క్రైస్తవ పరిచర్య

194/278

మిషనెరీ పద్ధతుల ఆచరణాత్మక ప్రదర్శన

శిబిర సమావేశాల్లో పనిచెయ్యటం ద్వారా తమ స్థానిక సంఘాల్లో విజయవంతంగా ఎలా పని చెయ్యాలో అందరూ నేర్చుకోవచ్చు. టెస్టిమొనీస్, సం. 6, పు. 49. ChSTel 228.1

మన శిబిర సమావేశాల్లో కొన్నిటింలో నగరాల్లోకి వాటి శివారుల్లోకి వెళ్లి సాహిత్యాన్ని పంచటానికి, ప్రజల్ని సమావేశాలికి ఆహ్వానించటానికి పనివారి బృందాల్ని ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఈ సాధనం ద్వారా వందలమంది సమావేశం మధ్యలో వచ్చి క్రమంగా హాజరయ్యారు. ఇలాకాకపోతే ఈ సమావేశాల గురించి వారు తలంచేవారే కాదు. టెస్టిమొనీస్, సం. 6, పు. 36. ChSTel 228.2

అందుకోటానికే కాదు అందించటానికి కూడా మనం శిబిర సమావేశానికి హాజరవ్వవచ్చు. క్రీస్తు క్షమా పూర్వక ప్రేమలో పాలివాడయ్యే ప్రతీ వ్యక్తి, దేవుని ఆత్మవలన చైతన్యం మారుమనసు పొంది సత్యాన్ని స్వీకరించే ప్రతీవ్యక్తి తాను కలిసే ప్రతీ ఆత్మకు ఈ ప్రశస్త దీవెనల నిమిత్తం రుణస్తుణ్నని భావిస్తాడు. అభిషేకం పొందిన వాక్య పరిచారకుడు చేరలేని ఆత్మల్ని చేరటానికి ఆత్మ విషయంలో దీనులైన వారిని ప్రభువు వినియోగించుకుంటాడు. క్రీస్తు రక్షణ కృపను వెల్లడి చేసే మాటలు మాట్లాడటానికి ఆయన వారిని ఆవేశపర్చుతాడు. టెస్టిమొనీస్, సం. 6, పు. 43. ChSTel 228.3

మనం దేవుని ప్రణాళికల్ని అనుసరించినప్పుడు దేవుని జతపనివారము” అవుతాము. మన హోదా ఏదైనా - కాన్ఫరెన్సు అధ్యక్షులు, వాక్య పరిచారకులు, ఉపాధ్యాయులు విద్యార్దులు లేక సంఘ సభ్యులు, ఎవరిమైనా నేటి సత్యం అవసరమైన వారికి ఈ సత్యాన్ని అందించటానికి మనల్ని జవాబుదారులుగా దేవుడు ఎంచుతాడు. మనం ఉపయోగించేందుకు ఆయన ఏర్పాటు చేసిన ప్రధాన సాధనాల్లో ఒకటి ముద్రిత వాక్యం. విలువైన ఈ సాధనాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించటం మన పాఠశాలల్లోను, ఆసుపత్రుల్లోను, స్థానిక సంఘాల్లోను, మరీ ముఖ్యంగా మన సాంవత్సరిక శిబిర సమావేశాల్లోను మనం నేర్చుకోవాలి. అవిశ్వాసుల్ని దయగా, ఆకట్టుకునే రీతిగా ఎలా సమీపించి, ఈ కాలానికి ఉద్దేశించిన సత్యాన్ని స్పష్టంగా శక్తిమంతంగా సమర్పిస్తున్న సాహితాన్ని వారి చేతుల్లో ఎలా పెట్టాలో మన ప్రజలకు ఉపదేశించగల పని వారిని జాగ్రత్తగా ఎంపిక చెయ్యాలి. టెస్టిమొనీస్, సం. 9, పులు. 86, 87. ChSTel 228.4

శిబిర సమావేశాల్లోని సేవ మానవుల పథకాల ప్రకారం కాక క్రీస్తు పనిచేసిన తీరుగా జరగాలి. సేవ చెయ్యటానికి సంఘ సభ్యుల్ని ప్రోత్సహించాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 120. ChSTel 229.1