రవర్తనను నిర్మించుకునేందుకు అనుకూలమైన స్థితిలో ఉండటానికి సంరక్షించటంలో ప్రభువు సేవ చేసే వారందరి ముందు విశాల సేవారంగం ఉంది. వృద్ధిలోకి వచ్చే సూచనలులేని పిల్లలుంటారు. వారిని కరుణాకటాక్షాలతో వెతకాలి. లేకపోతే అజ్ఞానంలో పెరిగి, దుర్మార్గం, నేరంలోకి లాక్కుపోయే స్నేహాల నుంచి అనుకూల పరిసరాల్లోకి తీసుకురావటానికి అవకాశమున్న బిడ్డలు, క్రీస్తు వంటి దయ, ప్రేమానురాగాలు గల సంరక్షణ, ఆలన పాలన కిందకు తెస్తే, క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించే బిడ్డలు అనేకమంది ఉన్నారు... ఇతరుల మేలు కోసం చేసే ఈ సేవకు ఆత్మోపేక్ష, త్యాగం అవసరం. అయితే దేవుడు తన అద్వితీయ కుమారుణ్ని ఇవ్వటంలో చేసిన త్యాగంతో పోల్చితే, మనం చేసే చిన్న చిన్న త్యాగాలు ఏపాటివి? తన జత పని వారమయ్యే ఆధిక్యతను దేవుడు మనకు ఇస్తున్నాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 27, 1893. ChSTel 253.3