క్రైస్తవ పరిచర్య

192/278

అధ్యాయం 18
శిబిరసమావేశం క్రైస్తవసేవకు ఆసరా

ప్రాముఖ్యం

శిబిర సమావేశం మన సేవలో అతిముఖ్యమైన సాధనాల్లో ఒకటి. ప్రజల గమనాన్ని, ఆకర్షించే అతి సమర్ధమైన పద్దతుల్లో అది ఒకటి. టెస్టిమొనీస్, సం. 6, పు. 31. ChSTel 226.1

ప్రజలకు ఎంతో అవసరమైన ప్రశస్త సత్యాన్ని వారి ముందుకు తేవటంలో మనకు ఎదురవుతున్న ప్రతిబంధకాల్ని అధిగమించటం ఎలాగో తెలియక మనం ఆందోళన చెందుతుంటాం. ఈ కర్తవ్య సాధనకు శిబిర సామావేశం అతిముఖ్యమైన సాధనాల్లో ఒకటని ప్రభువు మనకు ఉపదేశించాడు. టెస్టిమొనీస్, సం. 6, పులు. 31,32. ChSTel 226.2