క్రైస్తవ పరిచర్య

200/278

పనివారి చేతులు బలపర్చండి

అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకి ఈనాటి సత్యాన్ని అందించటంలో తన ప్రజలు గతంలో ఎక్కువ కృషి చెయ్యటం చూడటం దేవునికి ఆనందంగా ఉంటుంది. పెద్దలైన ఓల్సన్* ఆయన సహచరులు చేస్తున్న సేవలో వారికి చేయూతనిద్దాం. తమ కొద్దిపాటి బత్తెంతో తమ గొప్ప సేవను చేయటానికి తామే శ్రమపడటానికి వారిని ఒంటరిగా విడిచి పెట్టకూడదు. రివ్యూ అండ్ హెరాల్డ్, అక్టో, 29, 1914. ChSTel 234.4

ఇటాలియన్లు, సెర్బియన్లు, రుమేనియన్లు, రష్యన్లు ఇంకా అనేక ఇతర జాతుల ప్రజల మధ్య ఆశాజనకమైన ప్రారంభాల్ని గురించి పెద్దలు ఓల్సన్* మాకు వివరించారు. వారు చేసిన సేవ నిమిత్తం మాకెంతో ఆనందంగా ఉంది. అయినా ద్రవ్యం కొరత వల్ల చేయగలిగిన సేవలో చాలా మట్టుకు విడిచి పెట్టాల్సి వచ్చిందని తెలిసినప్పుడు మానసికంగా బాధపడ్డాం. అమెరికా అంతటిలోను పోగుచేయాల్సి ఉన్న ప్రత్యేక విరాళం ఈ శాఖ నాయకులైన సహోదరులు దేశంలోని మహా నగరాల్లో మరింత తీవ్రంగా సేవచెయ్యటానికి తోడ్పస్తుందని ఆశిద్దాం. ఈ రకంగా అనేకులు మన విశ్వాసులు కావచ్చు. వారిలో నుంచి అనేకుల్ని మన దేశంలోను ఇంకా ఇతర దేశాల్లోను ఉన్న తమ జాతీయులికి సత్యాన్ని ప్రకటించటానికి సిద్దం చెయ్యవచ్చు. రివ్యూ అండ్ హెరాల్డ్, అక్టో, 29, 1914. ChSTel 234.5