క్రైస్తవ పరిచర్య

188/278

చెయ్యూత ఇవ్వాలి

చెడు అంతటిలోను ఘోరమైంది పాపం. పాపిని కనికరించి సహాయం చెయ్యాలి. అయితే అందరినీ ఒకే తీరుగా చేరలేం. తమ ఆత్మ ఆకలిని దాచుకునేవారు చాలామంది ఉన్నారు. దయగల ఓ మాట దయలగల పలకరింపు వారికెంతో మేలు చేస్తుంది. చాలా అవసరంలో ఉన్నవారు ఉన్నారు. అయినా అదివారికి తెలియదు. ఆత్మతాలూకు భయంకర నాశనాన్ని వారు గుర్తించరు. వేల ప్రజలు నిత్య వాస్తవాల సృహను కోల్పోయేంత గా, దేవుని పోలికను కోల్పోయేంతగా, పాపంలో కూరుకుపోయారు. రక్షించబడాల్సిన ఆత్మలు తమకున్నవో లేవో వారికి తెలియదు. వారికి దేవుని మీద విశ్వాసం లేదు, మానవుడి మీద నమ్మకంలేదు. వీరిలో అనేకుల్ని స్వార్థరహిత సానుభూతి ద్వార్మామాత్రమే చేరగలుగుతాం. వారి శారీరక అవసరాల్ని తీర్చటం అవసరం. వారికి ఆహారం పెట్టాలి. స్నానం చెయ్యించి వారిని శుభ్రపపర్చాలి. వారికి బట్టలు ధరింపజెయ్యాలి. మీ స్వార్థరహిత ప్రేమకు నిదర్శనాల్ని చూసినప్పుడు, క్రీస్తు ప్రేమను విశ్వసించటం వారికి సులభతరమౌతుంది. ChSTel 222.1

తప్పులు చేసేవారు తమ సిగ్గును తమ దోషిత్వాన్ని తెలుసుకునే వారు చాలామంది ఉంటారు. వారు తమలో తెగింపు కలిగేంతవరకు తమ తప్పిదాలు అపరాధాల వంక చూస్తూ ఉంటారు. ఈ ఆత్మల్ని అశ్రద్ద చెయ్యకూడదు. ఒకడు ప్రవాహానికి ఎదురు ఈదుతున్నప్పుడు ప్రవాహం శక్తి అంతా అతణ్ని వెనక్కు నెట్టుతుంది. మునిగిపోతున్న పేతురుకి పెద్దన్న చెయ్యి చాపినట్లు, అతడికి సహాయం చెయ్యటానికి చెయ్యి చాపండి. అతడిలో నమ్మకం ప్రేమ పుట్టించేందుకు నిరీక్షణగల మాటలు మాట్లాడండి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 387. పాప జీవితంలో అలసిపోయి దాని నుంచి విడుదల ఎక్కడ లభిస్తుందో ఎరుగని ఆత్మకు దయగల రక్షకుణ్ని సమర్పించండి. చెయ్యి అందించి పైకిలేపి అతడితో చక్కని మాటలు ఉత్సాహాన్ని నిరీక్షణను పుట్టించే మాటలు మాట్లాడండి. రక్షకుని చెయ్యిపట్టుకోటానికి అతడికి సాయపడండి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 168. ChSTel 222.2